జాతీయ వార్తలు

పుదుచ్చేరి సిఎం పదవికి నారాయణస్వామి ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుదుచ్చేరి: పుదుచ్చేరి ముఖ్యమంత్రి పదవికి కేంద్ర మాజీమంత్రి వి.నారాయణస్వామిని కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశంలో ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్- డిఎంకె కూటమికి మెజార్టీ లభించిన సంగతి తెలిసిందే. సిఎం పదవికి కాంగ్రెస్‌లో పోటీ ఏర్పడగా, శనివారం ఇక్కడ పార్టీ పరిశీలకులు షీలా దీక్షిత్, ముకుల్ వాస్నిక్ సమక్షంలో అధికారపక్ష ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేల అంచనాలకు భిన్నంగా నారాయణస్వామిని సిఎం పదవికి ఎంపిక చేశారు. ఆయన ఇటీవల జరిగిన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. సిఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక ఆరునెలల్లోగా ఆయన అసెంబ్లీకి ఎన్నిక కావల్సి ఉంది. దిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ వద్ద పలుకుబడి ఉన్నందునే నారాయణ స్వామిని సిఎం పదవికి ఎంపిక చేశారని విశే్లషకులు అంటున్నారు. సిఎం పదవికి పుదుచ్చేరి పిసిసి అధినేత నమశ్శివాయం, మాజీ ముఖ్యమంత్రి వైతిలింగం, మాజీ మంత్రి కందస్వామి పోటీ పడినా ఫలితం దక్కలేదు. దిల్లీలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఇదివరకే నమశ్శివాయం, నారాయణ స్వామి కలిశారు. అయితే, ఎమ్మెల్యే కానప్పటికీ నారాయణ స్వామి అభ్యర్థిత్వం పట్లే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపింది.