జాతీయ వార్తలు

విమానాల్లో మోదీ.. పంట పొలాల్లో నేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతులు, పేదల పక్షానే కాంగ్రెస్
ఈ పోరులో చావుకయినా సిద్ధం
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్

షహరాన్‌పూర్ (ఉత్తర్‌ప్రదేశ్), నవంబర్ 23: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమానాలెక్కి విదేశాలు తిరుగుతూ బిజీగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతులు, కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో చెరకు రైతుల దుస్థితిని వెలుగులోకి తేవడానికి ఉద్దేశించిన ‘పాదయాత్ర’ను సోమవారం ఇక్కడ ఆయన ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘అచ్ఛే దిన్’ నినాదమిచ్చిన నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. మోదీ హామీ ఇచ్చిన మంచి రోజులు ఎక్కడున్నాయని ఆయన ప్రశ్నించారు. రైతులు, కార్మికులు, పేద ప్రజలు బాగున్నామని భావించిన కాంగ్రెస్ మంచి రోజులు వస్తాయని రాహుల్ గాంధీ అన్నారు. ‘నరేంద్ర మోదీ విమానం ఎక్కి ఇంగ్లాండ్‌కు వెళ్తుంటే, రాహుల్ గాంధీ మీ పంట పొలంలో మీ మధ్యన నిలబడి ఉన్నాడు. మేము మీతోనే ఉన్నామని, కాంగ్రెస్ పార్టీ మీతోనే ఉందని, మీకోసం చేసే పోరాటంలో చావడానికయినా సిద్ధమని నేను మీకు చెప్పదలచుకున్నాను’ అని రాహుల్ గాంధీ అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ మసూద్ పక్కన నిలబడి ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
మోదీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు మసూద్ గత సంవత్సరం మార్చిలో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ‘పేదలు, రైతులు, అణగారిన వర్గాలు కష్టాల్లో ఉండే భారత్‌ను మేము కోరుకోవడం లేదు. సూట్ బూట్ ప్రభుత్వాన్ని మేము కోరుకోవడం లేదు. పేదలు, కార్మికులు, అల్పాదాయ వర్గాల అభ్యున్నతికి పాటుపడే భారత్‌ను మేము కోరుకుంటున్నాము’ అని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ ఉపన్యాసం ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకొని సాగింది. ‘లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు చాలా మంది నరేంద్ర మోదీకి మద్దతు పలికారు. భారత్‌ను మార్చివేస్తానని మోదీ ప్రకటించారు. కాని, మోదీకి తాను ఇచ్చిన నినాదం ‘అచ్ఛే దిన్ ఆయేంగే’ కూడా ఇప్పుడు గుర్తు లేదు. మేము ‘అచ్ఛే దిన్’ గురించి మాట్లాడుతుంటే దేశవ్యాప్తంగా ప్రజలంతా నవ్వుతున్నారు. ఆ మంచి రోజులు ఎక్కడున్నాయి?’ అని రాహుల్ ధ్వజమెత్తారు.(చిత్రం) ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో సోమవారం నిర్వహించిన రైతు ర్యాలీలో పాల్గొన్న రాహుల్