AADIVAVRAM - Others

సంగీత మేరు శిఖరం ( అమృతవర్షిణి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ కారణం లేకుండా ఈ భూమీద ఎవరి పేరూ శాశ్వతంగా నిలిచిపోదు. పువ్వు పుట్టగానే పరిమళించడం సహజం. భగవంతుడు కొందరికి కొన్ని విభూతులను ప్రసాదించి, వాళ్లల్లో ‘తనను’ చూసుకోమంటాడు.
డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఈ కోవకు చెందిన గాయకుడు. కిందటి శతాబ్దపు అయిదో దశకు తెలుగుదేశానికి మరపురాని దశకు కారణం అప్పటి ఆకాశవాణి సంగీత వైభవం.
ముఖ్యంగా ‘్భక్తిరంజని’. నిజానికి ఆ కార్యక్రమాన్ని ‘్భక్తిరజని’ అనాలని చాలామంది అనేవారు. కారణం, ఆ వైభవానికి మూల పురుషులు బాలాంత్రపు రజనీకాంతరావు గారు కావడం.
తూము నరసింహదాసు, ప్రయాగ రంగదాసు (బాలమురళీకృష్ణకు మేనమామ), నరసదాసు, నారాయణ తీర్థులు, రామదాసు, అధ్యాత్మ రామాయణ కీర్తనలు, ఇవన్నీ మధురమైన జ్ఞాపకాలు.
బాలమురళీకృష్ణ, వోలేటి వెంకటేశ్వర్లు, ఎం.వి.రమణమూర్తి, సూర్యారావు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, వి.బి.కనకదుర్గ, పాకాల సావిత్రీదేవి - వీరంతా పాడిన పాటలతో మృష్టాన్న భోజనం చేసినంత తృప్తిగా ఉండేది, ఆ రోజుల్లో.
మూడు శతాబ్దాలు తిరుమల శ్రీవారి ఆలయ భాండాగారంలో అజ్ఞాతంగా మిగిలిపోయిన అన్నమయ్య కీర్తనల వైభవాన్ని వేటూరి ప్రభాకరశాస్ర్తీ గారు ప్రారంభించగా, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు కొనసాగించారు.
‘ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది’ అనే అన్నమయ్య పాటతో విజయవాడ రేడియో ద్వారా పది మందికీ ఈ తాళ్లపాక కవిని గురించి తెలిసింది. ఆ పాట పాడినది బాలమురళీయే. అప్పటికి టీవీలు లేవు - ప్రతిరోజూ సుప్రభాత వేళలో వినిపించే ‘రేడియో భక్తిరంజని’ కార్యక్రమమే మేలుకొలుపు, పాడేది - ఇలా మాట్లాడితే జనం ఒప్పుకుంటారా, ఇలా పాడితే జనం మెచ్చుకుంటారా?’ అని ఒకటికి రెండుమార్లు ఆలోచించేవారు ఆ రోజుల్లో అధికారులైనా, ఆర్టిస్టులైనా.
1959-63 మధ్య రేడియో ఉజ్జ్వలంగా వెలిగే రోజుల్లో బాలమురళీకృష్ణ, బందా కనకలింగేశ్వర్రావు, వోలేటి వెంకటేశ్వర్లు, శ్రీరంగం గోపాలరత్నం వంటి హేమాహేమీలతో విజయవాడ రేడియో మాధ్యమానికి పునాదులు వేసిన తరం అది.
‘ఇండియా టుడే’ వారు నా పిల్లలతో (మల్లాది సోదరులు) ‘త్యాగరాజ పంచరత్న కీర్తనలు’ రికార్డు చేయ సంకల్పించారు. అందరికీ తెలిసిన కీర్తనలే అయినా, పాఠాంతరాలలో ఎన్నో తేడాలు కనిపిస్తాయి ఈ పంచరత్న కీర్తనలలో.
మ్యూజిక్ అకాడెమీ పక్కనే వున్న కనకశ్రీ నగర్‌లో బాల మురళీగారింటికి మేం ముగ్గురం వెళ్లి ‘మేం సిద్ధం చేసుకున్న కీర్తనలు వినిపించి, ఆయన సలహా అడిగాం’ ఎంతో ఆనందించారు.
‘త్యాగరాజ పంచరత్న కీర్తనలకు ప్రాణం సాహిత్యం. ఆ సాహిత్యాన్ని మింగేస్తూ పాడుతున్నారిక్కడ. మాటల పరమార్థం అందరికీ తెలియాలి. ‘గుంపులో గోవిందా’ అని పాడేస్తే, త్యాగయ్యగారి ఆత్మ క్షోభించదా? అన్నారు.
తిరువాన్కూర్ మహారాజు ‘స్వాతి తిరునాళ్’ గొప్ప వాగ్గేయకారుడు. వయొలిన్ విద్వాంసుడు ‘వడివేలు’ ఆయన ఆస్థాన విద్వాంసుడే. సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, ముత్తయ్య భాగవతార్ వంటి విద్వాంసులు స్వాతి తిరునాళ్ కీర్తనలకు స్వరలిపి (నొటేషన్) తయారుచేసి పెట్టారు. అందరూ ఆ నొటేషన్‌నే పాడుతారు.
‘దేశాక్షి’ రాగంలో నేనో కీర్తన స్వరపరిచాను. నేర్చుకుంటారా? అని పిల్లల్ని అడిగారుట. ఎంతటి వాత్సల్యం? అరగంటలో నేర్చుకుని ఆయనకు వినిపించి, రికార్డు చేసిచ్చారు. పిల్లలు ఇంటికి వచ్చి వినిపించారు.
‘సరసేరుహ నాభముదారం’ అనే కీర్తన ‘దేశాక్షి’లో ఎంత అద్భుతంగా ట్యూన్ చేశారో చెప్పలేను.
అలాగే ‘శివరంజని’ రాగంలో ‘తిల్లానా’ ఒకటి నేర్పారు. అలా ఆ మహా విద్వాంసునితో పరిచయం కొనే్నళ్ల పాటు నడిచింది. ఇంట్లో తూగు టుయ్యాల్లో కూర్చుని ఆయన చెప్పే కబుర్లు ఎన్నో. ఈ వేళ సినిమా పాటలు పాడితే, తండోపతండాలుగా వెర్రిగా వచ్చి కూర్చునే జనం ఎక్కడ పడితే అక్కడ తారసపడతారు. కానీ, కాంభోజి, కల్యాణి, ఖరహరప్రియ వంటి పెద్ద రాగాలు పాడుతూ, నెరవుతో, రక్తిగా, లక్షణంగా వినిపించే స్వరకల్పనతో కర్ణాటక సంగీత కచేరీ చేస్తూ, లక్షలాది మందిని ఆనందపరుస్తూ కూర్చోపెట్టి వినిపించటం, అనుకున్నంత సుళువు కాదు. ఆయనలా పాడే వారుండవచ్చు, అంతకంటే విద్వత్ కలిగిన వారుండవచ్చు. కానీ ఆయనలా మహాజనాన్ని కూర్చోపెట్టి విజయవంతంగా కచేరీలు చేసే కర్ణాటక సంగీత విద్వాంసులను లెఖ్ఖ పెట్టాలంటే, మనకున్న చేతివ్రేళ్లు ఎక్కువ - అందులో బాలమురళీకృష్ణ టాప్.
కొందరు విద్వాంసుల వల్ల, కొన్ని కీర్తనలు, కొన్ని కీర్తనలు విస్తృతంగా బాగా పాడటం వల్ల ఆయా విద్వాంసులా ప్రసిద్ధులయ్యారు.
‘ననుగన్న తల్లి నా భాగ్యమా!
దేవాది దేవ శ్రీ వాసుదేవ - కావుమయ్య నన్ను-
పేరిడి నిన్ను పెంచినదెవరే- (ఖరహరప్రియ)
వంటి త్యాగరాజ స్వామివారి అపురూపమైన ఎన్నో కీర్తనలు ఆయన పాడితేనే జనానికి తెలిశాయి. ‘పిబరే రామరసం’ అనే సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన, ప్రసిద్ధ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ‘ఆకాశవాణి’ సంగీత పోటీలలో పాడి అవార్డు తెచ్చుకున్న సంగతి కొందరికే తెలుసు.
ఆయన సంగీత జైత్రయాత్రకు నాంది సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనయే.
సదాశివ బ్రహ్మేంద్రులు గొప్ప యోగి. ఆయన రాసిన కీర్తనలు చాలా తక్కువే - అవి ప్రసిద్ధం కావటానికి కారణం బాలమురళీకృష్ణయే.
‘పిబరే రామరసం రసనే పిబరే రామరసం
-స్థిరతా నహి నహిరే -
చేతః శ్రీరామం -
వంటి కీర్తనలు విజయవాడ రేడియో కోసం పాడి రికార్డు చేశారు, అప్పట్లో. ఇప్పటికీ పదిలంగా ప్రసారమవుతూ శ్రోతలకు ఆనందాన్ని స్తూనే ఉంటాయి.
మన మొట్టమొదటి వాగ్గేయకారుడు జయదేవుడు. జయదేవుని అష్టపదులను (ఎల్పీ రికార్డు) పాడి ప్రచారం చేసిన విద్వాంసుడు - బాలమురళీ.
త్యాగరాజ స్వామి వేలాది కీర్తనలలో ఈ వేళ మనకు లభ్యమయ్యేవి కొన్ని వందలే.
ఆయన ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, దివ్యనామ కీర్తనలన్నీ రాగ భావంతో, సరళమైన సాహిత్యంతో నిండుగా ఉండే అద్భుతమైన రచనలు.
మదరాసు ఆలిండియా రేడియో వారు ప్రత్యేకంగా, అధిష్టానం అనుమతి తీసుకుని బాలమురళీ చేత ఈ కీర్తనలను బయట స్టూడియోలో రికార్డు చేయించారు. ప్రసిద్ధ విద్వాంసులు పాడారు.
త్యాగరాజస్వామి తెలుగు వాగ్గేయకారుడు. తెలుగులోనే ఆయన కీర్తనలు వెలయించాడు. కానీ దక్షిణాదిలో స్థిరపడిపోవడంతో అక్కడి సంగీత రసికులందరూ ఆయన్ని ఆశ్రయించారు. ఆ కీర్తనలు నేర్చుకుని పాడి, శిష్య ప్రశిష్య బృందంతో పాడించి, ప్రచారం చేశారు.
మాతృభాష కాకపోవటంతో, అరవ యాసతో ఈ కీర్తనలు పాడటం, తరచు ఉచ్ఛారణా దోషాలున్నా సంగీతం మీద భక్తితో, వాటిని చాలామంది పట్టించుకోలేదు.
శుద్ధమైన స్వరం, స్పష్టమైన ఉచ్ఛారణ, సాహిత్యంలోని మాటల్లోని అర్థం, తెలుసుకుని, భావంతో ఆ కీర్తనలు పాడి మెప్పించిన ఏకైక తెలుగు విద్వాంసుడు డా.బాలమురళీకృష్ణ.
ఎదురుగా, అతి సమీపంలో కూర్చుని విన్నా, కొందరి మాటలు, ఏవిటో పాడుతూంటే అస్సలు తెలియవు. కానీ దూరంగా, ఎక్కడో కూర్చుని విన్నా, బాలమురళీకృష్ణ పాడే కీర్తనలలోని సొగసు, లాలిత్యం, భావం అన్నీ తెలిసిపోతాయి. అందుకే ఆ పాటంటే అందరికీ మోజు.
సంగీత మూర్తిత్రయమైన శ్యామశాస్ర్తీ, త్యాగరాజు, దీక్షితర్ దక్షిణాదిలో ఎలా జన్మించారో, మన తెలుగునాడులో పుట్టిన సంగీత మూర్తులు.. డా.బాలమురళీకృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి, వోలేటి వెంకటేశ్వర్లు, సంప్రదాయ సంగీతానికి వారధులై నిలిచారనటంలో అతిశయోక్తి లేదు.
మాధుర్యం నిండిన స్ర్తి కంఠాలకు, కర్ణాటక సంగీతరంగంలో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, ఎం.ఎల్.వసంతకుమారి, డి.కె.పట్టమ్మాళ్ మొదలైన వారు ముఖ్యులు. చక్కని పురుష గాత్రం కల్గిన వారిలో జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం, రామ్నాడ్ కృష్ణన్, ప్రముఖులైతే, బాలమురళీకృష్ణ వీరందరిలోనూ అత్యంత విలక్షణ గాత్రం కలిగిన గాయకుడు.
త్రిస్థాయిల్లోనూ, అలవోకగా పలికించగల శారీరం ఆయన సొంతం. మేథస్సుతో పనిచేసే వ్యక్తికి శరీరం అలసిపోదు. వృద్ధాప్యం కేవలం శరీరానికే పరిమితమని ఆయన 80వ ఏట పాడిన పాట వింటే తెలుస్తుంది.
ముక్కుతో పాడటం, కళ్లు మూసుకుని పాడటం, గట్టిగా తాళం వేస్తూ పాడటం, శ్రోతల వైపు, హేళన భావంతో చూస్తూ పాడటం లాంటి గాయక దోషాలున్న వారుంటారు - కానీ ఈయన గాయక దోషాలకు అతీతుడు. చిరు మందహాస వదనంతో, పక్క వాద్యాలను ప్రోత్సహిస్తూ, ప్రేక్షకులతో నాదానుసంధానం చేసుకుంటూ, గణపతి ప్రార్థన మొదలు మంగళం వరకూ, సునాద మధురిమలను చిందిస్తూ, పరవశమై పాడే అరుదైన గాయకుడు బాలమురళీకృష్ణ.
ఆయన్ని అనుసరించే వారికంటే అనుకరించేవారే ఎక్కువ - పాడగలిగేందుకు తగినంత జ్ఞానం సంపాదించిన వారు అనుకరించే ప్రయత్నం చేయరు. అనుకరణ ఆరోగ్యం కాదని సంగీతజ్ఞులంటారు. స్వయంగా వెళ్లి నేర్చుకోకపోయినా, ఆయనను ఆరాధించే ఏకలవ్య శిష్యులు ఎందరో వున్నారు.
ఆయన మంచి ప్రౌఢ వయస్సులో పాడిన పాటకూ, ఆ తర్వాత పాడిన దానికీ కొంత వ్యత్యాసం లేకపోలేదు.
1950-65 సం.ల మధ్య ఆయన చేసిన సంగీత కచేరీలన్నీ ‘న భూతో న భవిష్యతి’ అనేలా వుండేవి.
ఎం.ఎస్.గోపాలకృష్ణన్, లాల్‌గుడి జయరామన్ లాంటి ఉద్దండులైన వయొలిన్ విద్వాంసులొక వైపు, పాల్ఘాట్ మణిఅయ్యర్, పళని వంటి మృదంగ విద్వాంసులు మరోవైపు - ఆయన చేసిన ఆ కచేరీలన్నీ ‘నువ్వా! నేనా!’ అన్నట్లుగానే ఉండేవి.
సంగీతం గొప్పదే. కానీ సంగీత రంగం వేరుగా ఉంటుంది.
కళాకారుల మధ్య అవగాహనా లోపాలూ, అసహనాలు, సద్విమర్శలతోబాటు కువిమర్శలూ చేసేవారుంటూనే ఉంటారు. ఈ బాధ ఆయనకూతప్పలేదు. తోటి విద్వాంసులే ఆయనను విమర్శించిన సందర్భాలు లేకపోలేదు.
అయినా ఎవరినీ లెఖ్ఖ చేయలేదు. జనరంజకమైన సంగీతం వినిపించాలనీ, అందులో నూతనత్వం కనిపించాలనీ గాఢంగా నమ్మిన విద్వాంసుడు.
గత జన్మలో సాధన చేసి ఈ జన్మలో పుష్కలంగా పాడిన గాయక శిరోమణి మంగళంపల్లి.
సాహిత్య దోషాలు లేకుండా పాడటం, ప్రతి మాటకూ నాదాన్ని నింపి, తిన్నగా చెవులకు చేరవేయటం, సంగీతం అంటే ఏమీ తెలియని వారికి సైతం వింటూన్నంతసేపూ హాయినీ, ఆనందాన్నీ కలిగించటం ఇవీ ఆయన బాణీలోని విశేషం.
సంగీత యోగ్యత కలిగిన గాయకులు, విద్వాంసులూ ఎందరో ఉంటారు. కానీ యోగ్యతతోపాటు యోగం కూడా కలిసి వున్న విద్వాంసుడు బాలమురళీకృష్ణ. పాడేవారందరికీ అంత పేరు లభిస్తుందా?

-మల్లాది సూరిబాబు 9052765490