జాతీయ వార్తలు

పఠాన్‌కోట్ దాడిపై సంయుక్త దర్యాప్తు: నవాజ్ షరీఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్ : పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై ఉన్నత స్థాయి సంయుక్త దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించారు. పఠాన్‌కోట్ ఉగ్రదాడితో పాకిస్థాన్‌కు లింకు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వైమానిక స్థావరంపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు పాక్ నుంచే చొరబడ్డారని భారత్ ఆధారాలు ఇవ్వడంతో ఆ దేశ ప్రధాని సంయుక్త దర్యాప్తు బృందం ఏర్పాటుకు అంగీకరించారు. ఇందులో ఇంటలిజెన్స్ బ్యూరో, ఐఎస్ఐ, మిలటరీ ఇంటలిజెన్స్, ఫెడరల్ ఇంటలిజెన్స్ ఏజన్సీ, పోలీసులు సభ్యులుగా ఉన్నారు.