Others

వీర నారీమణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడది ఎంత కైన సరి ఆగ్రహకీలల కన్గవందునన్
బాడలమే సృజించదగు స్వైర విహారముసల్పి పోరునన్
పోడిమి వైరి వీరచయ మూర్థ విఖండము చేయగల్గదే
ఓడిన శత్రుభూపతుల కుచ్చు బిగించదె! రూపుమాపగన్

వయసా యిర్వదిమూడు వర్షములు దుర్వారంబు ధైర్యంబు అ
వ్యయవౌ బాహుబలంబు చేకొనినచో పోలారు ఖడ్గమ్మునే
భయదాకార మహత్ ప్రచంకయె పీష్వా వంశ సంజాత భ
వ్యయశంబున్ గనె పోరి ఆంగ్లులపయిన్ స్వారాజ్యమే ధ్యేయమై

అరయన్ ప్రాణముకన్న మానమతిముఖ్యంబీ పునితావనిన్
విరియన్ బూచినమల్లె యవిదకున్ వీరాంగణాశ్రేణికిన్
దుమందున్‌క్షతగాత్ర యైపడియు నుద్యాతించు ఝాన్సీయికన్
పరులీబొందిని ముట్టకూడదనివే వహ్నిన్ బచలీలగా

వీరనారీమణీ పీహ్యా వంశన్యయా
ఘోరయుద్ధంబునన్ క్రూరులౌ వైరులన్
సారవీరంబునన్ జంపితే నీచవౌ
పారతంత్య్రంబునే పాతరన్ వెట్టగా

- కలవకొలను సూర్యనారాయణ