అంతర్జాతీయం

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: తాను నోబెల్ శాంతి బహుమతి పొందటానికి అర్హుడను కాను అని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు. ఆయన ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందిస్తూ తాను జెనీవా ఒప్పందానికి అనుగుణంగా శాంతి చర్యలలో భాగంగా భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేసినట్లు తెలిపారు. భారత వింగ్ కమాండర్ అభినందన్ ను విడుదల చేసిన అనంతరం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆ దేశ చట్టసభ పాకిస్థాన్ పార్లమెంటు ఏకగ్రీవంగా తీర్మానించిన నేపథ్యంలో తాను నోబెల్ శాంతి బహుమతి పొందేందుకు అర్హుడిని కాదని ఇమ్రాన్ ప్రకటించారు. కశ్మీరీ ప్రజల ఆకాంక్షల ప్రకారం వివాదాన్ని పరిష్కరించి ఉపఖండంలో శాంతి నెలకొల్పినపుడే మానవాభివృద్ధికి దారితీస్తుందని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు.