వినమరుగైన

పరమేశ్వర శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. శక్తిపీఠాలఁ జుట్టంగ శక్తిలేదు
అమ్మతోఁ జెప్పి దయఁ జూపమనవె శివుడ!
ఓ యుమాపతీ! మమ్మేలు మోయి భవుడ!
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ శివుడా! భవుడా! పరమేశ్వరా! పార్వతీశ! శక్తిపీఠాలన్నీ తిరిగి వచ్చే శక్తినాకు లేదయ్య. ఆ జగదీశ్వరి యైన పార్వతీదేవితో దయజూపమని చెప్పవయ్య. మమ్మేలుకోవయ్య స్వామీ.

తే.గీ. నీడవై మమ్ముగావుమో నీలకంఠ
తోడువై యుండి నడిపింప వేడుకునెద
కవచమై గావుమోహరా! గరళకంఠ!
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!

భావం: ఓ నీలకంఠా! గరళకంఠా! పరమేశ్వరా! పార్వతీశ! మాకు తోడునీడలుగా ఉంటూ మమ్మల్ని అభివృద్ధిపథంలో నడిపింపవలసినదిగా వేడుకుంటున్నాను. మాకు నీవొక రక్షాకవచంగా ఉంటూ కాపాడవయ్య స్వామీ.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262