క్రీడాభూమి

పాక్ జట్టు రాక నేడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్షణానికో వార్త.. స్పష్టతలేని ప్రకటనలు

న్యూఢిల్లీ, మార్చి 10: పాకిస్తాన్ క్రికెట్ జట్టు టి-20 వరల్డ్ కప్‌లో పాల్గొనడానికి వస్తుందా? రాదా? ఈ విషయంపై స్పష్టతలేని ప్రకటనలు గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ జట్టు శుక్రవారం బయలుదేరి వస్తుంది. కాగా, ఈ విషయంలో క్షణానికో వార్త వినిపిస్తున్న నేపథ్యంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. నెలకొంది. అటు పాక్ నుంచిగానీ, ఇటు భారత్ నుంచిగానీ అధికారికంగా ప్రకటన వెలువడలేదు. భద్రత విషయంలో లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సిందిగా భారత సర్కారును కోరామని, కానీ, ఇప్పటి వరకూ తమకు ఎలాంటి సమాచారం అందలేదని పాకిస్తాన్ ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపాడు. ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌ని భద్రతా కారణాల దృష్ట్యా కోల్‌కతాకు మార్చినా తాము అభ్యంతరం తెలపలేదని, అయితే, లిఖితపూర్వక హామీ కోసం తాము ఎదురుచూస్తున్నామని ఇస్లామాబాద్‌లో విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. క్రికెటర్లు లాహోర్‌లో విడిది చేశారని, ప్రభుత్వం నుంచి ఎప్పుడు అనుమతి లభిస్తే అప్పుడు భారత్‌కు బయలుదేరతారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్ షహర్యార్ ఖాన్ ప్రకటించాడు. గురువారం మొత్తం అతను సహచరులతో చర్చిస్తూ గడిపాడు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు అనుమతి లభించినా, క్షణాల్లో ఆటగాళ్లను విమానం ఎక్కించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కాగా, భారత్ స్పందన మరోలా ఉంది. దేశంలో జరిగే ఏ క్రీడా ఈవెంట్‌కైనా భద్రత కల్పించే బాధ్యత తమదేనని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని భారత విదేశాంగ మంత్రిత్వ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ లిఖితపూర్వక హామీని కోరిన విషయాన్ని ప్రస్తావించకుండా, దేశంలో జరిగే క్రీడా ఈవెంట్స్‌కు తీసుకునే చర్యలను అతను వివరించాడు. ఇటీవల జరిగిన దక్షిణ ఆసియా క్రీడల సందర్భంగా భద్రతాపరమైన అనుమానాలుగానీ, సమస్యలుగానీ తలెత్తలేదని గుర్తుచేశాడు. పాకిస్తాన్ క్రికెటర్లకు సంపూర్ణ భద్రత ఉంటుందని, దేశంలో క్రీడా పోటీల్లో పాల్గొనే వారందరికీ అదే రీతిలో ఏర్పాట్లు చేస్తామని స్వరూప్ అన్నాడు. పాకిస్తాన్‌కు లిఖితపూర్వకంగా హామీ ఇస్తారా లేదా అన్నది మాత్రం అతను చెప్పలేదు.
ఇలావుంటే, పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో క్రీడాకారులంతా భారత్‌కు బయలుదేరేందుకు సిద్ధమయ్యారని తొలుత వార్తలు వచ్చాయి. లాహోర్‌లో విమానం ఎక్కడమే తరువాయని టి-20 వరల్డ్ కప్ టోర్నీ వర్గాలు పేర్కొన్నాయి. కానీ, లిఖితపూర్వక హామీని ప్రస్తావిస్తూ పాకిస్తాన్ ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి నిసార్ అలీ ఖాన్ వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. భారత్ నుంచి ఈవిషయంలో స్పష్టత రాలేదు. కాగా, భారత్‌లో మ్యాచ్‌లు ఆడకపోతే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం పిసిబికి తెలుసు. అందుకే, ప్రభుత్వాన్ని ఒప్పించి, క్రికెటర్లను భారత్‌కు పంపేందుకు ప్రయత్నం చేస్తున్నది. పాక్ సర్కారు కూడా సుముఖంగానే ఉన్నప్పటికీ, చివరి వరకూ బెట్టుచేసి, ఆతర్వాత అభిమానుల కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నామని ప్రకటించి, జట్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. శుక్రవారం ఉదయం పాక్ జట్టు లాహోర్ నుంచి బయలుదేరవచ్చని అంటున్నారు. మొత్తం మీద పాక్ జట్టు భారత్‌కు రావడం ఖాయంగా కనిపిస్తు న్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్కంఠ కొన సాగుతున్నది. జట్టును భారత్‌కు పంపడం మి నహా పాకిస్తాన్‌కు మరో దారి లేదన్నది తిరుగు లేని వాస్తవం. (చిత్రం) సహచరులతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ చర్చలు