Others
ఇదేనా? అభివృద్ధి!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 3 February 2020
- గిరి ప్రసాద్ చెలమల్లు 9493388201
నన్ను ముక్కలు ముక్కలుగా
తెగనరికి
తెగనమ్మటమే అభివృద్ధా?
నాలో
పెరిగిన పచ్చని మొక్కల
నరికివేత
నా కళావిహినీతయే
అభివృద్ధా?
అరకలు దున్నాల్సిన నన్ను
నాగుండెల్లో విస్ఫోటనాల
ప్రకంపనలతో
బహుళ అంతస్థుల
నిర్మాణాలే అభివృద్ధా?
నాలోని ఖనిజం
దాచిన రక్షించిన ఆదివాసి
తరమేత అభివృద్ధా?
సాంస్కృతిక విధ్వంసం
నిరాఘాటంగా నన్ను
చెరపడుతున్న పెట్టుబడే
అభివృద్ధా?
నాలోని పంట
మీ నోటిక్కాడి బువ్వ
బువ్వలేనిది
మనుగడెలా?
నన్ను నాలా
ఉండనీయక
సాగటమే అభివృద్ధా?
నవనాగరిక
పెట్టుబడా ?
నువ్వు నాలో కలిసేదాకా
నీవు విరజిమ్మే విషమే
అభివృద్ధా?