జాతీయ వార్తలు

గూఢచార ముఠా కేసులో మరొకరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్)కు సంబంధించిన గూఢచార ముఠాతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు జమ్మూ-కాశ్మీరుకు చెందిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. నిందితుడిని రాజౌరీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సబర్‌గా గుర్తించారు. శనివారం ఉదయం అతడిని అరెస్టుచేసి అధికార రహస్యాల చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేశామని జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) రవీంద్ర యాదవ్ తెలిపారు. ఐఎస్‌ఐ కార్యకర్తగా అనుమానిస్తున్న ఖఫైతుల్లా ఖాన్ సారథ్యంలో పనిచేస్తున్న గూఢచార ముఠాకు సంబంధించిన కేసులో ఇది నాలుగో అరెస్టు. ఈ కేసులో తొలుత ఖఫైతుల్లా ఖాన్‌ను గత నెల 26వ తేదీన అరెస్టు చేశారు. ఖఫైతుల్లా ఖాన్ తమ ముఠాలో మరింత మంది గూఢచారులను నియమించుకునేందుకు ఢిల్లీ నుంచి భోపాల్‌లో మతపరమైన సమావేశానికి వెళ్తుండగా ఈ అరెస్టు జరిగింది. ఆ తర్వాత ఈ కేసులో బిఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)లో పనిచేస్తున్న అబ్దుల్ రషీద్ అనే వ్యక్తితో పాటు మునావర్ అహ్మద్ మీర్ అనే సైనిదళ మాజీ హవల్దార్‌ను అరెస్టు చేశారు. సబర్ ద్వారానే రషీద్, మీర్, అతని అనుచరులను ఖఫైతుల్లా ఖాన్ కలుసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇదిలావుంటే, కార్గిల్ యుద్ధ సమయంలోనే ఐఎస్‌ఐ గూఢచారిగా పనిచేసిన మీర్ ప్రస్తుతం జమ్మూ-కాశ్మీరులో పిడిపి కార్యక్తగా పనిచేస్తున్నట్లు ఇంటరాగేషన్‌లో తేలిందని ఈ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న అధికారి ఒకరు తెలిపారు.