Others

త్రయంబకేశ్వరం.. పాపహరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకానొక కాలంలో బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ముగ్గురూ లింగరూపాన్ని ధరించి సాధువులు, మహర్షులు తపస్సు చేసుకొనే పవిత్రమైన భూమిలో స్వయంభూ లింగాలుగా ఆవిర్భవించారు. ఆ ప్రదేశమే త్రయంబకంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మహాదేవుని మహాలింగాన్ని దర్శించుకుంటే సకలపాపాలను దూరం అవుతాయని శివభక్తులు చెప్తుంటారు.
ఒకానొక కాలంలో ఇక్కడ గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో కలసి జీవనం చేసేవారట. ఆ కాలంలోనే అంతటా కరువు కాటకాలు ఏర్పడ్డాయి. బ్రాహ్మణులు, గోవులు అందరూ వలస పోతుంటే గౌతమ మహర్షి వారిని ఆపి తన తపశ్శక్తితో ఒక సరస్సును సృష్టించారట. అక్కడ ఉండే ప్రదేశాన్నంతా సస్యశ్యామలం చేశాడు. దాంతో అక్కడి జనులందరూ ఎంతో ఆనందించారు.
అందరూ కలిసి గౌతమ మహర్షిని అభినందించి వలసలు పోవడం మానివేసి అక్కడే స్థిర నివాసం చేసుకొని జీవించసాగారు.
కొద్దిరోజుల తర్వాత అక్కడ ఉంటున్న బ్రాహ్మణుల్లో కలతలు ఏర్పడ్డాయి. అందరూ గౌతమ మహర్షిని మాత్రమే అభినందిస్తున్నారు. ఆయన వల్లనే మనమందరూ సుభిక్షంగా ఉన్నామని అనుకొంటున్నారు. ఆ ఖ్యాతి గౌతమునికి దక్కకూడదని అనుకొన్నారు. వారంతా కలిసి మహావిఘ్నేశ్వరుడిని పూజలు చేశారు.
విఘ్నేశ్వరుడు ప్రత్యక్ష్యమయినాడు. ఏమి కోరిక అని అడిగితే గౌతమునికి అపఖ్యాతి రావాలని కోరుకున్నారు. వారి అజ్ఞానానికి గణేశుడు నవ్వుకుని అది తప్పు అట్లా చేయకూడదు. మరేదైనా వరం కోరుకోమని చెప్పాడు. అప్పుడు వారంతా కలిసి గౌతముని దగ్గర ఉన్న కామధేనువు వంటి ధేనువు వల్లే గొప్ప పేరు గడిస్తున్నాడు. కనుక ఆ ధేనువును లేకుండా చేయమని అడుగుదామనుకొని విఘ్నేశ్వరుని గౌతముని వల్లనే ఆ గోవు మరణించేలా వరం ఇవ్వమని అడిగారు.
గణేశుడు వారి అజ్ఞానానికి చింతించి నన్ను పూజించిన‘ ఓ బ్రాహ్మణులారా! ఇతరులకు నష్టం వాటిల్లాలని కోరుకుంటే అది మీకు శాపంగా మారుతుంది. ఈకోరిక తప్ప మరేదైనా కోరుకోండి’అన్నాడు.
మూర్ఖులైన వారు మాకు శాపం వచ్చినా, దురదృష్టం వెంటాడిన , ఎన్ని కష్టాలు వచ్చినా ఫర్వాలేదు కానీ ఆ గౌతముడు మాత్రం గోహత్యాదోషం చేసిన వాడు అవ్వాలని అన్నారు.
ఇక చేసేది ఏమీలేక విఘ్నేశ్వరుడు ‘తథాస్తు’అని వెళ్లిపోయాడు.
అతి కొద్దిసమయంలోనే పంటపొలాల్లో ధేనువు నడుస్తోందని చూసిన గౌతముడు పొలాలు దెబ్బతింటే చాలామందికి ఆహార నష్టం వాటిల్లుతుందని వెంటనే గోవును అదిలిస్తూ దర్భను దానిపైకి వేశాడు.
కాని విధివశాత్తు ఆ దర్భవల్ల గోవు చనిపోయింది.
అపుడు బ్రాహ్మణులంతా వచ్చి నీవు గోహత్యను చేశావు. ఇది బ్రహ్మహత్యను మించిన దోషం కనుక వెంటనే ఆశ్రమం నుంచి వెళ్లిపో.. నీలాంటి వాళ్లను మేము చూడము అని అన్నారు.
సర్వమూ ఈశ్వరమయంగా భావించే అహల్యాగౌతముని ఎంతో దుఃఖించారు. చివరకు వారు ఆలోచించి శివాజ్ఞలేనిదే చీమైనా కుట్టదు కదా. మరి మనకెందుకీ కష్టాలు? ఆ మహాదేవుడినే ఈ కష్టం తీర్చమని అడుగుదామని అనుకున్నారు.
ఆ సమయంలోనే బ్రాహ్మణులంతా వచ్చి ఈ గోవు చనిపోయిన ప్రదేశంలో గంగానది ప్రవహిస్తే నీవు చేసిన పాపం పోతుంది అని చెప్పారు. వెంటనే అహల్య గౌతములిద్దరూ మహాదేవుని కోసం తపస్సు చేశారు.
శివుడు వారి తపస్సుకు మెచ్చి తన జట నుంచి ఒక పాయను తీసి విసిరాడట. ఆ జటలోని భాగం వెళ్లి ఈ త్రయంబకం దగ్గర ఉన్న బ్రహ్మగిరి పర్వతం పైన పడిందట.
అక్కడ నుంచి గంగమ్మ గౌతమిగా మారి గౌతముని పాపాన్ని ప్రక్షాళన చేసింది. ఒకే పానవట్టంలో లోపల మూడు లింగాకారాల్లో బ్రహ్మవిష్ణు మహేశ్వరులుంటారు.
దీన్ని చూసిన బ్రాహ్మణులు గౌతముని అదృష్టాన్ని అతని నిజాయతీని చూసి తాము ఎంత తప్పు చేశామో తెలుసుకొని పశ్చాత్తాపంతో గౌతముని క్షమించమని అడిగారు. వారి జీవితాలు శాపమయాలుగా మారుతాయని తలచిన గౌతముడు వారినం దరినీ ఈ త్రయంబకేశ్వరుని కొలిచి పాప నాశనం చేసుకోండని చెప్పాడట. వారి గౌతము డు చెప్పినట్టు చేసి వారి పాపాలను దూరం చేసుకొన్నారు.
ఇక్కడ మహాదేవుడు లింగరూపంలో ఉన్న పానవట్టం లోపల మున్నూట అరవై రోజులు జలం వస్తూనే ఉం టుంది. ఈ జలంతో త్య్రయంబకేశ్వరుడు ఇరవైనాల్గుగంటలూ అభిషేకించబడుతూనే ఉంటాడు. ఈ జలం ఎక్కడ నుంచి వస్తుంటాయో ఇప్పటివరకూ ఎవరూ కనిపెట్టలేకపోవడమూ ఇక్కడి ప్రత్యేకతగా స్థానికులు చెబుతారు.
ఈగుడికి దగ్గరలో ఒక కోనేరు ఉంది. దీనిని పాండవులు నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కోనేరు సదా గోదావరీ జలాల్లో నిండి ఉంటుంది. ఈకోనేటిలోచేసే స్నానం సకల పాపాలు నశించుతాయి. సర్వరోగ నివారిణిగా కూడా కోనేటి నీరు ప్రసిద్ధం. ఈ కోనేరు చుట్టూ అనేకలింగాలు, వివిధ దేవతామూర్తుల విగ్రహాలు కూడా కొలువై చూపరులను ఆకర్షిస్తుంటాయి. ఇక్కడ 12 ఏళ్లకొకసారి కుంభమేళ జరుగుతుంది.
త్రయంబకేశ్వరుడిని దర్శించుకోవాలంటే ముందుగా ఇక్కడ నందీశ్వరుని మందిరంలోని నందీశ్వరుని దర్శనం చేసుకోవాలి. అనంతరం దేవదేవుణ్ణి దర్శనం లభిస్తుంది. ఆలయ ప్రాకారంలో చిన్న చిన్న శివలింగాలు, చిన్న చిన్న ఆలయాలు కనిపిస్తాయి. గుడి ప్రాకారాలు చాలా ఎత్తుగా ఉంటాయి. ఈ త్రయంబకేశ్వరాలయాన్ని సుమారుగా 16వ శతాబ్దిలోనే నిర్మించినట్లు చారిత్రకాధారాలు చెబుతాయి.
ద్వాదశజ్యోతిర్లింగాల్లో ముఖ్యమైన లింగంగా ఈ త్రయంబకేశ్వర లింగం ప్రఖ్యాతి వహించింది. ఈ త్రయంబకేశ్వరుని దర్శనం సకల పాప నాశనం అని పురాణాలు చెబుతాయి.

- మాగంటి వెంకట రాధిక