క్రీడాభూమి

ఐబిఎల్ కాదు.. పిబిఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబిఎల్) పేరు మారింది. ఈ టోర్నీని ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)గా మారుస్తున్నట్టు భారత బడ్మింటన్ సమాఖ్య (బాయ్) అధ్యక్షుడు డాక్టర్ అఖిలేష్ దాస్ గుప్తా గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాడు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 17వ తేదీ వరకూ పిబిఎల్ జరుగుతుందని పేర్కొన్నాడు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జిస్తున్న ఈ టోర్నీ ప్రపంచంలోనే మేటి బాడ్మింటన్ టోర్నీగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2013లో ఐబిఎల్ తొలి టోర్నీ జరిగింది. అయితే, తర్వాత రెండేళ్లు సరైన స్పాన్సర్లు లభించక ఈ టోర్నీ జరగలేదు. ఇప్పుడు స్పోర్ట్‌లైవ్ నుంచి స్పాన్సర్‌షిప్ అందడంతో వచ్చే నెలలో టోర్నీని నిర్వహించాలని బాయ్ నిర్ణయించింది.