AADIVAVRAM - Others

కారులో హుషారుగా... (లోకం పోకడ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గట్టిగా ముప్పై ఏళ్లు కూడా లేని చాలా మంది చిన్నపాటి పనికి, అంతో ఇంతో దూరం వెళ్లడానికి అపసోపాలు పడిపోవడం మనం చూస్తుంటాం. ఇంటి పని, ఆఫీసు పనితో సతమతం అయిపోతున్నామని దీర్ఘాలు తీయడం గమనిస్తుంటాం. అలాంటిది డెబ్భై మూడేళ్ల వృద్ధుడు ముంబై నుండి లండన్‌కి కారులో 22 వేల కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించడం గురించి వింటే ఆశ్చర్యపోక మానం.
ఉక్కు ఉత్పత్తిదారుడైన బాల్దావా కర్ణాటక వాసి. అయితే వ్యాపారం నుండి నిష్క్రమించిన తర్వాత అతను కుటుంబంతో పాటు ముంబైలో సెటిలయ్యాడు. అతనికి ప్రయాణాలంటే ఇష్టం. దేశంలోని అనేక ప్రాంతాలు చూసిన అతను 2015లో మనవరాలు నిషితో కలసి కారులో సుదూరాలకు ప్రయాణించాడు. ముంబై నుండి బయలుదేరిన అతను బద్రీనాథ్‌కి, తర్వాత వౌంట్ ఎవరెస్టు పర్వతసానువులు, ఐస్‌ల్యాండ్ వంటి చోట్లకు చేరుకున్నాడు. అక్కడి నుండి సురక్షితంగా ముంబైకి చేరుకున్నాడు. ఆ ఎడ్వంచర్ ట్రిప్ స్ఫూర్తితో అతను మరోసారి దూరతీరాలకు కారులో రోడ్డు మార్గాన వెళ్లాలని భావించాడు. ఈసారి అతను తన అరవై నాలుగేళ్ల భార్య ఉష, పదేళ్ల వయసు గల మనవరాలు నిషితో కలసి కష్టతరమైన ఇంగ్లండ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు గాను అతను ముందుగా ప్రభుత్వం నుండి కావలసిన అనుమతులు తెచ్చుకున్నాడు. ప్రయాణానికి అనువుగా తన బిఎండబ్ల్యు- ఎక్స్ 5కారును పూర్తిగా సంసిద్ధం చేశాడు. ఈ సాహస యాత్రలో అతను 19 దేశాల మీదుగా మొత్తం 22 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితేనేం మొక్కవోని దీక్షతో ప్రయాణం చేసి విజేతగా నిలిచాడు. ఇంగ్లండ్‌కి రోడ్డు మార్గంలో చేరుకోవాలంటే పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ల మీదుగా చేరుకోవచ్చు. ‘ఆ మార్గంలో ప్రయాణిస్తే మేము తిరిగి వస్తామనే నమ్మకం లేదు. అందుకే మేము మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్‌ల మీదుగా ఇంగ్లండ్ చేరుకోవాలని నిర్ణయించుకున్నాం’ అంటాడు. అన్నీ చూసుకుని వారు ముంబై నుండి బంధుమిత్రుల వీడ్కోళ్ల మధ్య ఈ ఏడాది మార్చి 23న బయలుదేరారు. ఇంఫాల్‌కి చేరుకోగానే తమలాగే వివిధ ప్రాంతాల నుండి ఇంగ్లండ్‌కి బయలుదేరే మొత్తం 12 బృందాలు వాళ్లతో జత కలిసాయి. వీరికి పలు దేశాల్లో ఇండియన్ ఎంబసీ భోజన సదుపాయాలు కల్పించేది. ఈ ప్రయాణంలో బాల్దావా బృందం ఒకేరోజు మూడు దేశాల మీదుగా అత్యంత దూరం ప్రయాణించి రికార్డు సృష్టించింది. వార్సా నుండి బ్రస్సెల్స్‌కి మొత్తం 930 కిలోమీటర్ల దూరాన్ని ఇరవై నాలుగు గంటల్లో చేరుకుంది. అలాగే ఒకేరోజు ఉదయపు ఫలహారం ఒక దేశంలోను, మధ్యాహ్నం భోజనం మరో దేశంలోను, రాత్రి డిన్నర్ ఇంకొక దేశంలో చేయడం ప్రత్యేక అనుభూతి అంటుంది బాల్దావా బృందం. వార్సా (పోలెండ్)లో బ్రేక్‌ఫాస్ట్, కోలోన్ (జర్మనీ)లో మధ్యాహ్న భోజనం, బ్రస్సెల్స్ (బెల్జియం)లో రాత్రి భోజనం చేయడం అనేది మరిచిపోలేని అనుభూతి అంటారు. ఈ ప్రయాణంలో బాల్దావా బృందం మొత్తం 19 దేశాలను చుట్టి ప్రయాణం చేసింది. ఈ సమయంలో అద్భుతమైన ల్యాండ్‌స్కేప్‌లు, కన్నుల పండవ చేసే జలపాతాలు, తటాకాలు, నదులను వారు చూశారు. జీవితకాలం గుర్తుండిపోయే ఈ సాహస ప్రయాణంలో భాగంగా బాల్దావా బృందం మొత్తం 22 వేల కిలోమీటర్లను 72 రోజుల్లో పూర్తి చేసి సురక్షితంగా ముంబై చేరుకుని రికార్డు సృష్టించింది.
*

చిత్రాలు.. బాల్దావా, అతని భార్య, మనవరాలు

- దుర్గాప్రసాద్ సర్కార్