జాతీయ వార్తలు

పిల్లల్ని చూసి నేర్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: ఆపదలో ఉన్న తోటివారి ఆదుకోవాలన్న మానవీయ విలువల్ని చిరు ప్రాయంలోనే కనబరిచిన చిన్నారులను చూసి సమాజం మరింత స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తెలంగాణకు చెందిన రుచితకు ప్రతిష్టాత్మక గీతాచోప్రా అవార్డు సహా 25మందికి సాహస అవార్డులను ప్రదానం చేసిన సందర్భంగా మోదీ మాట్లాడారు. తోటి మనిషితో బంధాన్ని, అనుబంధాన్ని ఎలా పెంపొందించుకోవాలో ఈ చిన్నారి బాలలు తమ నిరుపమాన సాహసాల ద్వారా చాటి చెప్పారన్నారు. అవార్డు విజేతలు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపిన ప్రధాని ‘ఈ పిల్లలు కనబరిచిన సాహస, శౌర్య కృత్యాల్లో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో సమయస్ఫూర్తి, తెగువ, నిస్వార్థ చింతన ప్రస్ఫుటమవుతోంది’ అని పేర్కొన్నారు. సాహస అవార్డుతోనే అంతా అయిపోయినట్టు కాదని ఈ పిల్లలు సమాజానికి మరింతగా ఉపయోగపడేలా తమనుతాము మరింతగా తీర్చిదిద్దుకోవాలని మోదీ స్పష్టం చేశారు. ఎదుటివారి అవస్థలను చూసి స్పందించే గుణం లేకపోతే.. మానవ బంధం బలపడదని... ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకెళ్లే తెగింపూ రాదని అన్నారు.