AADIVAVRAM - Others

స్ట్రింగ్ సిద్ధాంతం ( శాస్ర్తియ ఆవిష్కరణలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సిద్ధాంతాన్ని భౌతిక శాస్తవ్రేత్తలు బలమైన అణుశక్తి తాలఃకు డ్యుయల్ రిసొనెన్స్ మోడల్‌ను అధ్యయనం చేస్తూ పరిశీలించారు. సాధారణ సాపేక్ష సిద్ధాంతం, క్వాంటం మెకానిక్స్ సిద్ధాంతం మధ్య వైరుధ్యాలను తొలగించి రెంటినీ ఒకే చోటకు చేర్చే లక్ష్యంతో వారు ఈ ప్రయత్నం చేశారు. స్ట్రింగ్ సిద్ధాంతం ప్రకారం అణువులోని ఎలక్ట్రాన్లు క్వార్క్స్ పరిమాణం లేనివి ఏమీ కావు. ఏక పరిమాణం కలిగి ఊగుతూ ఉండే రేఖలు - ఈ రేఖలను స్ట్రింగ్స్ అంటారు. స్ట్రింగ్స్ ప్రకంపన తీవ్రత అణువులో ఉత్పత్తి అయ్యే శక్తిని నిర్ణయిస్తుంది. ఇదే ప్రత్యేక తరహా సబ్ అటామిక్ పార్టికల్స్ ఉత్పత్తికి కారణం అవుతుంది.
స్ట్రింగ్ సిద్ధాంతం తొలిసారి ప్రతిపాదించి 1960 నుంచి ఇప్పటివరకూ అయిదు ప్రధాన స్ట్రింగ్ సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. అయితే 1990ల్లో అయిదింటిని ఒక్క తాటిపైకి తెచ్చారు. దీనిని ఎం-్థయరీ అంటున్నారు. దీని ప్రకారం స్ట్రింగ్స్ ఏక పరిమాణం గల ముక్కలు అయితే ఇవి ద్విపరిమాణపు పొరగా పదకొండు పరిమాణాల స్థలంలో ప్రకంపిస్తుంటాయి. స్ట్రింగ్ సిద్ధాంతాన్ని పరీక్షించటం కష్టం కానీ, పార్టికల్ ఆక్సిలరేటర్లు ఇందుకు మార్గాన్ని కనుగొనే అవకాశం ఉంది. స్ట్రింగ్ సిద్ధాంతాన్ని నిర్ధారించే హై ఎనర్జీ సూపర్ సిమెట్రీకి సంబంధించిన ఆధారాలను గుర్తించటం ద్వారా ఇది రానున్న దశాబ్ద కాలంలో సాధ్యపడుతుందని భావిస్తున్నారు.

-బి.మాన్‌సింగ్ నాయక్