జాతీయ వార్తలు

రాజధానిలో పొగమంచు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: ఉత్తర భారతావనిని చలి తీవ్రస్థాయిలో వణికిస్తోంది. దట్టంగా పొగమంచు కమ్మేయడంతో జేవర్ టోల్‌ప్లాజా వద్ద యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం ఉదయం దాదాపు 20 వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ సంభవించకపోయినప్పటికీ పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆదివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను పొగమంచు దట్టంగా కమ్మేయడంతో రైళ్లతో పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. దీంతో ఢిల్లీవైపు వెళ్తున్న దాదాపు 20 రైళ్లు ఆలస్యంగా నడిచినట్లు ఉత్తర రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఆదివారం ఉదయం ఢిల్లీలో 7.5 సెల్సియస్ డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మంచు కారణంగా ఉదయం 8.30 వరకు కూడా వెలుతురు రాలేదు.