AADIVAVRAM - Others
గ్రామ స్వరూపాన్ని మార్చిన కర్మశీలి!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘హఫువా’ రాంఘర్ (జార్ఖండ్) జిల్లాలోని ఒక కుగ్రామం. ఇది రాంచీకి ఉత్తరాన 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి జనాభా వెయ్యి మంది. ఈ గ్రామంలో ముస్లింలు అధిక సంఖ్యాకులు. ఈ గ్రామంలోని ప్రజలు ముఖ్యంగా యువత దేవుడిలా ఆరాధించే వ్యక్తి సిద్ధినాథ్ సింగ్. ఎవరీ సిద్ధినాథ్? ఏమిటా కథ?
ఒకప్పుడు హఫువా గ్రామంలో యువత ఎక్కువగా నేర ప్రవృత్తిని కలిగి ఉండటానికే ఆసక్తి చూపేది. అయితే సిద్ధినాథ్ నిరంతర కృషి కారణంగా అక్కడ పరిస్థితే మారిపోయింది. గత రెండు దశాబ్దాలుగా ఆయన నిస్వార్థంగా చేసిన సేవలు అక్కడి యువకుల జీవితాలను మార్చేసింది. అక్కడి ముస్లిం నాయకులు, రాజకీయ నాయకులు, సంఘ సేవకులలో యువకుల పట్ల చులకన భావం మాయమై పోయింది. అక్కడి యువకులందరికీ ఇప్పుడాయన ఆరాధ్యుడే.
సిద్ధినాథ్ సింగ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) క్షేత్ర సంఘ చాలకులు. ఈ క్షేత్రంలో బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు ఉంటాయి. వారు రాష్ట్రీయ సేవాభారతి కార్యనిర్వాహకులు కూడా. సిద్ధినాథ్ పట్రూటు గ్రామవాసి. ఇది జార్ఖండ్‌లో రాంఘర్ జిల్లాలో ఉంది. ఆయన ‘కల్పతరు’ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నో గ్రామాలలో యువతకు ఉచితంగా వివిధ రంగాలకు సంబంధించి నైపుణ్య శిక్షణ, ఉపాథి కల్పనకు కృషి చేస్తున్నారు.
సిద్ధినాథ్ ఇంజనీర్. అలాంటిది ఆయనలోని అంకితభావం, ఆయన చేసిన నిరంతర కృషియే హఫువా గ్రామంలోని యువకుల జీవితాలను మార్చివేసింది.
రెండు దశాబ్దాల క్రితం హఫువా గ్రామం పేరు వింటే చాలు పోలీసులు, ఇంటలిజెన్స్ వర్గాల వారు ఉలిక్కిపడి అప్రమత్తమయ్యేవారు. రాంఘర్, రాంచీ పరిసరాలలో ఎక్కడ బ్యాంకు దొంగతనాలు జరిగినా, మహిళల మెడలో గొలుసు దొంగతనాలు జరిగినా ముందుగా పోలీసులు హఫువా గ్రామంలోనే వాకబు చేసేవారు. పిల్లలు బడికి వెళ్లడమనేదే లేదక్కడ. పెద్దవాళ్లు పొలాల్లోకి వెళ్లి పనిచేసేవారు కాదు. వాళ్ల పేరు మీదే ఎకరాల కొద్దీ భూములు ఉన్నప్పటికీ, తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోడానికి అక్కడి వారు చిన్నచిన్న విషయాలకే కొట్లాడుకునేవారు.
మొదట్లో వర్షపు నీటిని నిల్వ చేయడంపై (రెయిన్ వాటర్ స్టోరేజ్) పరిశోధన చేయడానికి సిద్ధినాథ్ హఫువా గ్రామాన్ని తరచుగా సందర్శిస్తుండేవారు. ఆ సమయంలో కొంతమంది తల్లిదండ్రులు యువకులైన తమ పిల్లల భవిత గురించి ఆయన వద్ద ఆందోళన వ్యక్తం చేసేవారు.
‘నేను హఫువా గ్రామాన్ని పర్యటించినప్పుడు అక్కడి యువకులని కలుస్తుండేవాడిని. వాళ్ల కళ్లు ఎప్పుడూ మెరుస్తూండేవి. వాళ్ల వద్ద అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కటే లోపం. చదువు. సరైన మార్గదర్శనం వారికి లేదు. నేను వారిని నా సంస్థకు (కల్పతరు) ఆహ్వానించాను. అక్కడి వారికి కొంత కాలం శిక్షణనిచ్చాను. త్వరలోనే వారు పెద్దపెద్ద యంత్రాలను అవలీలగా మరమ్మతులు చేసే సామర్థ్యాన్ని పొందారు’ అంటారు సిద్ధినాథ్.
గత పదిహేనేళ్లలో హఫువా గ్రామానికి చెందిన 150 మంది యువకులకు సిద్ధినాథ్ శిక్షణ నిచ్చారు. వారంతా ఇప్పుడు భారతదేశంలోని పలు కంపెనీలలో, గల్ఫ్ దేశాలలోను మంచి జీతాలతో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ల పిల్లలు పాఠశాలలకు వెళ్లి చదువుకుంటున్నారు. వాళ్ల కుటుంబాల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడ్డాయి.
అఫ్జల్ అలీ వయస్సు 38 సం.లు. సిద్ధినాథ్ సంస్థలోనే వెల్డర్‌గా శిక్షణ పొందాడు. ఇప్పుడతడు గుజరాత్‌లోని అదానీ గ్రూప్‌లో పని చేస్తూ నెలకి పదిహేను వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. తస్లీమ్ అన్సారీ ఫిట్టర్‌గా శిక్షణ పొంది రేణుకూట్‌లోని హిండాల్కో సంస్థలో పని చేస్తున్నాడు.
హఫువా యువకులను ప్రశంసిస్తూ సిద్ధినాథ్ ‘వారిలో మంచి ప్రతిభ, నైపుణ్యం, శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. ఎలాంటి సమస్యనైనా వారు ఇట్టే పరిష్కరించగలరు. నేను చేసిందల్లా వారిలోని శక్తిని సరైన దారిలో పెట్టడమే’ అని అన్నారు.
రెండు దశాబ్దాల నిరంతర కృషికి సిద్ధినాథ్‌కి దక్కిందేమిటో తెలుసా? హఫువా గ్రామ యువకులలో ఆయన పట్ల భక్త్భివం.
‘హఫువా గ్రామంలో గత పదేళ్లలో ఒక్క క్రిమినల్ కేసు కూడా నమోదు కాలేదు’ అంటారు జుబాయిర్ అహ్మద్. ఈయన ‘కల్పతరు’ ద్వారా సిద్ధినాథ్‌తో గత పనె్నండేళ్లుగా సన్నిహితంగా పని చేస్తున్నారు.
జానిసర్ అన్సారీ సరస్వతీ విద్యా మందిర్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. అతడికి సిద్ధినాథ్ దేవుడితో సమానం. ‘నా ఖర్చులన్నీ ఆయనే చూసుకుంటారు. నేను ఐఐటి ప్రవేశపరీక్షలో విజయం సాధించి మా గ్రామం నుంచి మొట్టమొదటి ఇంజనీర్‌ని కావాలనుకుంటున్నాను’ అని అన్నాడు.
లాల్ మహ్మద్ అన్సారీ ఒక భూస్వామి. అతని ఐదుగురు పిల్లలూ సిద్ధినాథ్ వద్ద చదువుకున్నారు. ‘దేశంలో మతపరమైన అసహనం పెరిగిపోతోందని కొందరు భావిస్తున్నప్పుడు సిద్ధినాథ్ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు’ అని అన్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ని ఒక మతోన్మాద సంస్థగా ప్రచారం చేసేవారికి సిద్ధినాథ్ ఉదాహరణ ఒక గట్టి సమాధానమని హఫువా గ్రామస్థులు అంటారు.
సిద్ధినాథ్ హఫువా గ్రామంలో రెండు దశాబ్దాల పాటు విశేషంగా కృషి చేశారు. అయినా వారి కృషి గురించి, వారి ద్వారా ఆ గ్రామంలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి ఏనాడూ, ఏ పత్రికలోనూ రాలేదు. ఇది వారి ప్రచార విముఖతకు నిదర్శనం. ఎందుకంటే ఆయన సంఘ సుశిక్షితుడైన స్వయంసేవక్.
విశేషమేమిటంటే ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉన్న హఫువా గ్రామంలో వారి మధ్యనే ఉంటూ గత రెండు దశాబ్దాలుగా సిద్ధినాథ్ పని చేస్తున్నా ఏనాడూ వారెవరినీ మతం మార్చుకొమ్మని అడగలేదు. అక్కడ ఒక్క మతమార్పిడి కూడా జరగలేదు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాలు మతసామరస్యానికి విఘాతం కలిగించవని చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ.
ఇదీ హిందుత్వం యొక్క విశిష్టత. సంఘ కార్యము యొక్క గొప్పదనం!