జాతీయ వార్తలు

5 రాష్ట్రాల్లో కౌంటింగ్‌కు సన్నాహాలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో గురువారం జరిగే కౌంటింగ్‌కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల లోపే రాజకీయ పార్టీల భవితవ్యం తేలిపోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. తమిళనాడు, కేరళలో ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు, అస్సాంలో బిజెపి అధికారంలోకి రావచ్చని, పుదుచ్చేరిలో డిఎంకె-కాంగ్రెస్ కూటమికి ఆధిక్యత లభిస్తుందని, బెంగాల్‌లో మాత్రం మమతా బెనర్జీ మళ్లీ అధికారంలోకి వస్తారని ఎగ్జిట్ పోల్స్ అంచనాలో తేలింది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.