Others

శంకరాత్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ సారి గౌతముని ఆశ్రమంలో విందు జరుగుతోంది. అక్కడికి ఎక్కడెక్కడినుంచో మునులు, సాధువులు, సత్పురుషులు వచ్చారు. గౌతముని శిష్యగణం అంతా ఆ విందులో పాల్గొంటున్నారు. అక్కడికి గౌతముని శిష్యుడు శంకరాత్మ వచ్చాడు. అతడు చాలా ఉన్నత్తుడుగా చూచేవారికి కనిపించాడు. ఏదో లోకంలో ఉన్నట్టు చాలా ఆనందంగా ఉన్నాడు. ఉన్నట్టుండి ఎంతో దుఃఖంతోకూడా ఉన్నాడు. అతడు ఇక్కడ అక్కడ అనే తేడాల్లేకుండా అంతటా తిరుగుతూ ఏదో తనలో తాను మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు.
ఆ శంకరాత్మను పిలిచి గౌతముడు భోజనం పెట్టాడు. అతనికి గౌతముడే స్వయంగా పరిచర్యలు చేశాడు. గౌతమునికి నమస్కరిస్తూనే శంకరాత్మ గౌతముడు పెట్టిన అన్నాన్నంతా తినివేశాడు. చందనతాంబూలాలను స్వీకరించాడు.
దీనిని చూసిన ఒకరు శంకరాత్మను ఆటపట్టించాలనుకున్నారు. వారు తినిపారేసిన పండుతొక్కలను పెట్టారు. అవి ఎంతో ఇష్టంగా శంకరాత్మ భుజించాడు. పెట్టినవారు ఆశ్చర్యపోయారు. పరిశుభ్రమైన దుస్తులు ధరించిన శంకరాత్మ అక్కడే ఉన్న మడుగులో మునిగి బురదనంతా తన ఒంటికి పూసుకొన్నాడు. అపుడు కూడా అదే ఆనందంతో తిరుగుతున్నాడు. మునికన్యలుపిలిచి గోమయమును చేతికిచ్చి తినుమని చెప్పారు. దానిని కూడా ఇష్టంగానే శంకరాత్మ స్వీకరించాడు. ఏ భేదంలేకుడా నిప్పును, నీటిని కూడా మ్రింగివేశాడు. రాళ్లను కూడా పెట్టగా వాటిని కూడాశంకరాత్మ అంతే ప్రీతి పూర్వకంగా తిన్నాడు.
ఇట్లా ఏ భేదం లేకుండా వ్యవహరించే శంకరాత్మను గౌతముని భార్య అహల్య పిలిచింది. ఆమె భోజనమును పెట్టగా తిన్నాడు.
అపుడే చేత పాత పాదరక్షలను పట్టుకుని అరుస్తూ చండాలునిలాగా తిరుతుతున్నాడు. ఒకసారి పెద్దగా శివశంభో అని అరుస్తూ మరొకసారి తనలో తాను గొణుగుతూ ఇలా తిరుగు శంకరాత్మ దిగంబరుడై తిరుగుతున్నాడు.
వృషపర్వుడు గౌతముని ఆశ్రమానికి వచ్చాడు. ఆ వృషపర్వుని ఎదుటికి శంకరాత్మ దిగంబరుడై చండాలునిగా వెళ్లి నిల్చున్నాడు. వృషపర్వుడు అతనిని చూసి విసుగుచెంది కోపం తెచ్చుకుని తన చేతిలో ఉన్న ఖడ్గంతో శంకరాత్మ శిరస్సును ఖండించివేసాడు. రెండు తునకలుగా శంకరాత్మ పడిపోయాడు. అది చూసి గౌతముడు చాలా బాధపడ్డాడు. వారిని ఏ తప్పు చేయని ఈ శంకరాత్మను సంహరించవలసిన అవసరం ఏమొచ్చింది. శంకరాత్మ లేకుంటే నేను ఎలా జీవించగలను అని కోపోద్రిక్తుడై వృషపర్వుని గౌతముడు అడిగాడు. గౌతముని కోపాన్ని చూసి అక్కడికి వచ్చిన శుక్రాచార్యుడు ఆగుము గౌతమా! నీకు కోపం తెచ్చుకోకు. నేను ఈ శంకరాత్మను జీవింప చేస్తాను అన్నాడు.
కానీ ఆ మాటలు వినకుండానే గౌతముడు ప్రాణాలను వదిలేశాడు. చాలామంది శివభక్తులు ఆ గౌతముని చూసి ప్రాణాలను వదిలేశాడు. శుక్రాచార్యుడు దీనిని భరించలేక యోగంతో ప్రాణాలను దూరం చేసుకొన్నాడు. అప్పటిదాకా నవ్వులతో కళ్యాణవేదికలాగా ఉన్న గౌతముని ఆశ్రమం తృటికాలంలో శ్మశాన భూమిని తలపించింది.
ఈ సంగతి అక్కడికి వచ్చిన వీరభద్రుడు చూశాడు. జరగకూడని విషయం జరిగిపోతోంది. వెంటనే నేను శివునకు చెప్పాలని కైలాసానికి వెళ్లాడు
శివేచ్ఛ లేనిదే ఏదైనా జరుగుతుందా. కానీ వీరభద్రుడు చెప్పిన విషయంవిని ‘అయ్యో! నా ప్రియతముడు గౌతముడు నిర్జీవుడు అయ్యాడా’ అంటూ గౌతముని ఆశ్రమానికి వెళ్లడానికి నందిపై ఎక్కాడు. వెంటనే ఈ విషయం తెలుసుకొన్న వైకుంఠాధిపతి తన గరుడుడుని పిలిచి తాను బయలుదేరాడు. సర్వదేవతలకూ గౌతముని విషయం తెలిసింది. శంకరుడు, మహావిష్ణువు కూడా అక్కడికి వెళ్తున్నారన్న విషయం విన్నారు. వారంతా వారి వారి వాహనాలను అధిరోహించి బ్రహ్మాదిదేవతలంతా గౌతముని ఆశ్రమానికి బయలుదేరారు పరమశివుడు గౌతముని ఆశ్రమం చేరి అక్కడ ప్రాణం లేని గౌతముని శరీరాన్ని చూసి ఆవేదన చెంది ‘ఓ గౌతమా! ఇక నీ చెంత నిలిచాను’ అన్నాడు పరమశివుడు. గౌతముడు లేచి నిల్చున్నాడు. కైలాసనాథుడిని చూసి చేతులెత్తినమస్కరించాడు. పక్కనే ఉన్న వికుంఠుని చూసి ఆయనకు నమస్కారం చేశాడు.
గౌతమునికి స్వస్థత కలిగేట్టుగా శివుడు గౌతమునితో మాట్లాడాడు. కానీ గౌతమునిలో వేదన చల్లారలేదు. ‘నాయనా! గౌతమా! దుఃఖాన్ని వీడు, నీవు ఏది కోరుకున్నా నేను కాదనలేదుకదా! ఎందుకీ వేదన! నీకు ఏమి కావాలో కోరుకో నేను ఇస్తాను’ అన్నాడు.
గౌతముడు కళ్లుతుడుచుకుని ‘దేవాదిదేవా! పరమశివా! కపర్థీ! నీలలోచనా! నీలకంఠా! పినాకపాణి! విశ్వాత్మా! అనాథ రక్షకా! భక్తవత్సలా! నాకు నీ దర్శనం అయిన తరువాత ఇంకా ఏమి కావాలని ఉంటుంది? నేను నీ దర్శనం తప్ప మరేమీవద్దు. కానీ .. ’’ గౌతముడు వౌనం వహించాడు.
‘గౌతమా! నిస్సంకోచంగా చెప్పు. నీకు ఏ వరం కావాలన్నా నేను ఇస్తాను’అన్నాడు శంకరుడు. ‘కైలాసవాసా! నీకు తెలియకుండా ఏమీ జరగదు. నీ ఇచ్ఛలేనిదే అణువుకూడా కదలలేదు. కానీ నీవెందుకు ఇలా ఆజ్ఞ ఇచ్చావో నాకు తెలియడం లేదు. వీనిని చూడుము. ఇతనికి స్వపర భేదాలులేవు.్ఫలాన రుచి పట్ల ఆసక్తి కనబర్చడు. శివజ్ఞానైన స్వరూపుడితడు. పరమానంద నిర్భరుడు. గోమయానికి, పంచభక్ష్య పరమాన్నానికి తేడాలెంచని అమాయకుడు. ఇతని శిరస్సును వృషపర్వుడు ఖండించివేశాడు. ఇది తగునా! నేను శంకరాత్మలేనిదే నిలువలేను...’’అంటూ గౌతముడు మూర్ఛిల్లపోయాడు.
శంకరుడు చిరునవ్వుతో ‘గౌతమా! ఆవేదన మానుము. ఈ శంకరాత్మ సామాన్యుడుకాడు. రాబోయే రోజుల్లో ఇతడే కపిశ్రేష్ఠుడుగా పూజలందుకుంటాడు. బ్రహ్మగా వర్థిల్లుతాడు ’అని చెబుతూ హరిని చూసి స్వాంశమగు వాయువుచే శంకరాత్మ దేహాన్ని ఆవేశించాడు.అంతే శంకరాత్మ హరిరూపుడుగా వాయుపుత్రుడుగా కపిశ్రేష్ఠుడుగా మారిపోయాడు. గౌతమునికి ఆనందం వేసింది. పరమశివుడు ఇంకా ఇలా చెప్పాడు. ‘గౌతమా! ఈ కపి కల్పాంతము వరకు కామరూపిగా ఉంటాడు. రామభక్తుడుగా పేరుపొందుతాడు. పూజిత విగ్రహుడుగా పూజించబడుతాడు. ఇక నీకు దుఃఖము దూరమైనట్లేగదా’అని చిరునవ్వు నవ్వాడు. అదిగోఆ శంకరాత్మనే నేడు ఆంజనేయునిగా, కపివరునిగా రామబంటుగా పూజలందుకుంటున్నాడు.

- రాయసం లక్ష్మి