క్రీడాభూమి

బిసిసిఐపైనే ఒత్తిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిసిబి మాజీ చైర్మన్ నజాం సేథీ స్పష్టీకరణ
కరాచీ, నవంబర్ 21: పాకిస్తాన్‌తో 2015-2023 మధ్యకాలంలో అమల్లో ఉండే ఒప్పందంపై సంతకం చేసిన బిసిసిఐపై దానిని తప్పక అమలు చేయాలన్న ఒత్తిడి పెరిగిందని పిసిబి మాజీ చైర్మన్ నజాం సేథీ స్పష్టం చేశాడు. పాకిస్తాన్‌కు కామనె్వల్త్ జట్టును పంపే విషయంపై చర్చించేందుకు బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌తో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) చైర్మన్ గిలెస్ క్లార్క్ సమావేశమవుతాడని పిసిబి ఎగ్జిక్యూటివ్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న సేథీ అన్నాడు. ఐసిసి తరఫున పాకిస్తాన్‌లో సిరీస్‌లపై ఏర్పడిన బృందానికి గిలెస్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న విషయాన్ని అతను ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గుర్తుచేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఎక్కువగా మాట్లాడలేనని, అయితే, పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లపై కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న బిసిసిఐ తీవ్రమైన ఒత్తిడికి గురువుతున్నది అన్నాడు. ఒక ప్రశ్నపై స్పందిస్తూ, యుఎఇలోనే పాక్‌తో సిరీస్‌లు ఆడేందుకు బిసిసిఐ అంగీకరించిందని చెప్పాడు. ఇప్పుడు భారత్‌లోనే సిరీస్ ఆడాలని ప్రతిపాదించడంలో అర్థం లేదని అన్నాడు. డిసెంబర్‌లో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌కు యుఎఇనే వేదిక అవుతుందని, తమ జట్టు భారత్‌కు వెళ్లే ప్రసక్తి లేదని సేథీ తేల్చిచెప్పాడు. వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించవద్దని బిసిసిఐ అధికారులకు హితవు పలికాడు. పాక్‌లో మ్యాచ్‌లు ఆడవద్దని ఐసిసి ఎన్నడూ చెప్పలేదని అన్నాడు.