AADIVAVRAM - Others

వీడియో గేమ్‌లతో మెదడుకు మేలు (విజ్ఞానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీడియోగేమ్‌ల వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని, డిమెన్షియా (జ్ఞాపకశక్తి తగ్గిపోవడం) బారినుంచి కోలుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని ఓ అధ్యయనం చెబుతోంది. సంక్లిష్ట నాడీవ్యవస్థతో కూడిన మెదడు పనిచేయడం మందగిస్తే జ్ఞాపకశక్తి తగ్గడం, మతిమరుపు, చురుకుగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఎదుటివారిని గుర్తించలేకపోవడం వంటి రుగ్మతలు తలెత్తుతాయి. బ్రెయిన్‌గేమింగ్ వల్ల అటువంటి సమస్యలు పూర్తిగా నయం కాకపోయినా నెమ్మదించడం సాధ్యమవుతుందని ప్రయోగాల్లో తేలింది. కేంబ్రిడ్స్ యూనివర్శిటీకి చెందిన శాస్తవ్రేత్తల బృందం నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం రూఢీ అయింది. గేమ్‌షో అనే యాప్ ద్వారా ఐపాడ్‌లో బ్రెయిన్‌గేమ్‌లు ఆడటం ద్వారా పలువురిని వీరు పరిశీలించారు. ముఖ్యంగా 45 సంవత్సరాల వయస్సున్న 42 మందితో ఈ బ్రెయిన్‌గేమ్‌లు ఆడించారు. వీరంతా కొద్దోగొప్పో డిమెన్షియా లక్షణాలతో బాధపడుతున్నవారే. వారంలో రెండు గంటలపాటు మాత్రమే వారు ఆ గేమ్‌లు ఆడారు. మిగతా రోజుల్లో వారు వీడియోగేమ్‌ల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలా నెలపాటు పరిశోధన సాగాక ఫలితాలను పరిశీలించారు. బహుళ అంతస్తుల భవనంలో తమ కారు ఎక్కడ పార్క్ చేశారు, తాళం చెవులు ఎక్కడున్నాయి వంటి చిన్నచిన్న విషయాలను గుర్తుపెట్టుకోవడం వారికి సాధ్యమైందని తేలింది. వారు ఆడిన గేమ్‌లో గోల్డ్‌కాయిన్స్‌ను వివిధ పాటర్న్‌లలో అమర్చడమే కీలకం. సాధారణంగా వీడియోగేమ్స్‌లో కొత్తదనం ఉండదు. ఆడిందే ఆడుతూండాలి. అయితే వీరు కనిపెట్టిన గేమ్‌షో సరికొత్తగా ఉంది. ఈ పరిశోధన ఫలితాలను ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ న్యూరో సైకోఫార్మకాలజి’లో ప్రచురించారు. కేంబ్రిడ్స్ శాస్తవ్రేత్తల బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ బార్బరా షాకియాన్ ఈ ఫలితాలను విశే్లషించారు. బ్రెయిన్‌గేమ్‌ల వల్ల మతిమరుపువంటి సమస్యలు ముంచుకురాకుండా నెమ్మదింపచేయవచ్చని తేలినట్లు చెప్పారు. ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు చేస్తామని అన్నారు. అల్జీమర్స్ రిసెర్చ్‌లో ప్రముఖుడైన డాక్టర్ కరోల్ రోట్జిడ్జ్ కూడా ఈ ఫలితాలను సమర్థించారు. స్కాట్లెండ్ శాస్తవ్రేత్తలు కూడా వీడియోగేమ్‌ల వల్ల మెదడుకు ఎంతోకొంత మేలు జరుగుతుందని అంటున్నారు. నిజానికి డిమెన్షియా నివారణకు ఇప్పటివరకు మందులు లేవు. కేవలం ఉపశమనానికి, వ్యాధి త్వరితగతిన ముదరకుండా ఉండటానికి ఔషధాలు ఉన్నాయంతే.