AADIVAVRAM - Others

మేఘాలయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నా ఘటం ఉన్నన్నాళ్లు.. ఈ ఘట్టం ఇలా సాగవలసిందే.. మీ గొంతులెంత మోగుతున్నా.. మీ పెదవులు దాటటం మాత్రమే జరుగుతుంది.. కానీ చెవుల్ని దూసుకుపోలేవు, ననే్నమాత్రం శాసించలేవు.. ననె్నంత మాత్రం మార్చలేవు.. నేను ఏ విషయంలోనైనా నిర్ణయం చేస్తే పూర్వాపరాలు ఆలోచించి మాత్రమే చేయడం జరుగుతుంది. ఇక ఈ విషయంలో నా మాటే శాసనం.. అంటూ పరంధామయ్యగారు తీర్మానించి.. ఫాంహౌస్ వైపుగా సాగిపోయారు కారులో.. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నిల్చుండిపోయారు పరంధామయ్య అర్ధాంగి వర్థని, కొడుకు సుదర్శన్, వాడి భార్య సుమంగళీనూ.
కారు నల్లని తారురోడ్డుపై దూసుకుపోతోంది.. పరంధామయ్యలో ఆలోచనలు దూకి పడ్తున్నయ్.. లోయలోకి పడే జలపాతంలా.. ఫెళఫెళ రాలే వాన చినుకుల్లా.. చినుకు చినుకు చేరి ఉప్పెనగా మారింది.
కుర్రకుంక ఆ సుదర్శన్.. నిన్న కాక మొన్న కన్ను తెరిచిన ఆ వెధవ.. నన్ను నా స్వతంత్ర భావాల్ని.. ఆశయాల్ని, అనుభవాల్ని ప్రశ్నిస్తూ నిలదీస్తాడా వాడి భార్య, నా భార్య వత్తాసు తీసుకుని. నా ముందరనా వాడి కుప్పిగంతులు. నా అనుభవమంత లేదు వాడి వయసు. ఆఁయ్.. అంటూ గాండ్రిస్తూనే ఉంది ఇంకా పరంధామయ్యలో ఆవేశం.. గట్లు తెంచుకు విరిగిపడ్తూనే ఉంది సముద్రంలోని కల్లోలం.
పరంధామయ్య ఎన్నో మైలురాళ్లు దాటుకుని ఫాంహౌస్ చేరుకున్నాడు. అక్కడే తనకి విశ్రాంతి, మనశ్శాంతి. పరంధామయ్య మత్తుగా కళ్లు మూసుకున్నాడు పక్కపైన. ఎప్పుడు మెలకువ వస్తుందన్నది అతని మనసుకి ఎరుగని ప్రశ్న.. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఎవరో.. ఏవో తలపులు.. తనని గతంలోకి నెట్టుకెళ్తున్నయ్ ఆ రూపం.. ఆ అనుభవం.. ఆ పరిచయం.. తొలకరి జల్లులా.. ఆశల విల్లులా.. ఏవో తీపి జ్ఞాపకాలలోకి లాక్కెళ్తున్నయ్-
మేఘాలయ.. ఆ పేరు వినగానే ఎతె్తైన కొండలు, లోయలూ.. పచ్చని మైదానాలూ.. నల్లని మేఘాలు కాలంతో పనిలేకుండా ఏడాది పొడవునా వాన చినుకులతో అలరారే మాసిన్రమ్, చిరపుంజి ప్రాంతాలు మబ్బులతోనూ చిటపట చినుకులతోనూ చెలిమి చేసే ఖాసీ తెగ గుర్తొస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన ఆ కొండ ప్రాంతంలో చూడదగ్గ ప్రకృతి వింతలు ఎన్నో.. చినుకు చినుకుకో చిత్రం. అక్కడి నుంచి చినుకుకి పెట్టింది పేరయిన చిరపుంజికి బయలుదేరాం. ఆ రోడ్డులో ప్రయాణిస్తున్నంత సేపూ చూపు మరల్చకుండా అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించాం. పచ్చని తివాచీలు కప్పుకున్న పర్వత శ్రేణుల్ని ఎవరో తరుముకు వస్తున్నట్లుగా కొండల్లో నుంచి లోయల్లోకి జాలువారే జలపాతాల్ని.. మాతోపాటే ప్రయాణిస్తున్న మబ్బుల గుంపుల్నీ.. చూస్తుంటే కలిగే అనుభూతిని మించిన అనుభూతి అనుభవం అక్కడ తనతో కలిగిన పరిచయం-
వ్యాపారం పని మీద వెళ్లిన నేను ఆ ప్రకృతి కాంతని మించి తను పంచిన ప్రేమానురాగాల.. తనతో సరాగాల పయనం మరువలేనిది, మరువరానిది. తనతో నా పరిచయం మొదలు నా పయనం, పరిణయమెరుగని నా ప్రణయం వర్ధనికి తెలుసు. అందరిలా నేను తల్లిదండ్రుల వత్తిళ్లకు, వంశ ప్రతిష్ఠలకు తలవంచి వర్ధని మెడలో తాళికట్టి గృహస్థునైనాను. హృదయంలో తిష్టవేసిన మొనాలిసాని చేపట్టాను. ఇద్దరికీ ఇబ్బంది లేకుండా ఇంతవరకు కాలం గడిచింది.
ఇప్పుడు ఈ విషయం సుదర్శన్, సుమంగళీల ఆరాతో, అనే్వషణతో.. వర్ధని సహకారంతో నిగ్గు తేలింది. నన్ను నిలదీసింది.. ఈ చరమాంకంలో పరంధామయ్య ఎటు మొగ్గాలి.. ఎవరిని ఒగ్గాలి.. ఇదీ మధనం.
ఇలా చిక్కువిడని సమస్యల నుంచి విముక్తి ఎలా? నిద్ర మాత్రలు మింగినా నిద్ర పట్టని నిశి రాత్రి - మొనాలిసా అనునయిస్తోంది.. తను తన దారిని వెళ్తానంటుంది - ఇంత దూరం తనతో ప్రయాణించి ఇప్పుడు చెలిమి ఎలా వీడడం, చేయి ఎలా విడవడం -
అంధకారం .. చుట్టూరా నిబిడాంధకారం చీకట్లు కమ్ముకొస్తున్నాయ్. పవర్ మిణుకు మిణుకు మంటోంది. ఈ పవర్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియట్లేదు. దుకాణం కట్టేయాలి.. ఆడిట్ జరుగుతోంది.. ఎంత సంపాయించావ్.. ఎంత ఖర్చు చేశావ్.. ఎవరికి ఎంతిచ్చావ్.. సమంగా చేశావా.. ఇలా బుర్ర తొలిచేస్తున్నారు ప్రశ్నలతో నా అనుకున్న నా వాళ్లు.
ఇది నా స్వార్జితం.. నా చెమటతో, నా తెలివితో.. బిగ్గరగా అరచి చెప్పాలని వుంది.. కానీ గొంతు దాటి రావట్లేదు మాట. అయినా మాటకు, మూటకు కుదరటం లేదు.. సమాధానాలు సరిపోవటం లేదు. తచ్చాటలు.. తర్జనభర్జనలు.. ఇలా సాగిపోతోంది చర్చ-
చిరాకులు, పరాకులు.. అప్పుడప్పుడు ఆవేశం అదుపు తప్పుతోంది.. అంతలో తమాయించుకోవటం, సంభాళించుకోవడం.. సర్ది చెప్పుకోవడం.. ఎంతవరకు ఈ విధానం.. ఈ నిధానం.
ఏదో పాట.. చిన్నప్పుడు విన్న పాట.. తనువుకెన్ని గాయాలైనా మాసిపోవు నేలాగైనా.. మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా.. ఆడవాళ్లు ఆడుకునే ఆటబొమ్మ ఈ మగవాడు.. ఆడుకున్నా ఫరవాలేదు.. అంటూ వినవస్తోంది. నా ఈ సమస్య పంటి సందు వక్క తుంపులా.. కంటి నంటిన నలకలా గుండెని కలచివేస్తోంది. మనటమా.. మరణించటమా.. ఎదిరించి జీవించటమా..
అసలు అవసరానికి మించి ఆదాయమెందుకు, అది దాయడమెందుకు.. సంబంధిత బాంధవ్యాల ఈ ఆరాలెందుకు.. వ్యర్థపు ఈ సంజాయిషీలెందుకు.. ఏ పూటకాపూట సంపాయించి గడుపుకుంటే, గుండెకి ఎంత సలుపు.. ఈ కంటితుడుపు.. ఎందుకు? కొట్టు కట్టేయాలి.. వెధవది ఈ కొంపకి కరువో కాలమో అన్నట్టు తొమ్మిది ద్వారాలు పెట్టాడు. ఏదో ఓ ద్వారం నుంచి తప్పుకోవాలి.
పక్క మీద అటుఇటు పొర్లించి చూసింది మొనాలిసా. పొద్దునే్న చాయ్‌తో కుదుపుతోంది పరంధామయ్యని. ఇంకెక్కడి పరంధామయ్య.. కళ్లు తెర్చే ఉన్నాయ్. కానీ కాంతి లేదు.. శరీరానికి వేరైంది ఆత్మ.. అయినా శాంతి లేదు.
ఫాంహౌస్ చుట్టూరా పరిభ్రమిస్తూనే ఉంది పరంధామయ్య ఆత్మ ఆవేదనతో-
పరంధామయ్య చావు వార్త వర్ధనమ్మ హృదయంలో దావానలమయ్యింది.
అయినా పరంధామయ్య శరీరాన్ని ఆవహించిన అనలం అగ్నిప్రీతి చేయకుంటుందా-
శారీరికంగా పరంధామయ్య జీవితం అంతిమ యాత్రతో ముగిసిపోయింది. ఆయన చరమాంకం ఫాంహౌస్‌లోనే సమాధి అయింది. పరంధామయ్య ఆత్మ మూడవ రోజున మురిసింది - తన నిష్క్రమణతో కనువిప్పైన వర్ధని.. మొనాలీసాని అక్కున చేర్చుకుంది. మొనాలిసాకి.. తనకి బంధమైన అనుబంధమైన మేఘా-లయ.. కవలల్ని తనయుడు సుదర్శన్ తోబుట్టువులుగా ఆమోదించి కర్తృత్వం వహించాడు తన స్థానంలో - మేఘాలయ సాక్షిగా.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505