AADIVAVRAM - Others

రెండు మంచి రోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజు కన్నా మంచి రోజు లేదని ఈ మధ్య ఎక్కడో విన్నాను. ఆ మాట చెప్పిన వ్యక్తి మనం పనులు చేయడానికి ఈ రోజుకన్నా మంచి రోజు లేదని చెబుతాడు. ఇంకా ఇలా చెబుతాడు. ‘మంచి పనులు చేయడానికి నిన్నటికన్నా మించిన మంచి రోజు లేదు. అది లేదు కాబట్టి ఈ రోజే మంచి రోజ’ని చెబుతాడు.
మంచి రోజంటూ ప్రత్యేకంగా వుండవు. అన్నీ మంచి రోజులే. వాటిని మనం ఉపయోగించుకున్న దాన్నిబట్టి అది మంచి రోజుగా మార్పు చెందుతుంది.
మంచి రోజులు ముఖ్యమైన రోజులు రెండూ ఒక్కటే.
మార్క్‌ట్వైన్ దీని గురించి ఇలా చెబుతాడు.
‘ప్రతి వ్యక్తి జీవితంలో రెండే రెండు రోజులు ముఖ్యమైనవ’ని చెబుతాడు. మొదటిది ఆ వ్యక్తి పుట్టిన రోజైతే, రెండవది ఎందుకు పుట్టాడో తెలుసుకున్న రోజు అని చెబుతాడు.
మనం పుట్టాం. కాబట్టి మొదటి ముఖ్యమైన రోజు మనకు తెలిసిపోతుంది. మరి రెండవ మంచి రోజు ఏదీ?
మనం ఎందుకు పుట్టాం?
ఈ జీవితంలో మనం ఏం చేయడానికి పుట్టాం?
ఈ సమాజానికి మనం ఏం అందించడానికి పుట్టాం?
మనకున్న ప్రత్యేకతలు మనకు తెలుసా..?
మనకున్న నైపుణ్యం మనం గుర్తించామా?
ఇవీ ప్రశ్నలు.
ఈ ప్రశ్నలకు సమాధానాలు మనం తెలుసుకున్న తరువాత కూడా మరో ప్రశ్న మిగిలే ఉంటుంది.
మనం ఎందుకు పుట్టామో తెలిసినప్పుడు ఆ దిశగా మనం జీవిస్తున్నామా?
ఒకవేళ ఆ దిశగా జీవించకపోతే తప్పెవరిది?
రెండు ముఖ్యమైన రోజులు.
మిగిలింది ఒక్కటే..
మనం ఎందుకు జీవిస్తున్నాం?
ఈ భూమీద మనం ఎందుకు ఉన్నామో ఈ భూమికి, ఈ సమాజానికి మనం ఏమి ఇవ్వాలో తెలుసుకొని జీవించాలి.

- జింబో 94404 83001