AADIVAVRAM - Others
మహాత్ముడి బాట - సందేశం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలుగు ఆచార్యులు 1915 ఏప్రిల్ 21న మద్రాస్ వచ్చినప్పుడు 1929, 37లో హరిజన పత్రిక, యంగ్ ఇండియాలో, 90 ఏళ్ల తర్వాత కూడా, ఈ పరిస్థితి చూస్తే, ఆంగ్ల ప్రాబల్యంలో ఉంది. మనం దేశ భాషలను అలక్ష్యం చేసి, దురవస్థలపాలు సామాన్య కుటుంబాలను నెడుతున్నారు. అని ఆవేదన చెందారు. మొగలాయి, మహ్మదీయుల పాలనలోను వారి భాషలను మనపై రుద్దారు. ఇప్పుడు లార్డ్‌మెకాలే రూపంలో ఆంగ్ల మాధ్యమాన్ని మనపై రుద్ది ముందు తరాల ఆంగ్ల మాధ్యమ బానిసలుగా తయారుచేయటమంటే మన హిందూస్థానీ భాషలను మరుగున పరచుటకు, మన సంస్కృతిని, చరిత్రను భావితరాలకు తెలియకుండా చెయ్యడమే! అని ఆక్రోశించారు మహాత్ముడు. అందుకే.
‘‘దేశ భాషలను నేర్చుకోవడం విద్యావంతుల విధి. ప్రతీ ఒక్కరూ విధిగా వారి మాతృభాషను, ప్రాంతీయ భాషలనుకునే వారి సంస్కృతి, చరిత్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభ్యసించారు. అది ప్రాథమిక విద్య నుంచే బాలల పరిరక్షణ హక్కుగా జరగాలి. నేను మీ మాతృభాషలను తెలుగు, అరవం నేర్చుకున్నా మీతో సంభాషిస్తున్నానంటే నా మాతృభాష నాకు నేర్పిన (చదువు) సంస్కారం అని చాటారు! ఇది మన జాతికి శ్రేయస్కరమన్నారు. ఆంగ్ల మాధ్యమానికి నేను వ్యతిరేకం కాను! కానీ మన మాతృభాషలను పూర్తిగా ఉద్దరించుకొని మిగతా భాషలనూ ఉద్దరించండి. ప్రపంచాన్ని చదవండన్నారు గాంధీ!
కనీసం.. పది సంవత్సర కాలంలో ప్రతీ భారతీయ విద్యార్థి తన మాతృభాషనీ, సంస్కృతినీ నేర్చుకునీ, మిగతా భాషలను నేర్చుకో..
ఇది బాలలకు కష్టమైనదేం కాదు. ఇది వారి మనోభీష్టం మేరకు ఆ సౌలభ్యాన్ని పెంపొందించుకోవచ్చు. వ్యవసాయదారుడు, కొడుకు ఇంగ్లీషు నేర్చుకుని, శాస్త్ర పరిజ్ఞానం అభ్యసించి, వ్యవసాయాన్ని వదులుకోకూడదు. కష్టపడే తత్వాన్ని వదిలి, గుమస్తాగిరీకి ఎగపడొద్దు అని చెప్పాడు గాంధీజీ.
ఇలా విద్యావంతులైన భారతీయులు వారి మాతృభాషలోకి సాంకేతిక పరిజ్ఞానాన్ని తర్జుమా చేసుకొని జాతినుద్ధరించండని సందేశమిచ్చారు.
1. ‘‘సాంకేతిక పదాలను దేశభాషలలోకి తక్షణమే అనువాదం చేసుకోండి. తన యంగ్ ఇండియాలో 2-7-1920లో.
2. ప్రస్తుత విద్యావిధానంలో ఈ మూడు తప్పనిసరి చేసుకోవాలి అని అన్నారు. విదేశీ సంస్కృతిపైన ఆధారపడి దేశీయ సంస్కృతిని, హృదయ గత సంస్కారాన్ని విస్మరించండి. మన పిల్లల్ని పరాయి భాష విదేశీయులుగా తయారుచేయకూడదన్నారు.
3. చేతి విద్యను త్రోసిపుచ్చి ఆంగ్ల మాధ్యమంలో మనసును మలినం చేసుకోకండి.
4. ప్రాథమిక స్థాయిలో పరాయి భాషలో బోధించి విద్యార్ధులను ఇంగ్లీషు వాదులుగా, పరాయివాసులుగా తయారుచేయకండి.
ఇది మొత్తం జాతికి, మాతృభాషల పరాధీనతకు తార్కాణమన్నారు. ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత కూడా మొత్తం భారతదేశం అదే ఆయన ఊహించిన యదార్థ స్థితిలోనే ఉండటం మన మాతృభాషలను నిర్లక్ష్యం చేయించే ప్రభుత్వ పాలనలో అనైతికత, అసమర్ధత, దౌర్భల్యమని, యావజాతిని మాతృభాషలను ఆంగ్లమాధ్యమానికి తాకట్టు పెట్టడమే అన్నారు. తోటి ప్రజానీకపు వృత్తి జీవితాలను మరణశయ్యపై వ్రాస్తున్నారన్నారు గాంధీ!’’ జాతీయ మన శక్తి సంపదలు, ఇతరులు దోచుకునే స్థితికి మనమే వేదిక నిర్మిస్తున్నామని ఆక్రోశించారు గాంధీ! దేశానికి పనికిరాని విద్య, వారసులు, తరాలను ఇలా మనం తీర్చిదిద్దవద్దు. మన విద్యార్థులు మన మాతృభాషలోనే చదివి దేశ సౌభ్రాతృత్వానికి వెనె్నముకలవ్వాలన్నారు. గాంధీ ‘‘అవసరమైనంత వరకే ఆంగ్లం’’ అనే మహాత్ముని సిద్ధాంతాన్ని విస్మరించి నిర్బంధ ఆంగ్ల విద్య దేశ భక్తిగా చలామణి కావాలని ఈ ప్రభుత్వాలు ఆరాటపడుతున్నాయి. ఒక క్లాసు ఆంగ్లానికి సరిపోదని చెప్తూ ‘‘ఒక క్లాసుకి తెలుగు భాషను, మాధ్యమాన్ని పరిమితం చేయాలని చూడటం జాతి మొత్తాన్ని హరించడమే! దీన్ని అలుసుగా తీసుకుని ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ వారంతా వారానికి ఒక క్లాసు మాత్రమే తెలుగుని బోధించేలా కుదించటం యావత్తు తెలుగుజాతినీ కాక భారతావనిలోని మాతృభాషలన్నింటినీ కూడా ద్రోహం చేయమని చెప్పటమే!
2. ఆంగ్లభాషకు దాస్యమైతే ఫలితాలు: ఇలా చూస్తారన్నారు గాంధీ. స్వాతంత్య్రం వచ్చాక ఆంగ్ల భాషకు దాసోహం పలికిన రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం ఎంతటిదో పరిశీలిస్తే నిజాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అండమాన్ దీవులు, అరుణాచల్‌ప్రదేశ్, చండీగఢ్, గోవా, జమ్మూ-కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కింలలో ఇంగ్లీష్ మాధ్యమంలో 9 రాష్ట్రాలు ప్రవేశపెట్టి జాతి మొత్తం అతలాకుతలమవుతున్నాయి. అస్సాం, ఒడిస్సా, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్‌లలో 4 రాష్ట్రాలలో ఇంగ్లీషు మాధ్యమాన్ని 3వ భాషగా ఉంది. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రాథమిక స్థాయిలో, 4వ భాషగా పెట్టి తమ మాతృభాషను పరిరక్షించుకున్నారు. కానీ తక్కిన రాష్ట్రాలలో మన దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో ఆంగ్ల మాధ్యమాన్ని 2వ భాష చేస్తే, మన రాష్ట్రం పూర్తిగా ఆంగ్లమాధ్యమంలోకి తరిలిపోవడం యావత్తు తెలుగు జాతి పరాయి భాషకు అమ్ముడైపోయి, ఉద్యోగార్జనకై ఇతరత్రా దేశాలుద్దరించి, మన దేశ ఆర్థిక, సాంఘిక, సాంకేతిక ప్రగతిని నిలువెల్లా ద్రోహం చేసి అమ్ముకోవడమే అంటాను నేను.
ఇంతటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా దేశంలో ఇంకా దేశ భాషలలో, వారి వారి ప్రాంతాలలో మాతృభాషలలో ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ, సార్వత్రిక, విద్య దాకా నేర్చుకొని ప్రభుత్వ ఉద్యోగాలలో అలా చదివిన
వారికే పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్.లు అయిన వారున్నారు. ఆయా రాష్ట్రాలు కింద చూడండి.
ఆయా రాష్ట్రాలు తమ మాతృభాషలతో చదివి జాతినుద్దరిస్తున్నారు.
హిందీ - 6,82,31,904 మంది
బెంగాలీ - 1,04,02,343
మరాఠీ - 79,18,420
గుజరాత్ - 51,59,916
తెలుగు - 47,71,981
ఒడిస్సా - 39,82,338
కన్నడ - 37,40,803
తమిళం - 36,50,278
అస్సామ్ - 31,54,842
ఇలా ఆయా ప్రాంతీయ మాతృభాషలలో చదివి తెలుగుమాధ్యమ విద్యార్థులు మనం పెంచుకోగల్గినా మొత్తం మన తెలుగుజాతి మన విద్యార్థి, మేధావులను తరలిపోకుండా మన రాష్ట్రాలను, మన జాతిని, భారత దేశ విద్యా సాంకేతికత, వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక రంగాలలో ఇతరత్రా దేశాలతో సమ ఉద్యోగి మన తెలుగుజాతి ఔన్నత్యాన్ని భాషా ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుదాం. మాతృభాషా మాధ్యమం కొనసాగేలా ఓటు బ్యాంకు కోసం తాపత్రయపడే ఈ ప్రభుత్వాలను కళ్లు తెరిపించేలా ఉద్యమించాలి. దాని కార్యాచరణ కమిటీ వేసి ముఖ్యమంత్రిని ఒప్పిద్దాం. జాతిని మేల్కొల్పుదాం!
మొత్తం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా భాషాప్రయుక్త రాష్ట్రంగా 1953లో అలానే మొదటగా ఏర్పడి మన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ పరిపాలనా భాషగా, బోధనా భాషగా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేకపోవడానికి కారణం. పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాలే! పేద, మధ్య, ధనిక వర్గాల మధ్య భాషాంతరాలతో ఆంగ్ల, మాతృ భాషా మాధ్యమాలను కూడా పెట్టి పొసగకుండా ఒకరికి ఒకరికి కులాలు, వృత్తుల అంతరాలతో పబ్బం గడుపుకుంటున్నారు. మాతృభాషా మాధ్యమాన్ని ఆఖరికి పక్కదోవ పట్టించేస్తున్నారు. ఇది ప్రతీ తెలుగువాడు మాతృభాషాభిమానులు తీవ్రంగా ఖండించడమే కాకుండా, ప్రభుత్వ విధానాన్ని ఖండించి, ఒప్పించేలా చేసి మాతృభాషలోనే బోధనా మాధ్యమంగా కొనసాగించేలా ఉద్యమించాలి.
‘‘అధికార భాష మూడు విషయాలలో అవసరం అవుతుంది. సాధారణ పాలనా రంగం, న్యాయస్థానాలు, విద్యారంగం, ఈ మూడింటిలోను తెలుగు స్థానే ఇంగ్లీషు స్థిరపడిపోయింది. దిగువస్థాయిలో రెవెన్యూ, న్యాయస్థానాలు తదితర పాలనా వ్యవస్థలో, పాలనా పారిభాషక పదాలు ఇంగ్లీషులో చాలినన్ని లేని కారణంగా ఈ రంగాన్ని తెలుగులో వ్యవహారం నడిపేందుకు అప్పటి బ్రిటిషర్లు ఒప్పుకోవడం కాకుండా వదిలేశారు. అంతకు మునుపు మహ్మదీయపాలన వలన అరబ్బి, పర్షియన్ పదాలతో ఆనాటి మన తెలుగు పరాయి భాష సంకరణ పదాలతో నేటికీ మన వ్యవహారికంలో వెలుగొందుతుంది.
బ్రిటిషర్లు న్యాయ, రెవెన్యూ వ్యవస్థలలో కొనసాగిస్తే, స్వతంత్రం పొందేలా మన పాలకులు కూడా అదే విధానానికి అలవాటుపడి వ్యవహారిక భాషా పరిపాలన భాషగా చేసుకోవడానికి చొరవ, కార్యాచరణ చూపకపోవడం జరిగింది. ఇందుకు ప్రభుత్వాలు, మేధావులు, విశ్వవిద్యాలయాలు సమాన బాధ్యులే.
క్రీ.శ. 650 నుండి 1750 వరకూ 1100 ఏళ్ల పాటు అధికార భాషగా ఎంతో కొంత వెలిగిన తెలుగు భాష బ్రిటీష్ వారి హయాంలో కొన ఊపిరితో ఉంటే, సొంత ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఉన్న ఉన్న ఊపిరి కూడా ఊడపెరిగారు మన పాలకులు. ఓటు బ్యాంకు రాజకీయాలు.
‘‘మాతృభాషను తృణీకరించటం మాతృదేవినీ తృణీకరించుటకే అన్నాడు మహాత్ముడు. ఆనాడే! చదువుకొన్న వాళ్లలో బుర్రలో పుట్టిన ఆలోచనంటారాయన. ఎక్కువ చదువుకున్నాను కదా అని, తెలియాలంటే ఎక్కువ ఇంగ్లీషు మాట్లాడాలనే భావన. ఎక్కువ డబ్బు పెట్టి చదువుకున్న వాళ్లలో ఎక్కువగా ఉండేదంటారు.
‘‘ఆంగ్ల భాష పట్ల వ్యామోహం వలన సమాజంలో విద్యావంతులు, రాజకీయ నాయకులు, వర్గాలకు, సామాన్య జనాలకూ మధ్య పెద్ద అగాథం ఏర్పడింది.
‘‘మాతృభాషలో మాట్లాడే వారంతా దుర్భలులనే ఒక దురభిప్రాయం అప్పటి నుంచి నేటి వరకూ కొనసాగితూనే ఉంది. ఇంగ్లీషులో ఆలోచించి ఇంగ్లీషులో మాట్లాడటానికి అలవాటు పడటం వలన క్లిష్టమైన భావాలను మాతృభాషలో వ్యక్తం చేయడానికి వీళ్లు తబ్బిబ్ము పడుతుంటారు.’’ అని నాడే మహాత్ముడు మన భారతీయ వ్యవస్థలో ఉన్న అవసరంలేని చోట ఇంగ్లీషు వాడే వాళ్ల గురించి అన్నారాయన.
కూడు పెట్టే భాష
ఆంగ్ల భాష కూడు పెడుతుందనే అపోహ కలగటానికి ప్రధాన కారణం విద్యా వాణిజ్యమే. తమిళనాడులోనూ, కర్ణాటక తదితర రాష్ట్రాలలో మాతృభాషల్లో చదువుకున్న వారికి డిగ్రీ, ఇంజనీరింగ్ దాకా పాఠ్యాంశాలలో కూడా వారి మాతృభాషలలోని తర్జుమా చేయబడి ఉంటాయి. అలా బయటకు వచ్చిన వారికి 5-20% వరకూ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లిచ్చి కూడు పెడుతున్నారు. ప్రజల్ని తెలుగులో ఓట్లు అడిగి అధికారానికి వచ్చిన ప్రభుత్వాలు తెలుగులో పాలిస్తూ తెలుగు వచ్చిన వారికి ఉద్యోగాలివ్వటం ప్రభుత్వానికి కష్టం కాదు. అధికార యంత్రాంగం లార్డ్ మెకాలే మాదిరే ఆలోచించకుండా ఉంటే సాధ్యమే!
ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలు అయినా లెక్కచేయక ఆర్థిక ఫీజులు చెల్లిస్తున్నారు. ఇంగ్లీషు మాధ్యమం లేకపోతే అధిక లాభాలు రావు కాబట్టి విద్యా సంస్థల బాగు కోసమే ఈనాటి ప్రభుత్వాలు వాటిని ప్రోత్సహిస్తూ ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించినట్లే, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇవి పెడుతున్నాము అని సమర్ధించుకోవడం ఎంతవరకు సబబు అని ఆక్షేపించుకుంటే అది గాంధేయవాదానికి అనుసరణీయమవుతుంది. అనాడే 90 ఏళ్ల క్రితం ఆంగ్లభాష ప్రభావం ఇలా ఆర్థిక స్థితిగతి ఉంటుందని ఆయన వక్కాణించారు. ఇది తెలుగు బోధనకు వ్యతిరేకంగా ఏ చర్య తీసుకున్నా అది పరోక్షంగా అధిక పీజులు వసూలు చేసే ప్రైవేటు విద్యా సంస్థలకు అనుగుణంగా తీసుకొన్న నిర్ణయమే అవుతుంది. పైకి చెప్పే ఇతర ప్రయోజనాలు ఏవీ నెరవేరవు.
‘‘్భరతదేశంలో సగటు మానవుడు తన నెలసరి ఆదాయంలో తల్లిదండ్రులందరూ మూడవ వంతుని కేవలం పిల్లల చదువుల కోసం ఖర్చు చేయవలసి రావడం బడుగ దేశానికి గర్వకారణం ఎంత మాత్రం కాదన్నారు. మహాత్ముడు, చదువుల పేరుతో ఇంత వృధా ఖర్చు పనికిరాదన్నారు. గాంధీ ఇలా తల్లిదండ్రులను అప్పులపాలు చేస్తే ఆంగ్ల చదువులు జాతి నిర్మాణానికి దోహదపడేవి కావు అని ఆనాడే హెచ్చరించి అమెరికా వెల్లిపోవటమే లక్ష్యంగా చదువులు చెప్పటం, వాటికి ప్రభుత్వాలు దానికి వంతపాడటం ఎంత విచిత్రం. ఈ పరిస్థితి మన జాతికి ఎంతవరకు సబబు అన్నాడు.
మాతృభాషలో సమాచారం అనేది మనిషిగా పుట్టినందుకు సహజంగా జరగవలసిన ఒక ప్రక్రియ. మనుషులే కాదు. జంతువులు కూడా తమ మాతృభాషలోనే సమాచారం ఇచ్చి పుచ్చుకుంటాయి. కొందరు మనుషులకే ఈ మాతృభాషా విరక్తి! అన్నాడు మహాత్ముడు.
‘‘మనం ఇంగ్లీషు భాషలో ఆలోచిస్తాం. ఇంగ్లీషులో మాట్లాడుతాం. అందులన మన భాష వాడకం అవకాశాలు తగ్గిపోతాయి. మన మాటలు విని జనం అసహ్యంగా చూస్తున్నారని ఇంగ్లీషు వాకులత్వం........ ఉన్నవారు గుర్తించట్లేదు. దేశ అవసరాలకు ఆంగ్ల భాషా పాండిత్యం తప్పనిసరి కానక్కరలేదన్నారు గాంధీజీ.
ఇలా ‘‘గాంధీజీ! ఒక పాఠశాలకు వెళ్లినప్పుడు అక్కడ పాఠాలు చెప్పే గురువులంతా తమను ఫలానా అంశం బోధించే గురువులుగా పరిచయం చేసుకున్నారు. అప్పుడు, సమగ్ర వ్యక్తిత్వాన్ని బోధించే విధానం ఈ విద్యా వ్యవస్థలో లేదని, ఎవరూ దాని గురించి విద్యార్థులకు బోధించట్లేదని గాంధీజీ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఆత్మ విశ్వాసం, ఆత్మగౌరవాలను పెంచి తన కాళ్ల మీద తాను నిలబడేలా చేస్తే విద్యను విద్యార్థుల బుర్రకెక్కించాలి’’ అని సూచించారాయన.
‘‘నాకే అధికారం ఉంటే ఈ పాఠ్యగ్రంథాలన్నింటినీ తిరిగి రాయిస్తాడు. మన సంస్కృతికి, మన నాగరికతకు, మన గృహ జీవితానికి అనుగుణంగా ఉండే విషయాలను పాఠ్య గ్రంథాలలో రాయిస్తాను. మన దేశానికి ఈ రకపు విద్య పనికిరాదు. ఈ రకపు విద్య నేర్పటం నేరం కిందకే వస్తుంది అని అన్నారు. అట్లా ‘‘మన దేశంలో నూటికి 80% వ్యవసాయం, నూటికి 10% పరిశ్రమలు. ఈ పరిస్థితిలో పిల్లలకు మనది కాని సారస్వతాన్ని బోధించి జీవితంలో దేనికీ పనికిరాని వారిగా తయారు చేస్తున్నారు. ఇలా చదువుకున్న వారంతా శరీర కష్టానికి తాళలేనివారుగా మారిపోతారు. గుమస్తాలు గానో ద్విభాషీలుగానో మాత్రం పనికి వస్తారు. అని ఆనాడే గాంధీజీ ఆవేదన చెందారు. ఈ రోజు 90 ఏళ్లు దాటాక కూడా స్వతంత్ర భారతావనిని అలాగే చూస్తున్నాము. ఎంత విసుగ్గాప్రభుత్వ పాలకులు పునరాలోచించాలి.
‘‘చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండే కష్టించి పనిచేయడం గౌరవమనే భావాన్ని పిల్లల్లో కలిగించాలి. కష్టపడడం అగౌరవమని అసహ్యించుకునే విద్యను నేర్పరాదు. బడి పిల్లలు పనిచేయటానికి అసహ్యించుకోవటం చూస్తే విచారం కలుగుతుంది. ఒక రైతు బిడ్డ బడికిపోయి విద్యనభ్యసించినంత మాత్రాన వ్యవసాయాన్ని మానుకోవటానికి నాకు కారణం కనిపించదు. తన జ్ఞానంతో వ్యవసాయాన్ని అభివృద్ది చేసేవాడిగా ఎదగవలసిన విద్యావంతులైన రైతుబిడ్డ గుమస్తాగా జీవించాలనుకోవటం దురదృష్టకరం అని బాధపడ్డాడు గాంధీజీ.
మాతృభాష పునరుద్ధరణ, మాతృభాషకు పునర్వైభవం అని గాంధీజీ అనగానే ఆ రోజుల్లోనే మాతృభాష కడుపుకు కూడు పెట్టదని పెదవివిరిచిన వారున్నారు. కడుపు కాలే వాళ్లకు మాత్రమే తెలుస్తుందని, ఆదర్శాలు కడుపు నింపవనీ అన్నవాళ్లూ ఆ రోజున ఉన్నారు. ఈ రోజున మన కళ్లముందున్నారు.
‘‘ప్రాథమిక విద్యా దశను దాటిన తర్వాత అతవం ఏ భాషలో తన విద్యను అభ్యసించినా, ఆంగ్లం అప్పుడు నేర్చుకున్నా, చాలా సులభంగా పైకి రాగలడు. ఇది మాతృభాషపై ఉన్న పట్టు, భావుకతే అతనికి. మిగతా భాషలు రావటానికి నేర్చుకొని, వివిధ రకాల సాంకేతికాంశాలు పెంపొందించుకోటానికి దోహదపడుతుందని మహాత్ముడు సమాధానమిచ్చారు.
‘‘ఒక భాష దాన్ని మాట్లాడే ప్రజల కన్నా గొప్పదీ కాదు. తక్కువదీ కాదు. ఒక సమాజంలోని విజ్ఞానాభివృద్ధి ఆ సమాజంలోని భాషలో ప్రతిబింబించాలి. సుమారు అవసరాలను ఆ భాష సమర్థంగా నిర్వహించే విధంగా సాంకేతికతను, మనకు అనుకూలంగా మలుచుకోగల్గినప్పుడు ఆ శాస్త్ర విజ్ఞానంలో సామాన్యుడి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని, ఇది అందరూ మాతృభాషా మమకారంతో సాధించాలని 90 ఏళ్ల క్రితమే గాంధీజీ చాటారు.
‘‘పాలనా పరంగా ప్రభుత్వాలు కూడా మాతృ భాషలను వినియోగించిన కొద్దీ సామాన్యుడి ప్రయోజనాలు నెరవేరుతుంటాయి. మన రాజకీయ నాయకులు చక్కని మాతృభాషనే మాట్లాడితే ఇప్పటికీ ఇంగ్లీషులో ఓట్లు అడిగే నాయకులెవ్వరూ లేరు. తెలుగు భాషను పూర్తిగా రద్దు చేశాక ఈ పాలకులు చేష్టలుడిగేలా తమ పాలనను సామాన్య ప్రజల జీవితాలను పక్కదోవ పట్టేలా చెయ్యటమే మాతృభాషా బోధనా మాధ్యమానికి ద్రోహం చేస్తున్నారు. ఇది ప్రతీ తెలుగు జాతి ముద్దుబిడ్డ గాంధీజీ చెప్పిన 90- ఏళ్ల క్రితం తేల్చిన చెప్పిన పై అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని మాతృభాషా మాధ్యమాన్ని కొనసాగేలా ఉద్యమించి, ప్రభుత్వాన్ని ఒప్పించి తిరిగి మాతృభాషా మాధ్యమానికి పూర్తి స్థాయిలో పాలనా, విద్యా, వాణిజ్య, సాంకేతిక రంగాలలో పునరుద్ధరణ చేసి తీరాలి.
ముగింపు: 1906లో శ్రీ గిడుగు వ్యవహారిక భాషోద్యమాన్ని 36 ఏళ్లు కష్టపడితే, 1942 నుంచి 1975 దాకా శ్రీ వావిలాల గోపాలకృష్ణ పెద్దాయన కార్యాచరణ నిలబెట్టడానికి ‘‘అధికార భాషా సంఘం పెట్టించి పరిపాలనా, బోధనా, న్యాయ భాషలుగా మాతృభాషను తీర్చిదిద్దటానికి శ్రీ నండూరి రామకృష్ణమాచార్యులు పూర్తి స్థాయి చేసి చూపిస్తే ఈనాటి ప్రభుత్వాలు పాలనాధికారంలో మాతృభాషా మాధ్యమాన్ని తూట్లు పొడవకుండా తిరిగి ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విద్య దాకా మాతృభాషా, బోధనా మాధ్యమాన్ని కొనసాగించి, తెలుగు భాష, జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుదాం..!