AADIVAVRAM - Others

బుర్రకు పని చెప్పండి! (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: మా తాతగారు, మా నాన్నగారూ ఇద్దరికీ అల్జీమర్స్ వ్యాధి ఉండేది. నా వయసు 45. నేను ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
-సదాశివరావు వై. (జగిత్యాల)
జ: కొన్ని ముఖ్యమైన అంశాలకు పేర్లు ఆ భాష ఔన్నత్యాన్ని చాటుతాయి. మెదడును శక్తిమంతం చేసే విధంగా ఆలోచించటాన్ని తెలుగులో మెదడుకు పదును, మెదడుకు మేత ఇలా పిలుస్తారు. ఇంగ్లీషు వాళ్లు ‘బ్రైన్ స్క్వీజింగ్’ (నిమ్మడిప్ప లాగా మెదడును పిండటం) అంటారు. ఒక విధంగా ఇలా రాపాడించటం అనేది మెదడును హింస పెట్టడమే అవుతుంది. మెదడుకు పదును పెట్టడం వజ్రానికి మెరుగుపెట్టడం లాంటిది.
మనిషి తన మెదడును ఎంత ఉత్సాహంగా, ఉత్తేజంగా, చురుకుగా కాపాడుకుంటాడో వార్ధక్యంలో మెదడు అంత వికాసవంతంగా ఉంటుందంటూ, లండన్ ఎగ్జెటర్ విశ్వవిద్యాలయం, కింగ్స్ కాలేజీ వారు విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్నారు. అల్జీమర్స్ వ్యాధి నివారణ - మెదడుకు పదును పెట్టే ఉపాయాల గురించి తాజా సమాచారం ఇందులో ఉంది. 19 జులై, 2017న ఈ నివేదిక విడుదలయింది.
పత్రికల్లో వచ్చే పజిల్స్, పదబంధ ప్రహేళికలు, గడులు పూరించటం లాంటి అలవాట్లు చేసుకుంటే భవిష్యత్తులో వార్ధక్య లక్షణంగా వచ్చే మతిమరుపు వ్యాధి (అల్జీమర్స్ వ్యాధి)ని నివారించవచ్చని ఇందులో పేర్కొన్నారు.
శరీర వ్యాయామం గురించి మనం మాట్లాడుకున్నంతగా మెదడు వ్యాయామం గురించి మాట్లాడటంలేదు. నిర్మాణాత్మకంగా, అనుకూల ఆలోచనలు చేయటాన్ని ‘మెదడు వ్యాయామం’ అంటారు. 4 అంకెలు గాల్లో వేసి మరో 4 అంకెల్తో గాల్లోనే హెచ్చవేసి జవాబు చెప్పమన్నామనుకోండి.. కాసేపు ప్రయత్నించి సమాధానం రాబడితే అది అనుకూల (పాజిటివ్) వ్యాయామం అవుతుంది. ఇది మెదడుకు పదును పెట్టి శక్తిమంతం చేస్తుంది. ‘గాల్లో ఈ లెక్కలు చేయడమేంటి? వీడెవడు నాకు చెప్పడానికి? నేనెందుకు చేయాలి?.. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే అది నెగెటివ్ (వ్యతిరేక) వ్యాయామం అవుతుంది. ఇది మెదడులో ఘర్షణ పూర్వక వాతావరణాన్ని కలిగిస్తుంది. మెదడు శక్తిని కోల్పోతుంది. బుర్ర వేడెక్కిపోయిందంటామే అది ఈ వ్యతిరేక వ్యాయామం వల్లనే కలుగుతుంది.
మెదడుకు అనుకూల వ్యాయామం వలన నాడీ వ్యవస్థ మెదడులో సంతోషాన్ని కలిగించే సెరెటోనిన్, డోపమైన్ లాంటి కొన్ని రసాయనాలను (ఔళ్ఘఒఖూళ ష్దళౄజష్ఘఒ) విడుదల చేస్తుందని వైద్య శాస్త్రం చెప్తోంది. అందువలన మనసులో సంతోషం, సంతృప్తి కలుగుతాయి, నిరాశాభావం పోతుంది. ఆయుర్వేద శాస్త్రం ‘అనుకూల వేదనాయాం సుఖం - ప్రతికూల వేదనాయాం దుఃఖం’ అని ఇదే విషయాన్ని చెప్పింది. అనుకూల వేదన అంటే పాజిటివ్ బ్రెయిన్ ఎక్సర్‌సైజ్ అని అర్థం.
మనసులో చిరాగ్గా ఉన్నప్పుడు, నిరాశ కలిగినప్పుడు, చింతా శోక భయ దుఃఖాదులు ముంచెత్తినప్పుడు ఈ పాజిటివ్ బ్రెయిన్ ఎక్సర్‌సైజ్‌లు సంతోష సంతృప్తుల నిచ్చే రసాయనాలను విడుదల చేసి మనిషిని దుఃఖంలోంచి బయటకు తెస్తాయి. ఇది చాలా సున్నితమైన విషయం. విషాదం కలిగితే గుండె దిటవు చేసుకోవాలంటారు. అంటే, మనో ధైర్యం పుంజుకోవాలని! విషాదంలోంచి బయటపడాలంటే మెదడుకి పదును పెట్టాలనటం కూడా ఇందులో భాగమే! మెదడు పదునెక్కే కొద్దీ సంతోష రసాయనాల ఉత్పత్తి మెరుగుపడి, విషాదం పోతుంది. దాని స్థానంలో సంతోషం చేర్తుంది.
క్రాస్‌వర్డ్స్, పజిల్స్, గడులు - నుడులు పూరించటం లాంటివి అన్ని వయసుల వారికీ అవసరమే! ముఖ్యంగా నడివయసు వారు దీన్ని ఒక అలవాటుగా చేసుకుంటే వార్ధక్యంలో అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయని ఈ లండన్ నివేదిక తెలియజెప్తోంది.
శరీరంలో కేలరీలను ఎక్కువగా ఖర్చు పెట్టేది మెదడే! మెదడు ఎంత ‘అనుకూల వ్యాయామం’ చేస్తే అన్ని కేలరీలు ఖర్చవుతాయి. అనుకూల వ్యాయామం వలన ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఒక ప్రసిద్ధ ఇంజనీరుగారు రిటైరయ్యాక అనేక బాధలతో సతమతమవుతూ, ఓ డజను పెద్ద ఆస్పత్రుల్లో పొందిన చికిత్సలూ, చేయించుకున్న పరీక్షల ఫైళ్లు పుచ్చుకుని నా దగ్గరకొచ్చారు. రిపోర్టులన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. అయినా ఆయన శరీరంలో నొప్పుల్లేని అంగుళం కూడా లేదు. దీనికి పరిష్కారం ఏమిటి? నేను ఆయనకు సూత్రం చెప్పాను..
‘క్లాసులో టీచరుగారు పిల్లల్ని ముక్కుమీద వేలేసుకుని కూర్చోమంటే నిశ్శబ్దం తేవటం కష్టం. అదే, ఆ పిల్లలకి ఓ పేరా మేటరిచ్చి 10సార్లు చూసి వ్రాయమని ఆదేశించండి.. పక్క క్లాసు టీచరుగారొచ్చి మీ క్లాసు నిశ్శబ్దంగా ఉంది. పిల్లల్లేరా? అనడుగుతారు. మన మెదడు కూడా అంతే! దానికి అనుకూలమైన పని చెప్పకపోతే అది దాని ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తుంది. మీరు రిటైరయ్యాక మెదడుకు పని చెప్పటం మానేశారు. ఈ నొప్పులన్నీ అలా పుట్టినవే! ఇప్పుడు మీరు ఏదైనా వ్యాపకం కల్పించుకుని మెదడుకు పని చెప్పండి.. బుద్ధిగా అది మీరు చెప్పిన పని చేస్తుంది. మీ నొప్పులు తగ్గుతాయి’ అన్నాను. ఆయన ఏదో ఒక ఉద్యోగం చేయటానికి ఇష్టం చూపించలేదు. అప్పుడు నేను మార్గాంతరం సూచించాను. పుస్తకాల షాపుకెళ్లి రాజాజీ రామాయణం కొనండి. ఇంగ్లీషులో దొరికితే తెలుగులోకి అనువాదం చేయండి. తెలుగులో దొరికితే ఇంగ్లీషులో వ్రాయండి. నెల రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోండి.. మీ నొప్పులు తగ్గకపోతే నన్నడగండి’ అన్నాను. సరిగ్గా నెలకి ఆయన్నుంచి ఫోనొచ్చింది. ‘మీ రామాయణం మందు గొప్పగా పని చేసింది డాక్టర్‌గారూ’ అంటూ.
మనిషి ఎప్పుడూ స్టీరియో టైప్ అంటామే అలా సాధారణ పద్ధతిలోనే జీవిస్తాడు. మంచో చెడో ఏదో ఒకటి జరిగితేనే అతనిలో మార్పు వస్తుంది. నిత్య జీవితంలో మనిషి అనుకూల ప్రతికూల వేదనలకు లోనౌతూనే ఉంటాడు. వీటికి భిన్నంగా మెదడుకు ప్రత్యేక వ్యాయామం అవసరం.

- డా. జి.వి.పూర్ణచందు
సెల్ : 9440172642
purnachandgv@gmail.com

సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002