Others

బుద్ధి కుశలత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడ రామనామం వినపడుతుంటుందో అక్కడ అర్థనిమీలిత నేత్రుడై శిరస్సు వంచి చేతులు జోడించి రామనామంలో పారవశ్యం చెందుతూ నేటికీ దర్శనమిచ్చే యోధానుయోధుడు మన హనుమంతుడు. ఆ అంజనీసుతుని జీవితంలోని ప్రతి ఘట్టమూ చూస్తే అభ్యాసం చేసి నేర్చుకోవలసిన పాఠ్యభాగమే అనిపిస్తోంది.
హనుమంతుని చిలిపిచేష్టలే కాదు ఆయనలో తెలుసుకోవాలన్న జిజ్ఞాస మనకు చిన్ననాడే కనబడుతుంది. చిరుప్రాయంలో అమ్మ ఆడుకోమని చెబితే తనకు ఆకలి వేస్తోందని చెట్టుకున్న పండుకాక ఆకాశంలో దగద్ధగాయ మానంగా వెలిగే సూర్యుని పండుగా భావించుకుని సూర్యమండలం వైపు ఎగిరాడు అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఆకలి వేస్తే ఎదురుగా ఉన్నదానిని కదా చూస్తారు. కానీ హనుమంతుడు సూర్యమండలం వైపు చూశాడు అంటే నీ దృష్టి ఎపుడూ ఉన్నతంగా ఉండాలని ఆనాడే హనుమంతుడు హితబోధ చేశాడు.
పెరిగి పెద్దయన తరువాత బలపరాక్రమాదులు కాదు ధర్మమే శరణ్యం అని ఉండాలి. ధర్మాన్ని ఆశ్రయంచినవారి దగ్గరకు దేవుడే వస్తాడన్న మాట నమ్మి అమిత బలశాలి అయన వాలిని దూరం చేసుకొని ధర్మమూర్తి అయన సుగ్రీవుని తోనే ఉన్నాడు. దేశదేశాలు కూడా తిరిగాడు కదా. (వాలికి భయపడి పరుగెత్తినా కూడా ప్రపంచ మంతా తిరిగాడు కదా) ఆయన సీతమ్మ అనే్వషణలో తనకు అంతా తెలుసుకదా అని అనుకుని ఆరంభం చేయడు. తన ప్రభువు సుగ్రీవుని ఆజ్ఞగా అనుకొంటాడు. తన ఇష్టదైవం రాముని ప్రేరణతో రామాజ్ఞగా మొదలు పెడతాడు. పైగా రామ మంత్రాన్ని జైశ్రీరామ్ అనుకొంటూ సముద్రాన్ని లంఘిస్తాడు. సముద్ర లంఘనంలో కూడా ఎన్నో విశేషాలు చివరకు సీతమ్మను దర్శించి రావణునికి బుద్ధి చెప్పి రాముని దగ్గరకు వచ్చి చూశాను సీతమ్మను అని వార్తను చేరవేయడంలో కూడా బుద్ధి సూక్ష్మం ఉండి తీరాలి అని చెబుతాడు.

- చివుకుల రామ మోహన్