జాతీయ వార్తలు

ఇక జరిగేవి సైబర్ యుద్ధాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయినా సాంప్రదాయ
సైనికులను తొలగించం
రక్షణ మంత్రి పారిక్కర్
న్యూఢిల్లీ, నవంబర్ 23: భవిష్యత్తులో యుద్ధాలు సైబర్‌స్పేస్‌లోనే జరగవచ్చని, కనుక సైబర్ దాడుల నుంచి దేశాన్ని రక్షించేందుకు సాయుధ బలగాల సామర్థ్యం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ ఉద్ఘాటించారు. ప్రస్తుతం పలు దేశాల్లో విధ్వంసాన్ని సృష్టిస్తున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ తమ బలాన్ని మరింత పెంపొందించుకునేందుకు కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ఇంటర్నెట్‌ను విరివిగా ఉపయోగించుకుంటున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సోమవారం న్యూఢిల్లీలో సైనిక దళానికి చెందిన సిగ్నల్ కార్ప్స్, భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) సంయుక్తంగా నిర్వహించిన ‘డిఫ్‌కామ్’ సదస్సులో పారిక్కర్ ప్రసంగిస్తూ, ప్రాపంచిక వ్యవహారాల్లో భారత్ ప్రధాన పాత్ర పోషించాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకుని సైనిక రంగంలో మన దేశం మరింత బలోపేతం కావలసిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో యుద్ధాలు ఎక్కువగా సైబర్‌స్పేస్‌లోనే జరగవచ్చని, కనుక దేశ సైనిక వ్యవస్థకు పదను పెట్టడంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానమే (ఐటి) ముఖ్యభూమిక పోషిస్తుందని పారిక్కర్ అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ సాంప్రదాయ సైనిక బలగాలను తొలగించే ప్రసక్తే లేదని, అందుబాటులోకి వచ్చిన ఆధునిక సామగ్రిని అంతిమంగా సాంప్రదాయ సైనికులకే అందజేసి వారి సామర్థ్యాన్ని, పోరాట పటిమను మరింత మెరుగుపర్చడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని, ఐసిస్ లేదా దాయిష్ లాంటి ఉగ్రవాద సంస్థలనే ఇందుకు ఆదర్శంగా తీసుకోవచ్చన్నారు.