AADIVAVRAM - Others

తీపి వలన కేన్సర్ ప్రమాదం (మీకు మీరే ఢాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: తీపి సాత్వికాహారమా? నాకు 60 ఏళ్లు. షుగరు లేదు. తీపి ఇష్టంగా తింటాను. దీని వలన ఏమైనా కొత్త సమస్యలు కలుగుతాయా?
జ: సాత్వికాహారం అంటే తీపి ఎక్కువగా తినటం అనే అభిప్రాయం కొందరిలో ఉంది. అన్నం మాని, పరమాన్నం తింటే చాలా గొప్ప అనుకుని, శరీరాన్ని విషపూరితం చేసుకునే వాళ్లు చాలామంది ఉన్నారు. ఆయుర్వేద శాస్త్రం శరీరాన్ని పోషించే తీపి, మితిమీరి వాడితే శరీరాన్ని ఎలా బాధిస్తుందో కూడా వివరించింది.
తీపి అనగానే పంచదార, బెల్లం మాత్రమే కాదు, పాలు, బియ్యం, ఇతర తీపి ధాన్యాలు, చింతపండుతో సహా ఇతర పండ్లు, ఖర్జూరాలు, తేనె, కూల్‌డ్రింక్స్, బిళ్లలు, బిస్కట్లు, చాక్లెట్లు, కూకీలు, బంగాళాదుంపల చిప్స్, ఇవన్నీ మితిమీరితే తీపి విషాలే!
వీటన్నింటిలోనూ తీపి రుచి మాత్రమే ప్రధానంగా కనిపిస్తుంది కానీ, దేని ప్రభావం దానిది. తేనె తియ్యగా ఉంటుంది. కానీ, బాగా వేడి చేస్తుంది. ఖర్జూరం పండు మరీ వేడి చేస్తుంది. అదే ఎండితే చలవచేస్తుంది. పైనాపిల్ కడుపులో ఆమ్ల సముద్రాన్ని సృష్టిస్తుంది. అంటే, ఇవి తీపిక సంబంధించిన మంచి గుణాల్నిస్తూనే పైత్యాన్ని కూడా కలిగిస్తాయి. వేడి శరీర తత్వం ఉన్నవాళ్లు వేడిచేసే తీపిని తింటే, చలవ కలగకపోగా అపకారం చేస్తుంది. కడుపులో మంట ఉన్న వ్యక్తికి శనగపిండితో చేసిన లడ్డూ మంటని పెంచేదిగానే ఉంటుంది. పంచదారతో పోలిస్తే వేడిని తగ్గించే విషయంలో బెల్లం కొంత నయం. అతిగా తింటే అదీ ‘తీపి విషం’గానే మారిపోతుంది.
డల్లాస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం 2017 మే 26న వెలువరించిన నివేదికలో తీపి రుచికీ ఊపిరితిత్తుల్లో కేన్సర్‌కీ గల సంబంధాన్ని బట్టబయలు చేసింది. డా.జంఘ్‌వ్హాన్ ‘జే’ కిమ్ అనే శాస్తవ్రేత్త కొన్ని రకాల కేన్సర్ కణాలు మానవ శరీరంలో పెరగటానికి కావలసిన శక్తిని శరీరంలో నిల్వ వున్న గ్లూకోజ్ నుండే గ్రహిస్తున్నాయని ప్రకటించాడు. ముఖ్యంగా శ్క్వామస్ కణాలు ఎక్కువగా తీపి మీదే ఆధారపడి పెరుగుతాయని ఆయన పరిశోధన.
తీపి బండి (గ్లూకోజ్ ట్రాన్స్’పోర్టర్ 1దిజశ్రీ1) అనే ప్రొటీన్ శరీరంలోని తీపిని కేన్సర్ కణాలకు అందిస్తుందని ఆయన ప్రతిపాదించాడు. తీపిని మన శరీరావసరాలకు మించి తీసుకుంటే కేన్సర్‌కు గురికావలసి వస్తుందని ఆయన నివేదిక హెచ్చరిస్తోంది. 11 వేల మంది కేన్సర్ రోగుల మీద 33 రకాల కేన్సర్ వ్యాధుల్లో పరిశీలన చేసిన నివేదిక ఇది.
తెలుగువారి భోజనానికి సంబంధించినంత వరకూ వరి అన్నం, మసాలాలు, చింతపండు రసం పోసి వండేవి ఎక్కువ షుగరుని శరీరానికి అందించే విధంగా ఉంటాయి. ఎక్కువ పులుపు, మసాలాలు, నెయ్యి, నూనెలు లేని ఆహారం షుగరుని తక్కువ పెంచుతుంది. దానే్న ఆయుర్వేదం సాత్వికాహారంగా పేర్కొంది.
భోజనమే షుగరు మయంగా ఉంటే, ఇంకా అదనంగా స్వీట్లు, కూల్‌డ్రింక్‌లు, చాక్లెట్లు, ఐస్‌క్రీములు, పాలు, పంచదార కలిసిన కాఫీ, టీలు అతిగా తీసుకోవటం వలన శరీరం మరింత తీపిమయం అవుతుంది. విదేశీ కంపెనీల కూల్‌డ్రింకుల్లాంటి తీపి పదార్థాలను ఎక్కువగా వాడటం దేశానికి, దేహానిక్కూడా అనర్థదాయకమేనని మొదట మనం గమనించాలి.
శరీరంలో తీపి ఎక్కువైతే తీపులు (బాధలు) ఎక్కువౌతాయి. కేన్సర్ కణాలలు స్వేచ్ఛగా పెరగటానికి కావలసినంత తీపిని శరీరం అందిస్తుంటే వ్యాధి తిష్ట వేసేందుకు మనమే సహకరిస్తున్నట్టే కదా. ఎడినోమా కేన్సర్, శ్క్వామస్ కణాల కేన్సర్, ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో వచ్చే కేన్సర్ వ్యాధుల్లో తీపి విషయమై జాగ్రత్తగా ఉండాలి.
ఈ తీపి బండి (గ్లూకోజ్ ట్రాన్స్’పోర్టర్ 1దిజశ్రీ1) ని నియంత్రించేందుకు దిజశ్రీ1 నిరోధక ఔషధాన్ని ఊపిరితిత్తుల్లో కేన్సర్ వచ్చిన ఎలుకల మీద ప్రయోగించి చూశారు. శరీరంలో ఈ ‘తీపిబండి కణాలు’ పెరగటం కేన్సర్ వ్యాధికి సూచన కావచ్చని, వారికి దిజశ్రీ1 నిరోధకం ఇస్తే కేన్సర్ వ్యాధిని కూడా నిరోధించవచ్చని శాస్తవ్రేత్తలు అభిప్రాయపడ్తున్నారు.
ఏ వ్యాధికి ఏ మందులు వాడాలనే అంశం వైద్యులకు సంబంధించింది. జన సామాన్యానికి ‘ఆరోగ్యం కోసమే ఆహారం’ అనే దాన్ని అర్థమయ్యేలా చాటి చెప్పటమే లక్ష్యం కాబట్టి, కేన్సర్ వ్యాధి బారిన పడకుండా తీపిని అదుపులో పెట్టుకోవటం గురించి సాధ్యమైనంత సమాచారాన్ని అందించటం అవసరం. కేన్సర్ కణాలను పోషించే వ్యవస్థని నిర్వీర్యం చేసే బాధ్యత వైద్యులు తీసుకుంటారు. కేన్సర్ రాకమునుపే నిరోధించే బాధ్యతను మనం తీసుకోవాలి.
తీపి వలన షుగరు వ్యాధి ఒక్కటే కాదనీ, కేన్సర్ కూడా రావచ్చుననే వార్త మనల్ని భయపెట్టేదే! అయితే భయపడటం కూడా అవసరమే. మనం రోజువారీగా తినే ఆహార పదార్థాల్లో వేపుడు కూరలు, డీప్ ఫ్రై వంటకాలు, నల్లగా బొగ్గుముక్కలాగా మాడ్చిన పదార్థాలు కేన్సర్‌కు దారితీసేవిగా ఉంటాయి. వీటితోపాటు తీపి పదార్థాలు కూడా కలిస్తే కేన్సర్ వ్యాధి రేపెప్పుడో వచ్చేది నేడే వచ్చే ప్రమాదం ఉంది. అధిక ఉష్ణోగ్రత దగ్గర వండిన ఏ ద్రవ్యానికైనా కేన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అవి స్వీట్లైతే ఇంకా వేగిరంగా కేన్సర్ రావచ్చు. అందుకే ఇంత హెచ్చరిక.
అమెరికన్ వ్యవసాయ సంస్థ 2015లో జరిపిన సర్వేలో సగటు అమెరికన్ పౌరుడు కూల్‌డ్రింక్‌లు, చాక్లెట్లు, ఇంకా ఇతర తీపి పదార్థాలతో పాటు మొక్కజొన్నలతో చేసిన పానీయాలను కనీసంలో కనీసంగా 75 పౌండ్లవరకూ తీసుకుంటున్నాడని చెప్పింది. అన్ని విషయాల్లోనూ అమెరికా ప్రభావాన్ని స్వాగతించే తెలుగు వాళ్లు ఇంతకన్నా తక్కువగా తీపిని తీసుకుంటారని ఊహించనవసరం లేదు. మన సంప్రదాయక స్వీట్లకన్నా కూల్‌డ్రింక్‌లు, ఐస్‌క్రీమ్‌లు, నక్షత్రాల చాక్లెట్లు, జామ్‌లు, డబ్బాల మీద అమెరికన్ బార్ కోడ్ వేసిన పళ్ల రసాలు వీటిని మోజు కొద్దీ అతిగా తీసుకుంటున్నాం.
ఏం తిన్నా తప్పేనంటూ అత్త పోరులా ఇలా చెప్తున్నామని అనుకోకూడదు. మనం పరిమితి దాటి తీపిని శరీరంలోకి కూరుతున్నాం. మన భోజన పదార్థాలలో మసాలాలు, చింతపండు రసం, నూనె వేపుడు పదార్థాల్ని కూర తక్కువగానూ అన్నం ఎక్కువగానూ కలుపుకోవలసి వస్తుంది. ఆ విధంగా వరి అన్నం వలన శరీరంలోకి తీపి ఎక్కువగా వెడుతోంది. అదనంగా స్వీట్లు మరింత తీపిని కడుపులోకి చేరుస్తున్నాయి. కూల్‌డ్రింక్‌లు, బిస్కెట్లు, ఇంకా ఆలూచిప్స్, పాప్‌కార్న్ లాంటివి షుగరుని మరింత పెంచుతాయి.
అన్నం తక్కువ, కూర బాగా ఎక్కువగా తినే విధంగా వంటకాలను మార్చుకోవటం, విదేశీ వ్యామోహంతో కూడిన ద్రవ్యాలను సాధ్యమైనంత వదిలేయటం, పులుపు, మసాలాలకు ప్రాధాన్యత తగ్గించటం, చేదు రుచి కలిగిన కాకర, వేపపూలు, వగరు రుచి కలిగిన మజ్జిగ వీటిని ఎక్కువగా తీసుకునే వారికి కేన్సర్ దూరంగా ఉంటుంది.

సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642