Others
జ్ఞానశీలి పరశురాముని శిష్యుడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 4 February 2020
- రామడుగు వేంకటేశ్వర శర్మ 9866944287
తండ్రికై నిజజీవితమును త్యాగ మొనర్ప
భీష్మ ప్రతిజ్ఞ సల్పిన ఘనుండు
ఆయుధంబు ధరించనన్న కృష్ణు చక్ర
ధారిఁజేసిన గొప్ప శూరగుణుడు
ధర్మరాజుకు శాంతి ధర్మాలఁ గథలుగా
బోధించు గురుసత్తముల యశుండు
పారాయణ శ్రేష్ఠమై రాజిలగ విష్ణు
సాహస్రమందించు జ్ఞాన శీలి
తనచెప్పు చేతలందున మృత్యువును నిల్పు
కొన జాలిన మహత్తు ఁగని న నరుడు
పరశురాము గెల్చిన శిష్య పండితుండు
కురుకుల పితామహుని గాగవరలువాడు
అసలు పేరు దేవవత్రుండ తుల భక్తి
భీష్మ ఏకాదశీవేళ భీష్ము ఁదలతు