జాతీయ వార్తలు
బిహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఏప్రిల్ 1నుంచి అమలు చేయనున్నట్లు సిఎం నితీశ్ ప్రకటన
పాట్నా, నవంబర్ 26: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి బిహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. మద్యపాన వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఇక్కడ అధికారికంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో నితీశ్ తన ఎన్నికల హామీల్లో ఒకటైన ఈ మద్య నిషేధ ప్రకటన చేసారు. సమాజంలో నిరుపేదలే ఎక్కువగా మద్యం సేవిస్తున్నారని, ఫలితంగా వారి కుటుంబాలపై, వారి పిల్లల విద్యాభ్యాసంపై అది తీవ్ర ప్రభావం చూపిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. గృహ హింసకు, ముఖ్యంగా మహిళలపై హింసకు మద్యపానం పెరగడం కూడా ఒక ప్రధాన కారణమని, నేరాలు పెరగడానికి సైతం అది ఒక విధంగా కారణమవుతోందని ఆయన అన్నారు. ‘మద్యం సేవించడం పెరిగిన కారణంగా అందరికన్నా మహిళలే ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నారు’ అని ఆయన అన్నారు. అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష జరిపిన తర్వాత ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారి ఒకరు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్యనిషేధం విధిస్తానని గత జూలైలో నితీశ్ కుమార్ ప్రకటించారు. కాగా, రాష్ట్రంలో మద్య నిషేధాన్ని పూర్తిగా సమర్థిస్తామని రాష్ట్ర బిజెపి నేత సుశీల్ కుమార్ మోదీ సైతం హామీ ఇచ్చారు.అయితే ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశముంది. (చిత్రం) మద్యపానానికి వ్యతిరేకంగా రూపొందించిన పెయంటింగ్‌ను ముఖ్యమంత్రి నితీశ్‌కు అందజేస్తున్న చిత్రకారుడు