డైలీ సీరియల్

పూలకుండీలు -5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిండికి బట్టకే కనాకష్టంగా నడుస్తున్న వాళ్ళ కుటుంబ వ్యవహారం ‘దిన దినగండం దీర్ఘాయుష్షు’ అన్నట్టుగా తయారైంది.
అసలే కుంటిగుర్రంలా సాగుతున్న ఎల్లయ్య కుటుంబానికి మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు ఓ కొత్త ఆపద ముంచుకొచ్చింది.
పాల్వంచ బ్యాంక్ రోడ్డులో ఎప్పుడో తాతలకాలంనాటి మూడుగదుల పెంకుటింట్లో ఇప్పటిదాకా కాపురం చేస్తున్నారు ఎల్లయ్య వాళ్ళు.
ఏండ్ల తరబడి పంచాయితిగా ఉన్న పాల్వంచ ఆ తరువాత మేజర్ పంచాయితీగానూ మరికొంతకాలం తరువాత మున్సిపాలిటీగానూ పెరిగిపోయింది. ఊరు చుట్టూ చిన్నా పెద్దా పరిశ్రమలు అనేకం వచ్చి చేరాయి. ఊరితోపాటే జనాభా కూడా వందల్లో నుండి వేలలోకి పెరిగిపోయింది. ఫలితంగా వీధులన్నీ జనంతోను, వాహనాలతోనూ రద్దీగా మారిపోసాగాయి.
దాంతో..
తప్పని పరిస్థితి మున్సిపాలిటీవారు ఊళ్ళో రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని పెద్దఎత్తున మొదలుపెట్టారు.
అందులో భాగంగానే బ్యాంక్ వీధి రోడ్డును కూడా విస్తరించారు.
ఆ విస్తరణలో ఎల్లయ్య వాళ్ల ఇల్లు ఆనవాలుక్కూడా మిగలకుండా రోడ్డులో కలిసిపోయింది.
తిన్నా తినకున్నా ఇనే్నళ్ళ నుండి తమకు నీడనిచ్చిన గూడును కాస్తా రోడ్డు మింగెయ్యడంతో ఒక్కసారిగా వీధిన పడిన ఎల్లయ్య వాళ్ళు ఆ నాయకులను, ఈ నాయకులనూ పట్టుకొని ఏదో విధంగా ఊరుకి పడమర శివార్లలో కెటిపిఎస్ రైలు కట్ట పక్కన అప్పుడప్పుడే ఏర్పడుతున్న మంచికంటి నగర్‌లో అతి కష్టంమీద ఓ ఇంటి ప్లాటు సంపాదించారు.
ఆ రైలు కట్టపొడవునా పెరిగివున్న ఏవో అడవి చెట్ల వాసాలను కొట్టుకొచ్చి ఓ నిట్టాడు పాక వేసుకుని దానిలోనే కాపురం పెట్టారు ఎల్లయ్య శాంతమ్మవాళ్ళు.

3
ఎల్లయ్య వాళ్ళు మంచికంటినగర్‌కి మారిన తరువాత టౌనుకి నాలుగైదు కిలోమీటర్లు దూరమైపోవడతో రావడం, పోవడం ఇబ్బందిగా మారింది. దాంతో అన్నాళ్ళుగా శాస్ర్తీ రోడ్డులో కొనసాగిస్తున్న తన ఎలుకల మందు వ్యాపారాన్ని వదిలేశాడు ఎల్లయ్య.
మంచికంటినగర్‌కి తమలాగే చాలామంది పేదవాళ్ళు వచ్చి చేరుతుండడంతో వాళ్ళతో కలిసి కూలికి, నాలికి పోతూ సాయంత్రానికల్లా ఐదో పదో సంపాదించడం మొదలుపెట్టాడు ఎల్లయ్య.
ఇక శాంతమ్మ ఆ మంచికంటినగర్‌కి దగ్గర్లోనే వున్న గవర్నమెంట్ మైనింగ్ కాలేజీ స్ట్ఫా క్వార్టర్స్‌లోని ఓ ఐదారిండ్లల్లో పనిమనిషిగా కుదిరి తనూ నెలకింతో అంతో సంపాదించడం మొదలుపెట్టింది.
ఆ విధంగా భర్తతోపాటు తమ సంసారపు రధానికి తనూ ఓ చక్రంగా మారి ఆర్థిక గతుకుల బతుకు బాటలో ఏదో విధంగా రోజులు వెళ్ళదీయసాగింది.
‘లంక మేతకూ ఏటి ఈతకూ సరి’ అన్నట్టు చేస్తున్న కష్టానికీ ఇంటి జరుగుబాటుకూ బొటాబొటీగా సాగిపోతున్న ఎల్లయ్య, శాంతమ్మ వాళ్ళ కాపురంలో ఇందిరమ్మ ఇల్లు అనేది ఓ పెను సర్పమై సండ్రనిప్పుల విషం చిమ్మింది.
మంచికంటినగర్‌లో కుదురుకున్న రెండు మూడొందల కుటుంబాల్లో దాదాపుగా ప్రతి కుటుంబం ఏ రోజు కారోజు కూలికెళ్లి తెచ్చుకున్న డబ్బులతో పొట్టపోసుకునేదే.
అటువంటి నిరుపేదలున్న ఆ కాలనీలో ముందు ముందు వాళ్ల ఓట్ల అవసరాన్ని గుర్తించిన రాజకీయ పార్టీలవాళ్ళూ ప్రత్యక్షంగా తమ పరపతిని పెంచుకోవడానికి రోడ్లు, సైడ్‌కాలువలు, బోర్లు వీధి దీపాల వంటి సదుపాయాలు ఏర్పాటుచెయ్యసారు.
అయితే వాళ్ళా పనులన్నీ పరోక్షంగా తమ తమ ఏజెంట్లను కాంట్రాక్టర్లుగా దించి చేయించడం ద్వారా మున్సిపాలిటి సొమ్మును కమీషన్ల రూపంలో దండుకోవడానికీ పోటీలు పడసాగారు.
తమ సంపాదనకు పరాకాష్టగా ఇందిరమ్మ ఇండ్లు అనే గుదిబండలను వద్దన్నా కాలనీవాసుల మెడలకు అంటగట్టసాగారు.
నాయకులు చూపించిన అసహజ ఔదార్యానికీ, కృత్రిమ ఆత్మీయతకూ లోనైన చాలామంది కూలీ నాలీ జనం డాబా ఇండ్ల రంగుల వలలో పక్కె చేపల్లా చిక్కుకుపోయారు. దాంతో వాళ్ళంతా కాపురం ఉంటున్న గుడిసెలను కాస్త చేతులారా పీకి, వాటి స్థానాల్లో ఇందిరమ్మ ఇండ్లకు పోటీలు పడి ముగ్గులు పోసుకోసాగారు.
అప్పటిదాకా పైసా, పైసా చొప్పున కూడబెట్టుకున్న కొద్దో గొప్పో సొమ్మును బయటకు తీస్తూ లెక్క ప్రకారం పునాదులు తీసి బేస్‌మెట్లు లేపుకున్నారు.
అయితే, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కాలనీ వాసులు ఊహించింది వేరు. వాస్తవంలో జరిగింది వేరు. మండు వేసవిలో హఠాత్తుగా వచ్చిన ఫైలిన్ తుపాన్‌లా అనుకోకుండా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. దాంతో వాళ్ళు అనుకున్నట్టు అనుకున్న సమయానికి బిల్లులు రాలేదు. ఫలితంగా ఎక్కడి ఇండ్లు అక్కడే ఆగిపోయాయి. ‘నమ్మితినిరా సిద్ధా! అంటే నాశనంకారా మొద్దా!’ అన్నట్టు నాయకుల మాటలు నమ్మి చక్కగా వుంటున్న గుడిసెలు చేజేతులా పీకేసుకుని, గోతులు తీసుకున్న తమ తెలివి తక్కువతనాన్ని తామే తిట్టుకుంటూ సుడిగాలిలో చిక్కుకున్న వగడాకుల్లా విలవిల్లాడసాగారు.
‘‘ఆ బిల్లులెప్పుడన్నారానీ మొదలుపెట్టిన పాపానికి ఏదో విధంగా ఇండ్లు పూర్తిచేద్దాం’’ అనుకున్న చాలామంది బస్తీవాసులు పుట్టినదగ్గరల్లా వడ్డీలకు తెచ్చి ఇండ్లు లేపసాగారు.
ఇండ్లు లేస్తున్నకొద్దీ ఎక్కడి డబ్బులు చాలక, ఎక్కడా కొత్త అప్పులు పుట్టక అటు తిరిగి ఇటు తిరిగి ఆఖరుకి ఫైనాన్స్ కంపెనీల ముళ్ళ తొడుగుల్లో తొండల మాదిరిగా చిక్కి రోజువారీ కిస్తీలు కట్టే పద్ధతిలో అప్పులు తెచ్చి ఇండ్లమీద పెట్టసాగారు.
- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు