Others
చివ్వకు చేవనిచ్చిన ధీరుడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 4 February 2020
- కలవకొలను సూర్యనారాయణ మూర్తి 9849268659
ఎవ్వాడు జనకుని హృదయాన నెలకొన్న
కామన దీర్చ నిష్కాముడయ్యె
ఎవ్వాడి భారత యితిహాసపుటలలో
ఎనలేని వీరుడై యెసగి మెసగె
ఎవ్వాడు బోధించె నెలమితో విలువైన
ధర్మసూత్రములన్ని ధర్మజునకు
ఎవ్వాడు పట్టించి చివ్వలో కృష్ణుచే
చక్రంబు ప్రతిన చే జారజేసె
అతడె కురుపితాపహుడు, మహామహుండు
భీష్మ నామధేయంబున బిల్వబడును
ఆతనికి తిలాంజులు లిచ్చుఅలఘు దినము
అదియె భీష్మ ఏకాదశియనగ జెల్లు