AADIVAVRAM - Others

విజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనది అసమానతలు గల సమాజం. దానిని ప్రజాస్వామిక వ్యవస్థకు తగినట్లు రూపొందించుకోవలసి ఉంది. ప్రజాస్వామ్యానికి సమానత్వం పునాది. ఆ సమానత్వం ఉంటేనే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది. అందుకే అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని రోడ్‌రోలర్ చేసే పని చేయాలన్నారు. సమాజంలో ఇప్పటివరకు నిర్లక్ష్యం చేయబడిన వర్గాలను విద్య ద్వారా ఏకీకృతం చేయటం జరగాలి. దాన్ని విద్యారంగం సవాల్‌గా తీసుకోవాల్సి ఉంది. ఇది సానుభూతి దయాదాక్షిణ్యాలతో చేయటం కాదు. దీన్ని సింపతితో కాదు ఎంపతితో జరగాలి. అనగా కరుణకు దయకు తేడా ఉంది. దయలో ఆశించటం ఉంటుంది. మన విధిగా బాధ్యతగా చేసే పనిని కరుణ అంటారు. దీన్ని ఎంపితి అంటారు. తరతరాలుగా బడికి రానివారి అవగాహనలో తేడా ఉంటుంది. చదువులో వారిని తీర్చిదిద్దాలి. వారిలో అవగాహన పెరగాలి. అది ఉపాధ్యాయులకైనా, తోటి విద్యార్థులకైనా ఇది వర్తిస్తుంది. చదువులో వెనుకపడ్డ వారిని గుర్తించి వారిని పూరించగలగాలి. సంస్కార సమాజం మంచి మనుషులను, ఉత్తమ పౌరులుగాను సిద్ధం చేస్తుంది. ఆ బాధ్యత మన స్కూలుపై ఉంది. అలాంటి విలువలను స్కూలు కలిగించగలిగితే దేశంలో ప్రజాస్వామ్యం సుస్థిరంగా ఉండగలుగుతుంది. విద్యా ప్రజాస్వామ్యానికి మూలస్తంభం.
* * *
ప్రతిరోజు ప్రిన్సిపాల్ కొత్త విజన్‌ను ఆలోచించవలసిన అవసరమేమీ లేదు. తోటి ఉపాధ్యాయులను ఫలానా పుస్తకం చదువండని సూచన చేయవచ్చును. దాన్ని ఆధారం చేసుకుని ఒక విజన్‌ను తయారుచేయండని ఉపాధ్యాయులకు చెప్పవచ్చును. ఈ విధంగా ఉపాధ్యాయులను భాగస్వాములను చేసే అవకాశం ఉంటుంది. దానిని ఆచరించుటకై ఉపాధ్యాయులనే ఒక ప్లాన్ చేయమనవచ్చును. ఇదే విధంగా విద్యార్థులతో కూడా విజన్‌ను తయారుచేయించవచ్చును. స్కూల్లో ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి విద్యార్థిని భాగస్వామిని చేస్తే స్కూల్ కల్చరే మారుతుంది. హెడ్‌మాస్టర్ ఒక్కడే నాయకుడు కాదని, నాయకులను తయారుచేసే వ్యవస్థగా రూపొందించటం జరగాలి. సమిష్టి నాయకత్వాన్ని ఏర్పరచగలిగితే ప్రతి విద్యార్థి స్కూలు భవిష్యత్ పైన ఆలోచించిన వారవుతారు. ఈ పిల్లలే రేపు లీడర్లు, రాజకీయ నాయకులు, వివిధ వృత్తుల్లోకి ప్రవేశిస్తారు. పాఠశాల గత సమాజం సంస్కృతినే కాదు, రాబోయే సమాజానికి నాయకులను కూడా అందిస్తుంది. రేపటి సమాజానికి నాయకులను తయారుచేసేది ఈనాటి స్కూలే.
* * *
ఈ దేశం గొప్ప ఆధ్యాత్మిక వారసత్వమున్న దేశం. మన సమాజం ‘గురువు’ను గౌరవిస్తుంది. ఇతర దేశాలకు గొప్ప వైజ్ఞానిక సంపత్తి ఉన్న మాట వాస్తవమే. కానీ ఆ దేశంలో మనిషిని ఆ వ్యక్తి చేసే పనితో తూకం వేస్తారు. దానే్న మెటీరియలిస్టిక్ సంస్కృతి అంటారు. అంతేకాకుండా మన దేశంలో తల్లి తండ్రి తర్వాత గురువుకు స్థానమిస్తారు. ఇది మనకు వారసత్వంగా వచ్చిన సంపద. ఈ సంపదను నిలబెట్టుకోవలసిన విధి మన అందరిదీ. తరగతికి వెళుతున్నపుడు ఇదొక్కసారి స్మరించుకోవాలి. ప్రిన్సిపాల్ విద్యార్థులలో కల్పించే విజన్‌కన్నా ఎన్నో రెట్లు విలువగల లక్ష్యం. అది సంస్కృతిలో వచ్చిన గౌరవం కాబట్టి ప్రిన్సిపాళ్లకు ఇది నల్లేరుపై నడక వంటిది. తరగతి గదిలో ఈ లక్ష్యంలోనే ఉపాధ్యాయుడు బోధన చేస్తాడు. అందరికీ సమానంగానే బోధిస్తాడు. సాధనలోనే తేడా ఉంటుంది. సాధన పటిష్టంగా జరగటానికై ఉపాధ్యాయునిలో మిషనరీ జీలు రావాలి. ఉపాధ్యాయ వర్గం విజన్ - మిషన్ ఈ రెండూ కలిగి ఉంటేనే విద్యార్థులకు జ్ఞాన సముపార్జన జరుగుతుంది. ఈనాడు ప్రపంచంలో విజన్‌పైన, లెర్నింగ్ పైన ఎక్కువ పరిశోధనలు జరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఫెర్రి ‘ఫెడగాటే ఎట్ అప్రెస్’ (పీడిత ప్రజల సాధన) అనే పుస్తకాన్ని రాశాడు. ఇలాంటి పుస్తకాలు ప్రతి లైబ్రరీలో ఉండాలి. అందరితో చదివించాలి. ఇలా చదివిస్తే ఉపాధ్యాయులలో మిషనరీ జీలు వస్తుంది.
* * *
ఈ మధ్య ఒక టీచర్ విద్యార్థితో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. నేను ఆ చుట్టుపక్కల తిరుగుతున్నాను. ఆ టీచర్ మాట్లాడేది నాకు వినిపిస్తున్నది. నాకు అర్థమవుతున్నది.
అవతల విద్యార్థి ఏం అడుగుతున్నాడో నాకు తెలియదు. కానీ విద్యార్థికి సమాధానం ఇస్తూ టీచర్ మాట్లాడేది తెలుస్తున్నది. సెల్‌ఫోన్ వచ్చిన తర్వాత ఒకవైపు నుంచి మాట్లాడే సంభాషణలను దృష్టిలో పెట్టుకుని విషయాన్ని రాయదల్చుకున్నారు. విద్యార్థి టీచర్ సంభాషణలో పిల్లలకు ఏం అర్థం కావటం లేదో ఊహించాలి. వెనకట వాక్యంలో రెండు మూడు అక్షరాలను రాయటం ఫిలిమ్స్ ది బ్లాంక్స్ అంటారు. ఇపుడు ఒకవైపు నుంచి ఆలోచనలను విని రెండోవైపున ఆలోచనలను ఊహించటం. దానే్న డీకోడింగ్ అంటారు. ఇలాంటి ప్రశ్నలు ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. వాటికి సమాధానాలు చెప్పటాన్ని బట్టి అవతలి వ్యక్తి తెలివితేటలను అంచనా వేస్తారు. అంటే సమాధానాన్నిబట్టి ప్రశ్నను ఊహించాలి. ఇది పోటీ పరీక్షలకు సంబంధించినది. ఇలాంటి సమస్యలను పత్రికా విలేకరులు అడుగుతారు. స్టోరీ సెలక్ట్ చేయాలి. ఇంటలిజెన్స్ రిక్రూట్‌మెంట్ అడుగుతారు.
విద్యారంగంలో వచ్చే పరిణామాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు చెబితే స్టాండర్స్ పెరుగుతాయి. ప్రశ్న ఇవ్వటం సమాధానం చెప్పటం వెనుకటి పద్ధతి. ఒక ప్రశ్నకు ఒకే సమాధానం ఉండదు. ఇలాంటి ప్రశ్నలన్నింటిని ఉపాధ్యాయులకు తెలియపరిస్తే విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. ఒక మాదిరి ప్రశ్నలు ఉపాధ్యాయులకు ఇస్తే వందల కొలది ప్రశ్నలు తయారవుతాయి.
ప్రిన్సిపాల్ విద్యారంగంలో వచ్చే కొత్త పోకడలను కొత్త ప్రశ్నలు ఎలా వస్తున్నాయి? ఎసెస్‌మెంట్ పద్ధతులు ఎలా మారుతున్నాయి? టీచర్ల ప్రమాణాలు పెంచటానికి అదొక పద్ధతి.

-చుక్కా రామయ్య