AADIVAVRAM - Others

ఉపకోశలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యకామ జాబాలి శిష్యుడు ఉపకోశలుడు. ఎందరో శిష్యులు సత్యకామ జాబాలి ఆశ్రమంలో వుండేవాళ్లు. ఉపకోశలుడు ప్రత్యేకమైనవాడు. తన దగ్గర చేరిన శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పించి సత్యకామ జాబాలి వాళ్లని వాళ్ల ఇంటికి పంపేసేవాడు. సంవత్సరం ఉండి కొంతమంది, రెండేళ్లు ఉండి మరి కొంతమంది, మూడేళ్లు ఉండి కొంతమంది విద్య ముగించుకుని వెళ్లేవాళ్లు.
ఉపకోశలుడు సత్యకామ జాబాలి ఆశ్రమంలో చేరి పనె్నండు సంవత్సరాలు గడిచాయి. కానీ శిష్యుణ్ణి గురువు ‘నీ విద్యాభ్యాసం పూర్తయింది. ఇక నువ్వు వెళ్లవచ్చు’ అని ఏనాడూ చెప్పలేదు. ‘బహుశా గురు సేవలో నేను అనుచితంగా ప్రవర్తించానేమో’ అని శిష్యుడు మధనపడ్డాడు. ఒకరోజు జాబాలి భార్య ‘ఏమండీ పాపం ఉపకోశలుడు ఎంతో భక్తిశ్రద్ధలతో మిమ్మల్ని సేవిస్తున్నాడు కదా! అతన్ని మీరు ఎందుకు అతని ఇంటికి పంపరు?’ అంది. ‘దానికి సమయముంది’ అన్నాడు జాబిలి.
ఒకరోజు జాబాలి పని మీద ఎక్కడికో వెళ్లాడు. ఉపకోశలుడు భోజనం చెయ్యకుండా దిగులుగా కూర్చున్నాడు. జాబాలి భార్య ‘నాయనా! భోం చేయి’ అంది.
ఉపకోశలుడు ‘అమ్మా! నా హృదయం ఇంకా పవిత్రం కాలేదు. స్వచ్ఛం కాలేదు. అందుకే గురుదేవులు నన్ను పరీక్షిస్తున్నారు. నా హృదయం పవిత్రమయ్యే దాకా నేను అన్నం ముట్టను’ అన్నాడు.
ఆశ్రమంలో నిరంతరం హోమకుండంలో అగ్నులు జ్వలిస్తూ ఉంటాయి. ఆ అగ్నులు ‘ఇతను శ్రద్ధతో మనల్ని జ్వలింపజేస్తూ పనె్నండేళ్ల నుంచి మనకు సేవ చేస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్లి అతన్ని ఆదుకుందాం’ అని అగ్నులు అన్నీ కలిపి అతని దగ్గరకొచ్చాయి.
‘ఉపకోశలా! ప్రాణమే బ్రహ్మం, ఆనందమే బ్రహ్మం, ఆకాశమే బ్రహ్మం అని తెలుసుకో’ అన్నాయి.
ఉపకోశలుడు ‘ప్రాణం బ్రహ్మమని తెలుసు కానీ ఆనందం, ఆకాశం బ్రహ్మ తత్వాలని తెలీదు’ అన్నాడు.
అగ్నులు హృదయాల్ని గురించి వివరించాయి. ‘హృదయ పద్మంలోనే బ్రహ్మ తత్వముంటుంది. ఆ తత్వం యొక్క అసలు రూపమే ఆనందం’ అని వివరించాయి. ఉపకోశలుడు సంతోషించడు.
ఒక అగ్ని ‘్భమి, సూర్యుడు, చంద్రుడు ఆ బ్రహ్మతత్వంలో భాగమే. మాలో జ్వాల, సూర్యునిలోని జ్వాల ఒక్కటే. నక్షత్రాల్లో, నీటిలో, అనంత దిక్కుల్లో విస్తరించిన బ్రహ్మతత్వం, అందరిలో ఉన్న తత్వం ఒక్కటే. మెరుపులో, వర్షంలో గాలిలో వున్నది బ్రహ్మతత్వమే. ఈ సత్యాన్ని గ్రహిచి నిశ్చింతగా ఉండు. ఈ అనుభవంతో బాధలన్నిట్నీ భస్మం చేసుకో. దుఃఖాలన్నింట్నీ దూరం చేసుకుని సంతోషంగా ఉండు మరి’ అన్నాయి.
దాంతో ఉపకోశలుడి అంతరంగం ఉల్లాస తరంగితమైంది. అంతవరకు ఉన్న అడ్డంకులు, సందేహాలు తొలగిపోయి ఏదో దైవాంశ తనను స్పర్శిస్తున్నట్లు పరవశించాడు. అప్పుడు అగ్నులన్నీ ‘ఉపకోశలా! మా వల్ల నువ్వు కొంత సత్యాన్ని గ్రహించావు. మరి కొంత మీ గురువు నీకు బోధిస్తారు’ అని నిష్క్రమించాయి.
కొన్నాళ్లకు సత్యకామ జాబాలి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఉపకోశలుని వదనం దేదీప్యమానంగా వెలగడం చూసి అతనిలో కలిగిన పరివర్తనకు సంతోషించాడు.
‘నీ ముఖం బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతుంది. ఏవో సత్యపు ఛాయల్ని నువ్వు గ్రహించావు. ఎవరు నీకు బోధించారు?’ అని అడిగాడు.
ఉపకోశలుడు జరిగిన విషయం వివరించాడు.
సత్యకాముడు సంతోషించి ‘నువ్వు నేర్చుకున్నది, నేను నేర్పాలనుకున్నది అదే. అగ్నులు నీకు సత్య రహస్యాన్ని వివరించాయి. నువ్వు ధన్యుడవు. ఈ జ్ఞానాన్ని గ్రహించి తామరాకు మీది నీటిబొట్టులాగా జీవించు. ఎట్లాంటి రాగద్వేషాలకూ లోనుకాకు. నీకు తెలిసిన ఈ సత్యాన్ని పది మందికీ పంచు. నీ విద్య సమాప్తమైంది. ఇక నీవు నీ ఇంటికి వెళ్లవచ్చు’ అని ఉపకోశలుడిని ఇంటికి పంపేశాడు.

- సౌభాగ్య, 9848157909