వినమరుగైన

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. స్థితిపరులుగాగ నెందరో చేరవచ్చె
దరది కొరవడి నంతటఁదరలి పోదు
రెంత చోద్యమ్ము బంధమ్ము లంత హీన
మా? మనుజలక్ష్మణమ్మిదా? రామ రామ
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

భావం: స్థితిపరులై యున్న సమయంలో బంధుత్వాలు కలుపుకుంటూ ఎంతోమంది చుట్టూ చేరుతుంటారు. ఆ స్థితి కొరవడిన పక్షంలో దూరమై పోతుంటారు. ఇంతహీనమైన బంధాలా? రామ రామ ! ఇది మనుష్యుల లక్షణం కాదని ప్రబోధించవయ్యా కర్మసాక్షివైన ఓ సూర్యదేవా!
తే.గీ. కనుల ముందుర ఘోరాలు కానఁ బోరే
చోద్యమునుఁ జూచు చందాన ఁ జూతురేల?
మానవత్వమ్ము మరచిన మనుజులార!
చూడుమో కర్మసాక్షి!యో సూర్యదేవ!

భావం: కళ్లముందు ఘోరాలు జరుగుతున్నా చూసి కూడా చూడనట్లు పోతుంటారు. చాలా సందర్భాలలో అట్టి ఘోరాలను ఏదో వింత చూస్తున్నట్లు గా చూస్తుంటారే తప్పఇంకేమీ చేయరు. మానవత్వాన్ని మరచి ప్రవర్తింప రాదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి తెలియజేయుమయ్యా భాస్కర ప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262