AADIVAVRAM - Others

‘రంగుల పండుగ’లో సోయగాల విందు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరాన్ని ‘కాన్వాసు’గా భావించే తత్వం మానవ సమాజాల్లో అనాదిగా కనిపిస్తోంది. అందుకే అలంకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆదిమ సమాజాల్లో ఇప్పటికీ అనేక రకాలుగా తమ శరీరాలను ‘రంగుల’తో అలంకరించుకోవడాన్ని గమనించవచ్చు. ముఖ్యంగా ‘ముఖం’పై వివిధ రంగులను పూసుకుని, రాసుకుని సామూహిక ఉత్సవాలకు, సమష్టి పండుగలకు హాజరవడం చూడవచ్చు. మహానగరాల్లో ‘బాడీ పెయింటింగ్’ సంస్కృతి కూడా కనిపిస్తున్నది.
ఈ ‘తత్వం’, ‘పచ్చబొట్టు’ పొడిపించుకోవడం నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు. శరీరాన్ని ప్రదర్శనకు అనువైన ‘వేదిక’గా భావించి అనేక ఆకృతులను పచ్చబొట్టుగా పొడిపించుకునే వైనం ప్రపంచమంతటా కనిపిస్తోంది. వర్తమానంలో మెట్రో నగరాల్లో దీనే్న ‘టాటూ’గా నాజూకుగా పిలుచుకుంటున్నారు. ఇందులో అమ్మాయిల, మహిళల సంఖ్య గణనీయంగా ఉండటం గమనించతగ్గ విషయం. ‘నడిచే కాన్వాసులు’గా కనిపించేందుకు కొందరు ఇష్టపడటాన్ని సైతం చూడవచ్చు.
ఈ ‘తత్వాన్ని’ చిత్రకారిణి విమల మారోజు బలంగా పట్టుకున్నారు. పట్టుకోవడమేగాక ఆ తత్వాన్ని పరాకాష్టకు తీసుకెళ్ళారు. చిత్రకళా ప్రపంచంలో ఓ సరికొత్త సృజన కోణాన్ని తనదైన సిగ్నేచర్ శైలిగా ప్రకటించారు. సౌందర్యరాశిని కాన్వాసుపై పరిచారు.
ఆడవారి కళ్లు చేప కళ్ళతో పోలుస్తారు. ప్రబంధ కావ్యాల్లోనూ ఈ ఉపమానం కనిపిస్తోంది. విమల తన ‘కాన్వాసు’ను కావ్యస్థాయికి తీసుకెళ్ళి సరికొత్త రంగుల ప్రబంధ రచన చేశారు. బహుశ సమకాలీన చిత్రకళా ప్రపంచంలో కాన్వాసుపై స్ర్తి శరీరానికి మరింత వనె్న తెచ్చేందుకు ‘మత్స్యకంటి’ని వాడుకున్న దాఖలాలు కనిపించవు. అందమైన ఆడవారి కళ్ళను కమలాలతోనూ పోల్చుతారు. అందానికి ఆకర్షణీయతకు, తాత్వికతకు, పరిపక్వతకు సైతం ఆ పుష్పాన్ని పేర్కొంటారు. స్ర్తిల శరీరాలపై ఆమె వేసిన చేప కళ్లు పుష్పాల్లా శోభిల్లుతాయి. అందుకేనేమో బెంగాల్లో చేపలను జలపుష్పాలని పిలుస్తారు. అందమైన స్ర్తి శరీరం... జల పుష్పాలు ఒకచోట చేరితే రంగుల కావ్యభాష తన్నుకొస్తుంది. విమల ఆ ‘్భష’ను పొదిమి పట్టుకుని పెయింటింగ్స్ వేస్తూ రంగుల బ(వ)సంతమాడుతున్నారు. ఆమె కాన్వాసు నిండా రంగుల పండుగనే దర్శనమిస్తోంది. స్ర్తి సోయగం సరికొత్త కోణంలో ఆవిష్కృతమవుతోంది. జల పుష్ప సౌందర్యం... సోయగం, విమల చూసిన స్ర్తి సౌందర్యం... సోయగం పోటీపడుతున్నట్టుగా ఉంటుంది. ఒక సౌందర్యం రాశినే చూసి ‘తట్టుకో’లేనివారు, జమిలిగా అందాల రాశులను ‘కుప్ప’పోస్తే రసజ్ఞుల గుండె గుల్లవుతుంది. ఆ ‘చర్య’నే చిత్రకారిణి ఆశించి బొమ్మలు గీశారు. తనదైన గొప్ప శైలిని లోకానికి చాటారు. ఆ రకంగా ఆమె తన రంగంలో అగ్రస్థానంలో నిలిచారు.
ఈ వినూత్న శైలీ విన్యాసానికి తెరలేపిన విమల మారోజు 1976లో పూర్వపు నల్లగొండ జిల్లా, దామరచర్ల మండలం అడవిదేవులపల్లిలో జన్మించారు. ప్రాథమిక విద్య అక్కడే జరిగింది. తండ్రి భాస్కరాచారి స్వర్ణకారుడు. సరికొత్త డిజైన్లలో నగలు తయారుచేయడంలో పేరొందాడు. గోటి (నఖ)తో చిత్రాలు గీసేవాడు. ఆ వాతావరణంలో పుట్టిపెరిగిన విమల పాఠశాల విద్య చదువుతున్నప్పుడే బొమ్మలు చూసి, గీసే అలవాటు చేసుకున్నారు. అదొక సబ్జెక్టుగా భావించి తనకు తోచిన రీతిలో గీయడం అలవర్చుకున్నారు.
మిర్యాలగూడలో ఇంటర్ విద్య చదువుతున్నప్పుడు హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ‘బొమ్మల చదువు’ బిఎఫ్‌ఏ కోర్సు ఉందని తెలుసుకుని హైదరాబాద్‌కు వచ్చి 1999లో ఎంట్రెన్స్ రాసి చేరిపోయారు.
వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ చదువుకోవడం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. తన చిత్ర రచన కోర్సుకు అవసరమైన సబ్జెక్టు తన కళ్ళముందుకొచ్చినట్టనిపించింది. మెట్రోనగర మహిళల అభిరుచి, అలంకరణ, ఆసక్తి, ‘టాటూ’ (పచ్చబొట్టు)వేసుకోవడం, కదిలే కాన్వాసుగా దర్శనమవడంతో తనలోని సృజనాత్మకత మేల్కొన్నది. కళాత్మకత పొంగుకొచ్చింది. కాగితంపై తోటి వారిని చిత్రించడం ప్రారంభమైంది. తొలుత తన స్కెచ్‌లకు మోడల్స్‌గా వారే నిలిచారు. ఆ అభ్యాసం, సాధన ఊహించని రీతిలో తనదైన ‘శైలి’కి బీజం వేసింది. బిఎఫ్‌ఏలో ప్రాథమిక అంశాల పునాది పడ్డాక 2002 సంవత్సరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎఫ్‌ఏ కోర్సులో చేరాక స్వతంత్య్ర భావాలను ప్రొఫెసర్లు ప్రోత్సహించడం, ఏ సబ్జెక్టుపై సంపూర్ణ విశ్వాసమున్నదో ఆ సబ్జెక్టు లోతుల్లోకి వెళ్ళమని ప్రోత్సహించడంతో అప్పటికే వందలాది స్ర్తిల బొమ్మలు వేయడంతో ఆ సబ్జెక్టుపైనే మరింత లోతైన సారాంశాన్ని పట్టుకోవాలన్న పట్టుదలతో స్ర్తి శరీరానే్న కాన్వాసుగా భావించి నిజమైన కాన్వాసుపై ఆ కాన్వాసును తెచ్చి అనేక ఆకృతులను అద్దడం ప్రారంభించానని ఆమె గుర్తుచేసుకున్నారు.
తొలుత స్ర్తి శరీరాన్ని, ఆ శరీరంపై కొన్ని ‘ప్యాట్రెన్స్’వేయడంతో తన ప్రస్థానం ప్రారంభమైందని, అలాగే స్వర్ణ్భారాలను సైతం జోడించానని, కొన్నిసార్లు తల జుట్టులేకుండా తలపై కూడా వివిధ ఆకృతులను చిత్రించేందుకు కాన్వాసుగా వాడుకున్నానని, స్ర్తి శరీరం సిల్వర్ రంగులో ఉండటం, మిగతా ప్యాట్రెన్స్, నేపధ్యం వివిధ రంగుల తోరణంగా ఉండటంతో ఆ ఫ్రేమ్ ఎంతో ఆకర్షణీయంగా ఉబికి వచ్చిందని ఆమె చెప్పారు. మెహందీ వేసుకుంటే కనిపించే ఆకృతులను రంగుల్లో చేతులకు వేసి సరికొత్త సొగసును ఆమె పరిచయం చేశారు. ఆమధ్య విడుదలైన ఓ భారీ బడ్జెట్ తెలుగు సినిమాలోని పచ్చబొట్టు... పాటను జ్ఞాపకం చేసే రీతిలో రెండుచేతులు కలిసినప్పుడు ఒకే ప్యాట్రెన్ కనిపించే ప్రయోగం అబ్బురపరుస్తుంది. నేపధ్యంలో అందమైన రంగుల చుక్కలు, జరీ అంచు చీరలోని మోటిఫ్ ఆరేసినట్టు చూపడం ఓ గొప్ప ‘విజువల్ ట్రీట్’గాక ఏమవుతుంది?
మరికొన్ని బొమ్మల్లో మహిళల నగల అలంకరణ ప్రియత్వాన్ని తనదైన శైలిలో చూపారు. ఈ బొమ్మల్లో జల పుష్పాలతోపాటు స్వర్ణ్భారణాలు, వాటి ప్యాట్రెన్స్ దర్శనమిస్తాయి. నగల డిజైన్లలో తనకున్న ఆసక్తి ఆ విధంగా బహిర్గతమవుతోంది.
మెక్సికో చిత్రకారిణి, స్ర్తివాద విప్లవకారిణి ప్రిదకార్లో చిత్రాలంటే తనకెంతో ఇష్టమని, ఆమె ప్రభావం తనపై ఉందని, మరో చిత్రకారుడు క్లింట్ వేసే ‘స్ట్రోక్’, టెక్చర్, టెక్స్‌టైల్ డిజైన్ తనకెంతో నచ్చుతుందని విమల అంటున్నారు.
దశాబ్దం క్రితమే కొత్త ఢిల్లీలోని ఎలిమెంటరీ గ్యాలరీలో ప్రముఖ చిత్రకారులు తోట వైకుంఠం, ఏలె లక్ష్మణ్, బైరు రఘురామ్ తదితరుల చిత్రాలతోపాటు విమల చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. హైదరాబాద్‌లోని ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో తన తొలి ‘సోలో షో’ను నిర్వహించారు. అనేక నగరాల్లో గ్రూపు షోలలోనూ ఆమె తన చిత్రాలను ప్రదర్శించారు... ప్రశంసలందుకున్నారు.
ఈ ప్రస్థానంలో పొందిన పరిణతితో తనదైన శైలితో, సమ్మోహనపరిచే తరహాలో మరిన్ని జల పుష్పాలతో, పుష్పాల్లాంటి సుకుమార స్ర్తి శరీరాకృతులతో వచ్చే మహిళా దినోత్సవంనాడు హైదరాబాద్‌లో భారీ సందడి చేయబోతున్నానని ఆమె భరోసా ఇస్తున్నారు.
-విమల మారోజు 74165 28362

-వుప్పల నరసింహం 99857 81799