Others

భక్తుడు.. భక్తిమార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతున్ని చేరడానికి వున్న అనేకానేక దారులలో భక్తి ఒకటి. భక్త్భివనలో పూజ, నామస్తోత్రం, జపం లాంటివిసాధనాలుగా ఉంటాయ. కొందరు భక్తులు కీర్తనలు ఆలపిస్తూ వారికిష్టమైన పాటలు పాడుతూ భగవంతుని గొప్పతనాన్ని స్మరిస్తూకూడా భక్తిని వెలువరిస్తారు. ఆ భగవంతుని గూర్చిన పాటల్లోనే వారు తాద్యాత్మం చెందే వారు ఉన్నారు. భగవంతుడిని ఏది కోరినా దానిని ఇస్తాడు. కాకపోతే ఆ కోరే ఫలం మనకు శుభకరమా లేదా అనేది భగవంతుడే నిర్ణయం చి మరీ ఇస్తాడు. గీతలో భగవానుడు నీవు నీ కర్తవ్యాన్ని చేయ ఫలితాన్ని నాకు వదులు, నీ యోగక్షేమాలు నేను చూసుకొంటాను అని అంటారు కదా. కనుక భగవంతుడిని ఏదైనా కోరవచ్చు. ఆ కోరిక సక్రమమైనదైతే తప్పక నెరవేరుతుంది అంటారు పెద్దలు.
కానీ కొందరు భక్తులు మొక్కులు మొక్కుతారు. ఈ కోరిక తీరితేఇది చేస్తాము అని వారికీ ఆ కోరికలు తీరుతాయ. ఆ మొక్కు లు తీరుస్తారు. అంటే ఆ మొక్కులో కూడా ఏదో నిగూఢమైన అర్థం ఉండి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోగలగాలి కానీ మొక్కితే దేవుడు తీరుస్తాడా? భగవంతుడు ఏమన్నా వ్యాపారా అని వితండ వాదం చేయనక్కర్లేదు. ఉదా నేను పదిమందికి అన్నదానం చేస్తాను. నాకు ఉద్యోగం వస్తే అని ఎవరైనా కోరుకుంటే అది మంచి పనే కనుక భగవంతుడు వారికి ఉద్యోగం వచ్చేట్టు చేస్తాడు. వారు పదిమందికి అన్నదానం చేస్తారు. దానం చేయడం అనే అలవాటుకు వారు సన్నిహితం అవడమనేది మంచి కర్మలు చేసినట్టు అవుతుంది కదా. గొంతెత్తమ్మ కోరికలు కోరినవారికి భగవంతుడు ఎలానూ తీర్చడు. కనుక మొక్కు లు మొక్కుకోవడంలో తప్పు కనిపిం చదని కొందరు చెబుతారు.
ఆయన భగవంతుడు సకల సృష్టికర్త. చీమ నుండి బ్రహ్మాండంవరకు ఆయనచే సృష్టించబడినవే కదా. అణువునుండి ఆకాశంవరకు అన్నిటా అంతటా ఆయన వ్యాపించి వుంటా డు. సర్వం ఆయనే సృష్టించి ఉన్నాడు కనుక ఆయన సృష్టిలోనిదే మనం ఆయనకు సమర్పిస్తున్నమన్న జ్ఞానం ఉంటే చాలు. ఏ కోరిక కోరినా దాన్ని ఫలితం ఏమివ్వాలో భగవంతుడే నిర్ణయస్తాడు. కనుక మనం భగవంతుడు దగ్గరకు వెళ్లమని ఏభక్తి మార్గంలో నైనా భగవంతుడిని చేరుకోమని ఎవరికైనా సలహా ఇవ్వాలి కానీ కోరికలతో వెళ్లకూడదు అని చెప్పకూడదు. అందుకే సాయబాబా నీవు దేనినైనా కోరుకోండి దాన్ని నేను తీరుస్తాను అంటాడు. అంటే ముందు భౌతికావసరాలు తీరితే వారే ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారని ఈ కోరికలు కూడా భగవంతుని సన్నిధానానికి రావడానికి ఒక మార్గమని చెబుతారు. ఎక్కడైతే శాంతి, ప్రేమలు వుంటాయో అక్కడ కచ్చితంగా భగవంతుడు వుంటాడు. భగవంతుని తత్వాన్ని తెలుసుకొంటూ ముందుకు పోయనవారికి అద్భుతాలు కనిపిస్తాయ. భగవంతుడనే వాడు అలవైకుంఠ పురంలోనే కాదు గుండెగదిలో కూడా ఉంటాడన్న నమ్మకం ఏర్పడుతుంది. దానికి భక్తుడు తన్ను తాను భగవంతుని చేతిలోని సృష్టిగా తెలుసుకోవాలి. అంటే మనల్ని మనం పరిపూర్ణంగా ఆ పరమాత్మకి అర్పించుకోవడమే. అంటే ఓ భగవంతుడా నీవే అన్నింటికీ కారణం. నేను చేస్తున్నా అనుకునే పనులన్నీ నీవు చేయస్తున్నవే. కర్త కర్మ క్రియ నీవే అని అనుకొన్ననాడు సర్వమూ ఈశ్వరార్పణం చేయడం సులభమవుతుంది. వారు వారి మనసులోనే దైవాన్నిదర్శించుకోగలరు. అలాంటి వారి హృదయమే ఆలయం అవుతుంది. సాక్షాత్తు ఆ దేవదేవుడు ఆ హృదయంలో కొలువై వుంటాడు. అప్పుడిక భక్తుడు భగవంతుడి కొరకు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరమూ ఉండదు. భగవంతుడు ఎట్లా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు అన్న మీమాంస అక్కర్లేదు.

- చివుకుల రామమోహన్