జాతీయ వార్తలు

క్షమాపణ చెప్పేందుకు రోజాకు అవకాశం ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అసెంబ్లీలో తన ప్రవర్తనకు సంబంధించి వివరణతో కూడిన క్షమాపణ చెప్పుకునేందుకు వైకాపా ఎమ్మెల్యే రోజాకు అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టు శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శికి సూచించింది. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో తాను చేసిన వ్యాఖ్యలు, అనంతరం దారితీసిన పరిణామాలపై వైకాపా ఎమ్మెల్యే రోజా ఈరోజు సుప్రీంకోర్టుకు వివరణ పత్రం సమర్పించారు. శాసనసభలో తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లుగా లేఖలో రోజా పేర్కొన్నారు. వివరణ పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపాలని న్యాయస్థానం సూచించింది. శాసనసభ రోజా లేఖను పరిగణనలోకి తీసుకుని ఈ అంశానికి ముగింపు పలకాలని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను ఆగస్టు నెలాఖరుకు కోర్టు వాయిదా వేసింది.