జాతీయ వార్తలు

ఆర్థిక సంక్షోభంలో గ్రామీణ భారతం:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రస్తుతం భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందిన, దీన్ని గాడిలో పెట్టాలంటే కాంగ్రెస్ మేనిఫేస్టోను బీజేపీ దొంగిలించాలని, ఆ పార్టీ వద్ద ఎలాంటి విధానం లేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ముఖ్యంగా గ్రామీణ భారతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని, దీని నుంచి గట్టెక్కాలంటే బీజేపీ వద్ద ఎలాంటి వ్యూహాలు లేవని అన్నారు. తాజా ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దాలంటే మా మానిఫేస్టోలోని అంశాలను ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దొంగిలించాలని ట్విట్టర్‌లో అన్నారు. ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్నాయి. అధికార బీజేపీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉందని అన్నారు,