AADIVAVRAM - Others

బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాడిని మెడ మీది కెత్తుకొని అద్దంలో చూస్తే
వాడి తల కింద నేనున్నట్లుగా అనిపిస్తుంది
వాడు నా తలదనే్న వాడిలా కనిపిస్తాడు
వాడిని నేను ఎత్తుకుంటాను
వాడు నన్ను హత్తుకుంటాడు
ఆ హాయి దేహాన్ని దాటి
నా మనసును తడిమేస్తుంది
నిదుర ముంచుకొచ్చినపుడు
నా భుజం వాడి తలగడౌతుంది
ఆ పాల బుగ్గల పసిడి కళలు
నా కళ్లు చాలని అందాలు
ఆ నయనాల నిగనిగలు నా పంచప్రాణాలు
వాడి ముఖం జాబిల్లి
వాడి నవ్వు పాలవెల్లి
వాడు నా గడపకు నవ్వుల తోరణం
నా యింటికి రత్నాల ఆభరణం
ఉదయం నను సాగనంపే ఆ నవ్వు
సాయంత్రం దాకా నా పనికి కావలసిన
శక్తి నింపుతుంది
ఇంటికి రాగానే స్వాగతించే ఆ నవ్వు
రోజంతా పడిన శ్రమను దూరం చేస్తుంది
ఒక్క మాటలో చెప్పాలంటే వాడు
నా ‘పవర్ బ్యాంక్’
వాడు నా ఆనందానికి బీమా
నా ఆరోగ్యానికి ధీమా
వాడి ఒంట్లో నలత నా మనసుకు కలత
వాడి కంట్లో నీరు నా గుండెల్లో యేరు
మాది కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు
అంతకంటే ఎక్కువ
ఒక్కోసారి ఉన్నట్లుండి వాడు ఊరెళ్లిపోతాడు
నా గుండె గుబులు గిన్నౌతుంది
నా నరాలు దిగులు కాలువలౌతాయి
వాడి అల్లరి వినబడక నా ఇల్లు మూగబోతుంది
వాడి నవ్వు కనబడక
నా మనసు మోడువారుతుంది
వాడు నా కూతురి బిడ్డ
వాడికి ఇష్టం ఉన్నా లేకున్నా
వాడి ఇంటికి వాడు వెళ్లాల్సిందే
మా శరీరాలు దూరం కావచ్చు కానీ
మా బంధం మాత్రం విడిపోదు
మళ్లీ వాడెప్పుడు వచ్చినా చప్పున
నాపై దూకేస్తాడు.

-చిరమన వెంకట రమణయ్య 9441380336