AADIVAVRAM - Others

ఆవులింతలు దేనికి సంకేతం? (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: నాకు తరచూ ఆవులింతలొస్తాయి. అజీర్తిగా ఉంటుంది. కారణం ఏమిటి?
-కణ్ణదాసు కావూరి (మధిర)
జ: ఆవులిద్దామనుకుంటే వచ్చేది కాదు ఆవులింత.. అది దానికదే పుట్టుకొస్తుంది. ఎందుకొస్తుంది? శరీరంలో ఏదో అసౌకర్యం వలనే వస్తుంది. ఆ అసౌకర్యాన్ని సరి చేయాలని శరీరం మనిషికి చేసే విన్నపమే ఆవులింత.
ప్రజలు తమ బాధలు చెప్పుకోవటానికి వస్తే వాటిని పరిష్కరించటాన్ని పరిపాలన అంటారు. వాళ్ల నోళ్లు మూయించి, గొంతులు తొక్కి పెట్టడానికి ప్రయత్నిస్తే దాన్ని నియంతృత్వం అంటారు. మనం కూడా మన శరీరం చెప్పుకునే గోడు పట్టించుకోకుండా ఆవులింతను తొక్కిపెడితే అది కూడా నియంతృత్వమే అవుతుంది. దాని వలన శరీరానికి చాలా అపకారం జరుగుతుంది. ఆవులింతను ఆపటం కాదు కావల్సింది, ఆవులింతలు రావటానికి కారణాన్ని ఆపాలి.
దానికదే కలిగే కండర చలనాల వలన ఆవులింత వస్తుంది. నోరు బాగా విప్పారుతుంది. ఊపిరితిత్తులు వేగంగా నిండుగా గాలి పీల్చుకుంటాయి. నెమ్మదిగా గాలి విడుస్తాయి. ఈ సమయంలో చెవి కర్ణ్భేరి విచ్చుకుంటుంది. కళ్లు మూతలు పడతాయి. కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతాయి.
కారణం ఏదైనా, శరీరం తనకు అలసటగా ఉన్నదని చెప్పటానికి ఆవులింత ఒక సంకేతం. నిద్ర చాలకపోయినా, నిద్ర ముంచుకొచ్చినా, నిద్ర మెలకువ వచ్చినా ఆవులింతలు రావచ్చు. ఆక్సిజన్ చాలకపోయినా ఆవులింతలు రావచ్చు. శరీరంలో వేడి పెరిగిపోయినా ఆవులింతలు రావచ్చు. ఆవులింత వచ్చినప్పుడు గుండె ఎక్కువగా కొట్టుకుంటుందని కనుగొన్నారు. ఉత్తేజితం కావటానికి శరీరం చేసుకునే ప్రయత్నమే ఇదంతా!
కొందరు బిగ్గరగా పక్కింట్లో వాళ్లకు వినిపించేలా ఆవులిస్తే, కొందరు దాన్ని తొక్కిపట్టి సన్నగా చిన్నగా ఆవులించి వదిలేస్తారు. కొందరు పెద్ద సంగీతాలాపనలా ఆవులించి నోట్లో చిటికెలు వేస్తుంటారు. ఒకరు ఆవులిస్తే ఆ చుట్టుపక్కల వున్న చాలామందికి ఆవులింతలొస్తాయి.
సాధారణంగా ఆవులింతను నిద్రకు గుర్తుగా భావిస్తారు. బోర్ కొడ్తోందనడానికి కూడా అది గుర్తే. సభలో సుదీర్ఘంగా ఎవరైనా ప్రసంగిస్తున్నప్పుడు ఆవులింతలు ఎన్ని వచ్చాయన్నది ఆ ప్రసంగంలో స్వారస్యాన్ని తెలియజేస్తుంది. ఆవులింత అనేది మన శరీర స్థితిని మనకు తెలియజెప్పటమే కాదు, మన స్థితిని ఇతరులకు కూడా ఆ విధంగా తెలియజేస్తుంది. ఇంక చాలు బాబో.. అని శరీరం చెప్పటమే ఆవులింత.
వౌలికంగా ఆవులింత అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన కార్యం. రక్తానికి ఆక్సిజన్ అవసరం అయినప్పుడు ఆవులింతను ప్రేరేపిస్తుంది శరీరం. గాలి నిండుగా పీల్చుకుని ఊపిరితిత్తులు శరీరానికి కావల్సినంత ఆక్సిజన్ అందిస్తాయి. రక్తం ప్రసరణం బాగా జరగటానికి (పంపింగ్) గుండె వేగం పెరుగుతుంది.
ఆక్సిజన్ అవసరం అప్పటికప్పుడు ఎందుకు ముంచుకొస్తుందనే సందేహం మనకు రావాలి. శరీరంలో విష దోషాలు పెరిగినప్పుడు వాటిని తొలగించటానికి అదనపు ఆక్సిజన్ అవసరం అవుతుంది. తాజా ఆక్సిజన్ శరీరంలో ప్రసారం అయితేనే ప్రమాదకర పరిస్థితులు రాకుండా ఉంటాయి. తన బాగుని సాధ్యమైనంత వరకూ శరీరమే సరిచూసుకుంటుంది. ఆవులింత అందుకు ఒక ప్రక్రియగా ఉపయోగపడుతుంది. ఆవులింతా మంచిదే! ఆవులింతలొచ్చే పరిస్థితే మంచిది కాదు.
సాధారణంగా కొద్దిపాటి ఆలోచనకే బుర్ర వేడెక్కిపోయిందంటూ ఉంటాం. నిజానికి మన బుర్ర వేడెక్కించేటంత పని మనకు లేదు. పాతాళభైరవిలో అమ్మవారిలా మన మెదడు ఎంతటి కార్యాన్నైనా సాధించగలిగే శక్తి కలిగిందే! 4 అంకెల్ని గాల్లో వేసి, 4 అంకెలతో హెచ్చవేసి సమాధానం చెప్పమంటే నోటితో గుణించి మనం జవాబు రాబట్టామనుకోండి. దానివలన మెదడు శక్తివంతం (జశ్పజయ్ఘూఆళ) అవుతుంధే గానీ, వేడెక్కదు.
ఈ గాల్లో లెక్కలేయటం ఏమిటీ..? వీడెవడు నాకు చెప్పేందుకు? నేనెందుకు చెయ్యాలి? ఇలా ఆలోచిస్తుంటే మెదడులో ఘర్షణ (జషఆజ్యశ) పెరిగి బుర్ర వేడెక్కుతుంది. ఇంకా తేలికగా చెప్పాలంటే అనుకూల ఆలోచన (-్యఒజఆజ్పళ ఆ్దజశరీజశ) మెధడుని శక్తివంతం చేస్తే, ప్రతికూల ఆలోచన (ళఘఆజ్పళ ఆ్దజశరీజశ) మెధడును వేడెక్కిస్తుంది.
అలాంటప్పుడు ఆవులింత వలన ఆక్సిజన్ సరఫరా పెరిగి మెదడుకు శీతలోపచారాన్ని అంటే, చలవనిస్తుంది. మెదడు చురుకు అవుతుంది. ఆవులింత దవడ ఎముకలకు మంచి వ్యాయామం కూడా! మెడ కండరాలు సాగతాయి. దీర్ఘశ్వాస వలన ఉరోభాగం, వీపు, మెడ, గొంతు కండరాలన్నీ ఒక్క క్షణం విప్పారుతాయి. ఊపిరితిత్తులు కూడా ఉత్తేజితం అవుతాయి. అలాగని పదేపదే ఆవులింతలు రావాల్సిన లేదా తెచ్చుకోవలసిన అవసరం ఏమీ లేదు. ఆవులించాల్సిన అవసరం శరీరంలో ఏర్పడకూడదనే మనం కోరుకోవాలి.
గొంతు, మెడ, ఉరోభాగం, ఉదర భాగాలకు సరఫరా అయ్యే నాడిని వేగస్ నరం (్ఘ్ఖఒ శళ్పూళ) అని ఫిలుస్తారు. పొట్టని మెదడుకి ఈ నరం అనుసంధానం చేస్తుంది. రక్తనాళాలతో కూడా ఇది అనుసంధానం అవుతుంది. పొట్టలోనూ, ఊపిరితిత్తుల్లోనూ, గుండెలోనూ, రక్తప్రసార వ్యవస్థలోనూ ఆక్సిజన్ అవసరం లాంటివి ఏర్పడినపుడు ఈ నరం కలిగించే చలనం (్ప్ఘఒ్య్ప్ఘఘ ళ్ఘషఆజ్యశ) వలన ఆవులింతలొస్తాయి.
ధీన్నిబట్టి ఆవులింత రావటానికి రక్తప్రసార వ్యవస్థ, జీర్ణకోశ వ్యవస్థ, గుండె, ఊపిరితిత్తులు, మెదడు... వీటన్నింటికీ అవకాశం ఉంది. ఆగకుండా ఆవులింతలు వస్తున్నాయంటే ప్రమాదకర పరిస్థితి ముంచుకొస్తున్నట్టు అనుమానించాల్సి వుంటుంది. అతిగా చెమటలు, ఆగకుండా ఆవులింతలు, ముఖం పాలిపోవటం, వెర్రిచూపులు చూడటం, అయోమయంగా ఉండటం లాంటి లక్షణాలు గుండె జబ్బును సూచించేవి కావచ్చు. ఆవులింతే కదా అని అశ్రద్ధ చేయకూడదు. వెంటనే వైద్యుని సంప్రదించటం అవసరం.

సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com