AADIVAVRAM - Others
తస్మాత్ జాగ్రత్త!!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 12 January 2020
-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505
అమ్మ గొప్పది...
అమ్మలో కమ్మనైన అమ్మతనం ఇంకా గొప్పది...
వృద్ధికి మూలాధారం అమ్మ..
చెట్టుకి మూలాధారం వేరు.. తల్లి వేరు..
గుండె గొంతుకలోకొచ్చి అమ్మా అన్నా...
పెదవంచు నుంచి అమ్మా అన్నా..
ఆమె రక్తం పంచుకున్న నీవు
ఆమెపై మమతలు పెంచుకున్నా
నీ అవసరానికి ఆమెనొక
సాధనంగా ఎంచుకున్నా
మమతలుడుగని అమ్మ.. వయసుడిగిన అమ్మ..
ఆద్యంతం.. నిన్నాసాంతం.. అర్రులు చాస్తూ
అక్కున చేర్చుకునేదే అమ్మ...
ఆకులు రాలినా.. తాను మోడై మిగిలినా..
ఒకప్పుడు లతలకు లవణాలందించిన
వేరు తీరు.. తల్లడిల్లితే చలించేది..
చేయందించేది నీ తల్లి తీరు
అమ్మ చిరు ఆశల ఏపుగ ఎదిగిన మీరు
అమ్మతనాన్ని.. కమ్మదనాన్ని.. వంచించకండి..
అదే జరిగితే.. మీకు జరిగేది అదే తీరు.