జాతీయ వార్తలు

పుదుచ్చేరిలో 8,900 హెక్టార్ల వరిపంట నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుదుచ్చేరి, డిసెంబర్ 5: కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 8,955 హెక్టార్ల వరిపంట నష్టమైందని, 11,418 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ రామస్వామి చెప్పారు. పుదుచ్చేరిలో 4,420 హెక్టార్లు, కారైకల్‌లో 4,248.34 హెక్టార్లు, యానాం ప్రాంతంలో 287.15 హెక్టార్లలో వరిపంట దెబ్బతిన్నట్లు ఆయన చెప్పారు. హెక్టార్‌కు 20 వేల చొప్పున రూ.17.91 కోట్లు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిందని ఆయన చెప్పారు. 1544 హెక్టార్లలో చెరకు పంట, 8 ఎకరాలలో తమలపాటు తోటలు, వందల ఎకరాల్లో కూరగాయలు, పూలతోటలు, ఉద్యానవన పంటలు, అరటి పంట దెబ్బతిన్నదని, నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. (చిత్రం) అడయార్ నది ఉద్ధృతికి కొట్టుకుపోయన బ్రిడ్జి