AADIVAVRAM - Others

సంకర వాహనం (శాస్ర్తియ ఆవిష్కరణలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెట్రోలు, విద్యుత్ రెంటితో నడుస్తున్న మొదటి వాహనం టయెటా ఫ్రుయిస్ అని పలువురు అనుకుంటారు. కాని ఇది నిజం కాదు. అటువంటి ఘనత సాధించిన మొదటి వాహనం ‘బుయిక్ స్కైలార్క్’ దానిని 1972లో విక్టర్ వౌక్ రూపొందించాడు. కాని ఆనాటి కాలుష్య పరిమితులకు లోబడే ఉన్నప్పటికీ దాని టెక్నాలజీ ఆచరణ యోగ్యం కాదని భావించిన పర్యావరణ పరిరక్షణ సంస్థ దీనికి ఆమోద ముద్ర వేయటానికి నిరాకరించింది.
వౌక్ దీనికి సంబంధించి 1962 నుంచి ప్రయోగాలు నిర్వహించాడు. మోటరోలా వ్యవస్థాపకుల్లో ఒకరైన రస్సెల్ ఫెల్డ్‌మాన్ పూర్తిగా విద్యుత్‌తో నడిచే కారును రూపొందించే అవకాశాలను పరిశీలించమని ఆయనను కోరాడు. పలు ప్రయోగాలు నిర్వహించిన అనంతరం పూర్తిగా విద్యుత్‌తో నడిచే కారును రూపొందించటం వాణిజ్యపరంగా లాభదాయకమైన పని కాదన్న నిర్ధారణకు వచ్చాడు. అందుకు బదులుగా పెట్రోల్, విద్యుత్ రెంటినీ ఉపయోగించుకుని పరుగెత్తగల సంకర వాహనాన్ని రూపొందించవచ్చని ప్రతిపాదించాడు. అందువల్ల విద్యుత్ కాలుష్య కారకాల విడుదలను పూర్తిగా నివారించ గలుగుతామని, పెట్రోల్ వల్ల లభించే గరిష్ట శక్తిని ఉపయోగించుకో గలుగుతామని వివరించాడు.

-బి.మాన్‌సింగ్ నాయక్