జాతీయ వార్తలు

కాంగ్రెస్ నిర్వాకం వల్లే రైల్వేల వెనుకబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీర్ఘకాలం అధికారంలో ఉన్నా చేసింది పూజ్యం: సురేష్ ప్రభు

బలియా, నవంబర్ 23: దేశానికి జీవనాడిగా పరిగణించే రైల్వే వ్యవస్థ వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని, కేంద్రంలో ఆ పార్టీ ఎన్నో ఏళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ రైల్వేలను అభివృద్ధి చేయడంలో ఘోరంగా విఫలమైందని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బలియా-చాప్రా స్టేషన్ల మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్ పనులకు సోమవారం ఆయన ఇక్కడ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సురేష్ ప్రభు మాట్లాడుతూ, దేశంలో వరుసగా ఎన్నో ఏళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలే రైల్వేల వెనుకబాటుకు కారణమని, రైల్వేల అభివృద్ధికి చర్యలు చేపట్టడంలో ఆ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని, పెట్టుబడులు పెట్టకుండా దేశ జీవనాడిని కుంగదీశాయని నిప్పులు చెరిగారు. రైల్వేల ఆధునీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎటువంటి కృషి చేయలేదని, అందువల్లనే దేశంలో ఇప్పటికీ ఎన్నో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం నుంచి దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా పొందిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తమ తొలి బడ్జెట్‌లోనే రైల్వేల అభివృద్ధికి విప్లవాత్మకమైన చర్యలు చేపట్టిందని సురేష్ ప్రభు చెప్పారు. తదుపరి ఐదేళ్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ బడ్జెట్ ఎన్నో సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. బడ్జెట్‌లో రైల్వేలకు రూ. 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు కేటాయించాలని అప్పట్లో తాము చేసిన ప్రతిపాదనను అందరూ పరిహసించారని, అయితే కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే రైల్వేలకు తాము రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు సమకూర్చగలిగామని సురేష్ ప్రభు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
(చిత్రం) బలియా-చాప్రా స్టేషన్ల మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, మనోజ్ సిన్హా