Others

అణువులే సృష్టికి హేతువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘డాల్టన్ జాన్’ (1766-1884ఎడి) అను ఆంగ్లేయుడు అణు సిద్ధాంతమును కనిపెట్టినట్లు చెబుతున్నారు. లక్షల సంవత్సరముల పూర్వమే గౌతమ మహర్షి తన ‘న్యాయదర్శనమను గ్రంథమునందు’ అణువులే రుూబ్రహ్మాండమందలి చరాచర సృష్టి కంతటికి కారణమని నిరూపించాడు. ఈ అణు స్వరూపమును గురించి మన వేదములు, ఉపనిషత్తులు, ధర్మశాస్తమ్రుల యందు వందల కొలది శ్లోకములు వివరించుచున్నవి.
భౌతిక పదార్థ పరిశోధనలకు అంతం లేదు. పదార్థపు అంచులు చూడగల మేమోగాని, యదార్థము చూడలేము. అందుకే ముందు తనను తాను (తానెవరో) తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ప్రముఖ భౌతిక శాస్తవ్రేత్తలందరు తేల్చినదేమంటే, ప్రపంచమంతా, శబ్దము, వెలుగుతో నిండి వుందని. మనం అంతర్ముఖులమైతేనే కాని, లోపలి శబ్దాన్ని వెలుగును చూడలేముకదా!
మన శరీరంలో కూడా 70 శాతం నీరు వుంది. ఆ నీరు కూడా సముద్రపు నీటి వంటిదే. సముద్రపు నీటిలో ఎంత ఉప్పు (సోడియమ్ క్లోరైడ్) గాఢత వుందో మన శరీరంలోని నీటికి కూడా అంత గాఢత వుంటుంది. కాబట్టి మన శరీరంలో కూడా చంద్రకాంతి ననుసరించి మార్పులు సంభవిస్తున్నాయి. పిచ్చి, మానసిక వ్యాధులున్నవారిలో ఈ మార్పులు బాగా కనిపిస్తాయి. సముద్రంలోని నీటిలో వుండే ఉప్పు నిష్పత్తి, తల్లి గర్భంలోని తేలియాడే ఉమ్మనీరు నీటిలోని ఉప్పు నిష్పత్తి ఒకే విధంగా వుంటుంది. ఎటువంటి ప్రభావమైనా తల్లి శరీరం నుండి శిశువుకు నేరుగా చేరదు. నీటి మాధ్యమం ద్వారానే చేరుతుంది. మన శరీరంలోని నీరు సముద్రపు నీరులాగానే ప్రవర్తిస్తుంది.
మరొక ఆశ్చర్యకరమైన విషయమేమంటే సముద్రంలోని చేపల గురించి చేసిన పరిశోధనలలో తేలిన విషయం సముద్రపు పోటు తక్కువగా వుండి నీరు వెనుకకు వెళ్ళే సమయంలో వేలాది మైళ్ళ దూరం నుండి గుంపుల గుంపులుగా వచ్చి చేపలు సముద్ర తీరంలో గుడ్లు పెడతాయి. అలాగే మరికొన్ని జలచరాలు. ముందుగా సముద్రపు ఆటుపోట్లు గురించి వీటికి ఎట్లా తెలుస్తుంది. ఆటుపోట్ల గురించి అలలో వచ్చే మార్పు గురించి ముందుగా తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం వాటికెవరందించారు. వాటి అంచనాలో ఏ మాత్రం తప్పు జరిగినా వాటి జాతి అంతరించి వుండేది. వాటికి సముద్రపు ఆటుపోట్ల గురించి తెలియడానికి ఒకే ఒక్క కారణం చంద్రుడు అని తెలుస్తోంది.
అలాగే సూర్యుడు నక్షత్రాలు ఎంత దూరంలో వున్నా వాటిలో జరిగే మార్పులు లేక అలజడుల వల్ల మనిషి రక్తప్రసరణలో మార్పులు సంభవిస్తాయని తెలుస్తోంది. ప్రతి పదకొండు సంవత్సరాల కొకసారి సూర్యుడిపై అణుతుఫాను సంభవిస్తుంది. మనిషిపై దీని ప్రభావాన్ని గురించి టమాటో అనే జపాన్ దేశపు శాస్తవ్రేత్త సుదీర్ఘ పరిశోధనలు చేశాడు. డాక్టర్ టమాటో 20 సంవత్సరాలు స్ర్తిల రక్తంపై పరిశోధన చేసి తేల్చినదేమిటంటే స్ర్తిల రక్తంలో, పురుషుల రక్తం కంటే ఒక ప్రత్యేక వుంది. ఋతుస్రావ సమయంలోను, గర్భధారణ సమయంలోను వారి రక్తం పలుచగా వుంటుంది. పురుషుడిలో రక్తం ఎప్పుడూ ఒకే రకంగా వుంటుంది. కానీ సూర్యుడిపై అణు తుఫాను రేగుతున్న సమయంలో పురుషులలో కూడా రక్తం పలచబడుతుంది. రక్తం ఆ విధంగా ప్రభావితమైనపుడు ఏదైనా కావచ్చు కదా!
..........................ఇంకావుంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ -- 9490947590