క్రీడాభూమి

బౌలర్లకు పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండో రోజు కూలిన 20 వికెట్లు *భారత్, దక్షిణాఫ్రికా మూడో టెస్టు

నాగపూర్, నవంబర్ 26: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొహాలీ జరిగిన మొదటి టెస్టు మాదిరిగానే ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టు కూడా మూడు రోజుల్లోనే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి రోజు 12 వికెట్లు కూలితే, రెండో రోజు ఆటలో ఏకంగా 20 వికెట్లు పతనమయ్యయి. బ్యాట్స్‌మెన్ పరీక్ష పెడుతున్న పిచ్ మారకపోతే, మ్యాచ్ మూడోరోజు, శుక్రవారమే ఫలితం వెల్లడికాక తప్పదు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి రోజు తన మొదటి ఇన్నింగ్స్‌లో 215 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. ఆతర్వాత తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. ఈ ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజు, గురువారం ఆటను కొనసాగిందింది. ఓవర్‌నైట్ స్కోరుకు ఒక్క పరుగు కూడా జోడించకుండానే డీన్ ఎల్గార్ అవుటయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన అతను 7 పరుగులు చేశాడు. కెప్టెన్ హహీం ఆమ్లా 10 బంతులు ఎదుర్కొని, ఒక పరుగు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఆజింక్య రహానేకి చిక్కాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఎబి డివిలియర్స్, పఫ్ డుప్లెసిస్ జట్టును ఆదుకుంటారని అనుకున్న అభిమానులకు నిరాశ తప్పలేదు. పరుగుల ఖాతాను తెరవని డివిలియర్స్‌ను జడేజా రిటర్న్ క్యాచ్ పట్టుకొని పెవిలియన్‌కు పంపాడు. 10 పరుగులుచేసిన డుప్లెసిస్‌ను అతను బౌల్డ్ చేశాడు. జెపి డుమినీ జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, అతనికి సహచరుల నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. వికెట్‌కీపర్ విలాస్ (1), సిమోన్ హార్మర్ (13) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. డుమినీ 65 బంతులు ఎద్కుని, ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 35 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనిని అమిత్ మిశ్రా ఎల్‌బిగా వెనక్కు పంపడంతో దక్షిణాఫ్రికా పోరాటానికి దాదాపు తెరపడింది. మోర్న్ మోర్కెల్ ఒక పరుగు చేసి అశ్విన్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దక్షిణాఫ్రికా 33.1 ఓవర్లలో 79 పరుగులకు ఆలౌటయ్యే సమయానికి కాగిసో రబద ఒక పరుగుతో నాటౌట్‌గా ఉన్నాడు.
భారత్‌దీ అదే దారి
తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా వెళ్లిన దారినే అనుసరించింది. ఎనిమిది పరుగుల వద్ద మోర్న్ మోర్కెల్ బౌలింగ్‌లో షహీం ఆమ్లా క్యాచ్ పట్టగా మురళీ విజయ్ (5) పెవిలియన్ చేరడంతో టీమిండియా వికెట్ల పతనం ఆరంభమైంది. శిఖర్ ధావన్ (39), చటేశ్వర్ పుజారా (31), మిడిల్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ (23) కొంత సేపు దక్షిణాఫ్రికా బౌలింగ్‌కు తగిన సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించినా, సహచరుల వైఫల్యంతో వారి శ్రమ వృథా అయింది. 46.3 ఓవర్లలో 173 పరుగులకే టీమిండియా రెండో ఇన్నింగ్స్ కూలింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం లభించడంతో దక్షిణాఫ్రికా ముందు 310 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 38 పరుగులకు ఐదు వికెట్లు కూల్చగా, మోర్న్ మోర్కెల్‌కు మూడు వికెట్లు లభించాయి.
దక్షిణాఫ్రికా తడబాటు
భారత్ నిర్దేశించిన 310 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన దక్షిణాఫ్రికా మొదట్లోనే తడబడింది. వాన్ జిల్ కేవలం 5 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మొదటి ఇన్నింగ్స్ మాదిరిగానే రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇమ్రాన్ తాహిర్‌ను దక్షిణాఫ్రికా కెప్టెన్ షహీం ఆమ్లా నైట్ వాచ్‌మన్‌గా పంపాడు. కానీ, అతను 8 పరుగులు చేసి అమిత్ మిశ్రా బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుటయ్యాడు. మ్యాచ్ రెండో రోజు, గురువారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 14 ఓవర్లలో 2 వికెట్లకు 32 పరుగులు చేసింది. రెండు రోజుల ఆటలోనే 32 వికెట్లు కూలాయి. దీనిని బట్టి చూస్తే, చేతిలో ఉన్న ఎనిమిది వికెట్లతో దక్షిణాఫ్రికా ఇంకా చేయాల్సిన 278 పరుగులు చేసే అవకాశంగానీ, మూడు రోజుల పాటు బ్యాటింగ్‌ను కొనసాగించి మ్యాచ్‌ని డ్రా చేసుకోవడంగానీ సాధ్యంగా కనిపించడం లేదు. నాలుగు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా మూడో టెస్టును కూడా తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లను స్పిన్నర్లకే సమర్పించుకోవడం విశేషం. అశ్విన్ ఐదు, జడేజా నాలుగు వికెట్లు పడగొట్టారు. అమిత్ మిశ్రాకు ఒక వికెట్ లభించింది. అదే విధంగా భారత్ రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. అతను 38 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 78.2 ఓవర్లలో 215 ఆలౌట్ (మురళీ విజయ్ 40, చటేశ్వర్ పుజారా 21, విరాట్ కోహ్లీ 22, వృద్ధిమాన్ సాహా 32, రవీంద్ర జడేజా 34, మోర్కెల్ 3/35, సిమోన్ హార్మర్ 4/78).
దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ (ఓవర్ నైట్ స్కోరు 2 వికెట్లకు 11): డీన్ ఎల్గార్ బి అశ్విన్ 7, వాన్ జిల్ సి రహానే బి అశ్విన్ 0, ఇమ్రాన్ తాహిర్ బి జడేజా 4, హషీం ఆమ్లా సి రహానే బి అశ్విన్ 1, ఎబి డివిలియర్స్ సి అండ్ బి జడేజా 0, ఫఫ్ డు ప్లెసిస్ బి జడేజా 10, జెపి డుమినీ ఎల్‌బి అమిత్ మిశ్రా 35, విలాస్ బిజేజా 1, హార్మర్ బి అశ్విన్ 13, కాగిసో రబద నాటౌట్ 6, మోర్న్ మోర్కెల్ సి అండ్ బి అశ్విన్ 1, ఎక్‌స్ట్రాలు 1, మొత్తం (33.1 ఓవర్లలో ఆలౌట్) 79.
వికెట్ల పతనం: 1-4, 2-9, 3-11, 4-12, 5-12, 6-35, 7-47, 8-66, 9-76, 10-79.
బౌలింగ్: ఇశాంత్ శర్మ 2-1-4-0, రవిచంద్రన్ అశ్విన్ 16.1-6-32-5, రవీంద్ర జడేజా 12-3-33-4, అమిత్ మిశ్రా 3-0-9-1.
భారత్ రెండో ఇన్నింగ్స్: మురళీ విజయ్ సి ఆమ్లా బి మోర్న్ మోర్కెల్ 5, శిఖర్ ధావన్ సి విలాస్ బి ఇమ్రాన్ తాహిర్ 39, చటేశ్వర్ పుజారా బి డుమినీ 31, విరాట్ కోహ్లీ సి డుప్లెసిస్ బి ఇమ్రాన్ తాహిర్ 16, ఆజింక్య రహానే సి డుమినీ బి ఇమ్రాన్ తాహిర్ 9, రోహిత్ శర్మ సి ఎల్గార్ బి మోర్న్ మోర్కెల్ 23, వృద్ధిమాన్ సాహా సి ఆమ్లా బి ఇమ్రాన్ తాహిర్ 7, రవీంద్ర జడేజా బి హార్మర్ 5, అశ్విన్ ఎల్‌బి మోర్న్ మోర్కెల్ 7, అమిత్ మిశ్రా బి ఇమ్రాన్ తాహిర్ 14, ఇశాంత్ శర్మ 1, ఎక్‌స్ట్రాలు 16, మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్) 173.
వికెట్ల పతనం: 1-8, 2-52, 3-97, 4-102, 5-108, 6-122, 7-128, 8-150, 9-171, 10-173.
బౌలింగ్: మోర్న్ మోర్కెల్ 10-5-19-3, సిమోన్ హార్మర్ 18-3-64-1, కాగిసో రబద 5-1-15-0, డుమినీ 2-0-24-1, ఇమ్రాన్ తాహిర్ 11.3-2-38-5.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: డీన్ ఎల్గార్ నాటౌట్ 10, వాన్ జిల్ సి రోహిత్ శర్మ బి అశ్విన్ 5, ఇమ్రాన్ తాహిర్ ఎల్‌బి అమిత్ మిశ్రా 8, హషీం ఆమ్లా నాటౌట్ 3, ఎక్‌స్ట్రాలు 6, మొత్తం (14 ఓవర్లలో 2 వికెట్లకు) 32.
వికెట్ల పతనం: 1-17, 2-29.
బౌలింగ్: ఇశాంత్ శర్మ 3-1-6-0, అశ్విన్ 6-2-12-1, జడేజా 4-2-6-0, అమిత్ మిశ్రా 1-0-3-1.