క్రీడాభూమి

పిచ్‌పై చర్చ ఆశ్చర్యకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీమిండియా కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్య
నాగపూర్, నవంబర్ 24: మొహాలీ, బెంగళూరు నగరాల్లోని స్టేడియాల్లో పిచ్‌పై చర్చ జరగడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం నుంచి మూడో టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో మంగళవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ భారత్‌లో పిచ్‌ల తీరుపై ఈ స్థాయిలో ఎందుకు విమర్శలు చెలరేగుతున్నదో, ఎందుకు చర్చ కొనసాగుతున్నదో అర్థం కావడం లేదని అన్నాడు. మొహాలీ, బెంగళూరు పిచ్‌లపై ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. ఒకవేళ ఇరు జట్లు మ్యాచ్‌ని ఆడేందుకు నిరాకరిస్తేనే సదరు పిచ్ ఆటకు పనికిరాదని గుర్తించాల్సి ఉంటుందన్నాడు. కానీ స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై మ్యాచ్‌లు ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నాడు. తాము ఇప్పటి వరకూ పిచ్ తీరుపై వ్యాఖ్యలు చేయలేదన్న విషయాన్ని అతను గుర్తుచేశాడు. ‘మేము ఏ విధమైన చర్చలోకి వెళ్లం. ఒకవేళ ఎవరైనా పిచ్‌పై మాట్లాడితే అది వాళ్ల ఇష్టం. మాకు సంబంధించినంత వరకూ పిచ్ స్వభావాన్ని బట్టి తుది జట్టు కూర్పు ఉంటుంది. అంతకు మించి ఆలోచించాల్సిన అవసరం మాకు లేదు’ అన్నాడు.
నిర్దిష్టమైన వ్యూహాలేవీ లేవు
దక్షిణాఫ్రికాతో జరిగే మూడో టెస్టు మ్యాచ్‌కి నిర్దిష్టమైన వ్యూహాలంటూ ఏవీ లేవని కోహ్లీ స్పష్టం చేశాడు. అవసరాలను బట్టి వ్యూహాలు ఉంటాయేతప్ప ప్రణాళికలను సిద్ధం చేసుకొని మ్యాచ్‌లు ఆడడం సాధ్యం కాదని వ్యాఖ్యానించాడు. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా మొహాలీలో జరిగిన మొదటి టెస్టును భారత్ 108 పరుగుల తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. బెంగళూరులో జరగాల్సిన రెండో టెస్టు మ్యాచ్‌ని వర్షం వెంటాడడంతో డ్రాగా ముగిసింది. మొదటి రోజు ఆట మాత్రమే సాధ్యంకాగా, మిగతా నాలుగు రోజుల ఆట వర్షం కారణంగా రద్దయింది. భారత్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించి, మరో విజయాన్ని సాధించడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది. కాగా, భారత్‌ను టి-20, వనే్డ సిరీస్‌లలో ఓడించిన దక్షిణాఫ్రికా కూడా టెస్టు సిరీస్‌ను కోల్పోరాదన్న పట్టుదలను ప్రదర్శిస్తున్నది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న తమపై టీమిండియా సిరీస్‌ను గెల్చుకుంటే సిగ్గుచేటన్న అభిప్రాయంతో ఉంది. ఇరు జట్లు స్పష్టమైన లక్ష్యాలతో సిద్ధమవుతున్న తరుణంలో మూడో టెస్టు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇలావుంటే, మైదానంలో దూకుడుగా వ్యవహరిస్తూ, సత్వర నిర్ణయాలు తీసుకుంటూ కోహ్లీ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. అయితే, మొదటి టెస్టులో పకడ్బందిగా బంతులు వేయడమేగాక, విధ్యంసకర బ్యాట్స్‌మన్ ఎబి డివిలియర్స్‌ను రెండో ఇన్నింగ్స్‌లోనూ అవుట్ చేసిన అమిత్ మిశ్రాను రెండో టెస్టుకు ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతని స్థానంలో స్టువర్ట్ బిన్నీకి అతను అవకాశం ఇచ్చాడు. మీడియం పేసర్‌గా సేవలు అందించే సామర్థ్యంగల బిన్నీ ఇప్పుడు జట్టులో ఆల్‌రౌండర్ హోదాలో ఉన్నాడు. మిశ్రాను తప్పించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని కోహ్లీ ఇంటర్వ్యూ సమయంలో పరోక్షంగా ప్రస్తావించాడు. సమర్థుడైన ఆల్‌రౌండర్ అవసరం ఉందన్నాడు. అవసరాన్ని బట్టి ఆటగాళ్ల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశాడు. ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలి లేదా జట్టులో ఐదుగురు స్పెషలిస్టు బౌలర్లు ఉండాలి అన్న నిబంధనలు ఏవీ లేవని కోహ్లీ తేల్చిచెప్పాడు. బ్యాటింగ్‌లోగానీ, బౌలింగ్‌లోగానీ ఎవరి స్థానాలు ఖాయం కాదని అన్నాడు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటామన్నాడు. మూడో టెస్టుకు బిన్నీ స్థానంలో అమిత్ మిశ్రా రాకూడదన్న నిబంధన ఏదీ లేదని వ్యాఖ్యానించాడు. నిర్దిష్టమైన వ్యూహాలు, నిర్ణయాలతో మ్యాచ్‌లు ఆడడం సాధ్యం కాదన్నాడు. విజయమే లక్ష్యంగా మూడో టెస్టులో బరిలోకి దిగుతామని చెప్పాడు. దక్షిణాఫ్రికా వంటి మేటి జట్టును ఓడించడం సులభం కాదని అన్నాడు.