AADIVAVRAM - Others

ఆనంద రహస్యం (కథాసాగరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితమొక రహస్యం. ఎప్పటికీ అంతుచిక్కని రహస్యం. అర్థవంతంగా జీవించడం అందరికీ సాధ్యం కాదు. అలా జీవించే వాళ్లని రుషులనవచ్చు. సన్యాసులనవచ్చు. వాళ్లు ఎక్కడో అరణ్యాలలో వుండరు. మన మధ్యే ఉంటారు. మనుషుల్ని పరిశీలిస్తే మనకు మానవోత్తములు కనిపిస్తారు. కొందరు ముఖాలు వేలాడేసుకుని ఉంటారు. కొందరు ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారు. కొందరిలో సంతృప్తి కనిపిస్తుంది. కొందరిలో అసంతృప్తి కనిపిస్తుంది. ఎట్లాంటి సందర్భంలోనైనా జీవితాన్ని ఆనందిస్తూ, ఆమోదిస్తూ, ఆహ్లాదంగా గడిపేవాళ్లు కొద్దిమందే కనిపిస్తారు. వాళ్లకు మాత్రమే జీవిత రహస్యం తెలుస్తుంది. జీవిత రహస్యం తెలుసు గనకే వాళ్లు సంతోషంగా ఉంటారు.
ఒక వ్యక్తి ఉండేవాడు. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండేవాడు. దుఃఖంగా ఉండేవాడు కాడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ వుండేవాడు. అందరికీ ఎంతో ఆశ్చర్యం వేసేది. అందరికీ వున్నట్లు అతనికీ సమస్యలున్నాయి. బాధలున్నాయి. కష్టాలున్నాయి. వాటిని పట్టనట్లు ఎట్లా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడో అంతుపట్టేది కాదు. పైగా ఆ సమస్యల్ని ఆయన తప్పించుకు పారిపోయేవాడు కాదు. వాటిని సూటిగా ఎదుర్కొనేవాడు.
అతనెంత చురుగ్గా ఉండేవాడంటే పసిపిల్లలతో కలిసి ఆట్లాడేవాడు. మధ్యవయసు వాళ్లతో మాటామంతీ కలిపేవాడు. అతనికి తొంభై ఏళ్ల వయసు. ఎవరూ అతను ముసలివాడు కదా! అతన్తో మనకేమిటిలే అని తప్పించుకుపోయే వాళ్లు కారు. అతన్తో మాట్లాడితే ఎంతో ఆనందం కలిగేది. కథలు చెప్పేవాడు. కబుర్లు చెప్పేవాడు. విసిగించేవాడు కాదు.
ఆయన తొంభయ్యో ఏట జన్మదినాన్ని ఘనంగా జరపాలని బంధు మిత్రులంతా సంకల్పించారు. దూర ప్రాంతాల నించీ కూడా మిత్రులు, బంధువులు సమావేశమయ్యారు. ఇల్లంతా కోలాహలంగా ఉంది. పిల్లల కేరింతలు అంతా హడావిడి. అతను మంచి బట్టలు వేసుకుని అందర్నీ పలకరిస్తూ ఉత్సాహంగా ఉన్నాడు.
కేకు సిద్ధం చేశారు. అందరూ హాల్లో సమావేశమయ్యారు. కేకు కటింగ్ జరిగింది. కఱతాళ ధ్వనుల మధ్య ‘హ్యాపీ బర్త్‌డే టూ యూ’ అని పాట పాడారు. అప్పుడు ఆయనకేసి ఆశ్చర్యంగా చూస్తున్న ఒక వ్యక్తి ‘మీరు ఈ వయసులోనూ ఇంత ఉల్లాసంగా ఉన్నారు. అంతేకాదు ఎప్పుడూ దిగులుగా లేరు. నా చిన్నతనం నించీ మీరు దిగులుగా ఉండడం చూడలేదు. దీనిలో రహస్యమేమిటి? చెప్పండి?’ అన్నాడు.
ఆయన నవ్వి ‘నేను ప్రతిరోజూ ఉదయానే్న నిద్ర లేస్తే మొదట ఇలా అనుకునేవాణ్ని. నీ ముందు దుఃఖం ఉంది. ఆనందం ఉంది. దేన్ని ఎన్నుకుంటావు?’ నేను ప్రతిరోజూ ఆనందానే్న ఎన్నుకునేవాణ్ని. ఇప్పటికీ అదే పని చేస్తున్నా’ అన్నాడు. *

-సౌభాగ్య 9848157909