AADIVAVRAM - Others

ఆయుర్వేదము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయుర్వేదానికి, ధన్వంతరి ఆదిదేవుడు. ఆయన ఒక చేతిలో ఆయుర్వేద ప్రతులను, మరో చేత్తో ఔషధ మొక్కలను పట్టుకొని ఉంటాడు. ధన్వంతరీ భక్తుడైన చరకుడు ‘చరకసంహిత’ అనే వైద్యశాస్త్ర గ్రంథాన్ని రచించి ప్రపంచ ప్రఖ్యాతిని పొందాడు. ఆయుర్వేదం అన్నది దీర్ఘకాలం జీవించటం కోసం పొందుపరచిన జ్ఞానం. ఇది భారతదేశానికి చెందిన సంప్రదాయక వైద్యశాస్త్రం. ఇది ప్రత్యామ్నాయ వైద్యానికి ఒక రూపం. ఆయుర్వేదానికి సంబంధించి రాసిన తొలి సాహిత్యం వేదకాలం నాటిది. అంటే క్రీ.పూ.2వ సహస్రాబ్ద మధ్యకాలం అన్నమాట. సుశ్రుత సంహిత మరియు చరకసంహిత విజ్ఞాన సర్వస్వంగల వైద్య గ్రంథాలు, వివిధ మూలాల నుండి క్రీ.పూ.ప్రథమ సహస్రాబ్ద మధ్యకాలం నుండి క్రీ.శ.500 వరకు సేకరించిన వైద్యశాస్త్ర సంబంధమైన సమాచారాన్ని సేకరించి రూపొందించటం జరిగింది. ఆయుర్వేదానికి పునాదులుగా నిలిచిన వైద్యశాస్త్ర గ్రంథాలలో ఇవి ఉన్నాయి.
ఆయుర్వేద సిద్ధాంతం, ప్రతి వ్యక్తిలోనూ కూడా త్రిఫల దోషాలు అన్నవి ఒక అసమానమైన కలయికతో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ కలయికపై ఆధారపడి, మనిషి యొక్క ప్రాణశక్తి ఆధారమైన, స్వభావం మరియు లక్షణాలు ఉంటాయని, ఆరోగ్యకరమైన జీవక్రియ, మంచి జీర్ణశక్తి, సవ్యమైన విసర్జన వ్యవస్థ వీటన్నింటి స్థితి ఉంటుంది. ఆయుర్వేదం, వ్యాయామం, యోగ మరియు ధ్యానంలపై కూడా దృష్టిని కేంద్రీకరించి ఉంటుంది. పంచకర్మను ఆచరించటం అన్నది శరీరం నుండి విష పదార్థాలను తొలగించే ఒక చికిత్సా విధానం. ఆయుర్వేదం, వృక్ష ఆధారిత ఔషధాలను మరియు చికిత్సలను ఉపయోగించటాన్ని ప్రోత్సహిస్తుంది. యాలకులు, దాల్చిన చెక్కతో సహా వందలాది వృక్ష ఆధారిత ఔషధాలను వినియోగిస్తారు ఆయుర్వేదంలో.

-బి.మాన్‌సింగ్ నాయక్